స్మార్ట్‌ఫోన్ లవర్స్‌లో శాంసంగ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ సంస్థ నుంచి ఎలాంటి ఫోన్ వచ్చినా.. ప్రజలను ఆకర్షించడం ఖాయం! తాజాగా.. ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ నుంచి మరో ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కానున్నట్టు సమాచారం. 5జీ సాంకేతికతతో ఫోన్ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది.
ఆ మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎం సిరీస్‌లో.. 5జీతో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుందని అంటున్నాయి.
దీనికి సంబంధించి ఆన్లైన్లో ఇప్పటికే కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో చూసేయండి..
ఫీచర్స్(అంచనా):-
- బ్యాటరీ:- 6,000 ఎంఏహెచ్
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 11, ఆండ్రెనో 619 జీపీయూ
- 4జీబీ ర్యామ్
- 64ఎంపీ క్వాడ్ కెమెరా
ఇదీ చూడండి:- పవర్ 'బుల్' బ్యాంక్‌తో ఛార్జింగ్ కష్టాలకు చెక్
ఎఫ్12 వచ్చేసింది..
మరోవైపు శాంసంగ్ గాలెక్సీ ఎఫ్12.. భారత్‌లో సోమవారం విడుదలైంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గాలెక్సీ ఎఫ్ 12 ఫీచర్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- ఇక 'హలో మోటో'.. 108 మెగాపిక్సెల్స్ కెమెరాతో!