ETV Bharat / science-and-technology

శాంసంగ్​ గెలాక్సీ ఏ22 5జీ.. ఫీచర్స్​ లీక్​! - samsung galaxy a22 5g features

స్మార్ట్​ఫోన్​ ప్రియులకు శుభవార్త. శాంసంగ్​ గెలాక్సీ నుంచి మరో కొత్త మోడల్​ భారత విపణిలోకి అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్​ ఫోన్​ను రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు మూరూ చూసేయండి.

Samsung Galaxy A22 5G price leaked
శాంసంగ్​ గెలాక్సీ 5జీ ఫోన్​ ఫీచర్స్​ లీక్​.. ధర ఎంతంటే?
author img

By

Published : Jul 19, 2021, 4:31 PM IST

శాంసంగ్​ ప్రియులకు గుడ్​ న్యూస్​! గెలాక్సీ సిరీస్​లో మరో మోడల్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాంసంగ్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 5జీ సాంకేతికత ఉంటుందని సమాచారం. ఈ శాంసంగ్​ గెలాక్సీ ఏ22 5జీ(Samsung Galaxy A22 5G).. భారత మార్కెట్​లో ఆగస్టులో విడుదలయ్యే అవకాశమున్నట్టు టెక్​ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో విడుదల తేదీ కన్నా ముందే ఈ ఫోన్​ ధర, ఫీచర్లు లీక్​ అయ్యాయి. గెలాక్సీ ఏ22 5జీ మోడల్ ధర రూ. 19,999గా ఉంటుందని టెక్​ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫోన్​లో రెండు వేరియంట్లను వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురానుంది శాంసంగ్​. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ కలిగిన ఫోన్​ను రూ.19,999లకు.. 8జీబీ+128జీబీ స్టోరేజ్​ కలిగిన వేరియంట్​ను రూ.21,999లకు అందుబాటులోకి తెచ్చే అవకాశముంది.

Samsung Galaxy A22 5G price leaked
శాంసంగ్​ గెలాక్సీ ఏ22 5జీ

ఫీచర్లు(Samsung Galaxy A22 5G feaures)..

  • ఆండ్రాయిడ్​ 11
  • టెక్నాలజీ 5జీ
  • 6.6 అంగుళాల ఎఫ్​హెచ్​డీ టీఎఫ్​టీ 90 హెచ్​జెడ్​ డిస్​ప్లే
  • 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​
  • 1టీబీ ఎక్స్​టెండబుల్​ మెమోరీ కార్డ్​ ఫెసిలిటీ
  • 5,000 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ(15డబ్ల్యూ)
  • మీడియా టెక్​ డైమన్​సిటీ చిప్​సెట్700
  • మూడు బ్యాక్​ కెమెరాలు.. ప్రైమరీ 48ఎంపీ సెన్సార్​, 5ఎంపీ ఆల్ట్రావైడ్​ సెన్సార్, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​. 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​
  • శాంసంగర్​ కోర్​ 3.1 ప్రాసెసర్​

అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ ఫోన్​ ధర, ఫీచర్ల గురించి సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ స్మార్ట్​ఫోన్​ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సంస్థ ప్రకటన కోసం వేచిచూడాల్సిందే.
ఇదీ చూడండి.. భారత విపణిలోకి షియోమీ ఎంఐ 11 లైట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.