ETV Bharat / science-and-technology

వర్జిన్‌ గెలాక్టిక్‌ రోదసి ట్రిప్ విజయవంతం

space trip
రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ ట్రిప్
author img

By

Published : Jul 11, 2021, 5:09 PM IST

Updated : Jul 11, 2021, 9:39 PM IST

21:18 July 11

రోదసీయానం విజయవంతం..

  • వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష యానం విజయవంతం
  • రిచర్డ్‌ బ్రాన్సన్‌ బృందం రోదసి యాత్ర విజయవంతం
  • రోదసిలో 15 నిమిషాలు ఉన్న రిచర్డ్ బ్రాన్సన్ బృందం
  • గంట తర్వాత తిరిగివచ్చిన ఆరుగురు సభ్యుల బృందం
  • బ్రాన్సన్‌ బృందంతో అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన బండ్ల శిరీష
  • రోదసీయానం చేసిన నాలుగో భారతీయురాలుగా బండ్ల శిరీష
  • గతంలో రోదసిలోకి వెళ్లిన రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌
  • బండ్ల శిరీష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా

20:15 July 11

యాత్ర షురూ

బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు. వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22లో రిచర్డ్ సహా ఆరుగురు.. నింగిలోకి దూసుకెళ్లారు. నిర్దేశిత సమయానికి గంటన్నర ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమైంది. వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం ఆలస్యమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

వర్జిన్‌ గెలాక్ట్‌ వ్యోమనౌకలో తెలుగమ్మాయి బండ్ల శిరీష రోదసీలోకి వెళ్తున్నారు. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం అదృష్టమంటూ శిరీష ట్వీట్‌ చేశారు.

ఇప్పటికే 3 సార్లు స్పేస్‌ ఫైట్లను వర్జిన్‌ గెలాక్ట్‌ అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను రోదసీలోకి తీసుకెళ్తోంది.

19:57 July 11

అంతరిక్ష పర్యటన కోసం రిచర్డ్ బ్రాన్సన్.. న్యూమెక్సికోలోని స్పేస్​పోర్ట్​కు చేరుకున్నారు. సైకిల్​పైనే ఈ కేంద్రానికి విచ్చేశారు రిచర్డ్. అంతకుముందు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్​ మస్క్​ను కలిశారు.

రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు సంతతికి చెందిన బండ్ల శిరీష సహా ఆరుగురు కలిసి రోదసిలోకి వెళ్లనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగించే యూనిటీ-22 స్పేస్‌ఫ్లైట్​లో వీరంతా అంతరిక్షానికి పయనం కానున్నారు. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం అదృష్టమంటూ ఈ సందర్భంగా శిరీష ట్వీట్‌ చేశారు. 

వర్జిన్‌ గెలాక్టిక్‌ ఇప్పటికే 3 సార్లు స్పేస్‌ ఫ్లైట్లను అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను రోదసిలోకి తీసుకెళ్తోంది. 

17:24 July 11

space tour
యాత్ర ప్రణాళిక ఇలా..

బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్ష పర్యటనకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రిచర్డ్, ఆయన బృందం కలిసి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగించే యూనిటీ22 వ్యోమనౌక ద్వారా వీరు రోదసిలోకి వెళ్లనున్నారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు యూనిటీ 22 లాంచ్ ఉంటుందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30కు వీరి ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పాట్లు ఆలస్యమయ్యాయని సంస్థ తెలిపింది. ఈరోజే వ్యోమనౌక నింగిలోకి ఎగురుతుందని స్పష్టం చేసింది. 

ఏంటి యాత్ర?

అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వర్జిన్ గెలాక్టిన్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్ ఈ రోదసీయానం చేపడుతున్నారు. మరో ఐదుగురిని తన వెంట తీసుకెళ్తున్నారు.

యాత్రలో పాల్గొనేది వీరే..

  1. రిచర్డ్​ బ్రాన్సన్​- వర్జిన్​ గెలాక్టిక్​ వ్యవస్థాపకుడు
  2. బెత్​ మాసెస్​- వర్జిన్​ గెలాక్టిక్​ చీఫ్​ ఆస్ట్రోనాట్​ ఇన్​స్ట్రక్టర్​
  3. కోలిన్​ బెన్నెత్​- లీడ్​ ఆపరేషన్స్​ ఇంజినీర్​
  4. శిరీష బండ్ల- గెలాక్టిక్​ ఉపాధ్యక్షురాలు
  5. డేవ్​ మక్​కే- ఎయిర్​క్రాఫ్ట్​ పైలట్​
  6. మైఖల్​ మసూచీ- ఎయిర్​క్రాఫ్ట్​ పైలట్​

తెలుగు కీర్తి పతాకం

తెలుగు మూలాలున్న బండ్ల శిరీష కూడా ఇదే బృందంలో సభ్యురాలిగా ఉన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారతీయ వనితగా శిరీష ఖ్యాతినార్జించనున్నారు.

ఈ 'వర్జిన్ గెలాక్టిక్' ఏంటి?

వర్జిన్ గెలాక్టిక్ అనేది అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ. అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంస్థ 17ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. కొన్ని ప్రయోగాలు విఫలమైనా అంతిమంగా రోదసిలోకి వెళ్లే సాంకేతికతను ఒడిసి పట్టింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్‌ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపింది. నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

ఎలా వెళ్తారు?

వర్జిన్ గెలాక్టిక్ ప్రత్యేకంగా రూపొందించిన ప్లేన్ క్యారియర్ ద్వారా భూమి నుంచి స్పేస్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఈ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లాక దాని నుంచి స్పేస్ ఫ్లైట్‌ వేరుపడుతుంది. క్యారియర్‌ నుంచి వేరు పడే సమయంలో స్పేస్ ఫ్లైట్ కూడా రాకెట్‌‌‌‌‌‌‌‌లానే నిప్పులు చిమ్ముతూ పైకి దూసుకెళ్తుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక నిలువుగా వెళ్లే ఫ్లైట్ అడ్డంగా మారుతుంది. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అక్కడ దానిలోని వ్యోమగాములు జీరో గ్రావిటీ అనుభూతిని పొందుతారు. కొంత సమయం అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

యాత్ర ఎందుకింత ప్రత్యేకం?

ఓ ప్రైవేటు సంస్థ మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండటం ఇదే తొలిసారి. అంతరిక్ష పర్యటకాన్ని సామాన్యుడికి అందించే లక్ష్యంతో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి సఫలమైతే.. పర్యాటక రంగానికి సరిహద్దులు చెరిగిపోతాయి. అంతరిక్షం ఓ పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే అంతరిక్షానికి వెళ్లాలనుకున్న 600 మందికి పైగా ఆశావాహుల పేర్లను వర్జిన్ గెలాక్టిక్ నమోదు చేసుకుంది.

16:49 July 11

రిచర్డ్ రోదసి ట్రిప్ షెడ్యూల్ మార్పు- యాత్ర ఎప్పుడంటే?

richard branson
రిచర్డ్ బ్రాన్సన్- వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు

బ్రిటన్ కుబేరుడు రిచర్డ్​ బ్రాన్సన్ రోదసి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30కు వీరి ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉండగా.. వాతావరణ కారణాలతో ఈ సమయాన్ని మార్చారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు యూనిటీ 22 లాంచ్ ఉంటుందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు.. ఏర్పాట్లను ఆలస్యం చేశాయని పేర్కొంది. అయినప్పటికీ.. ఈరోజే వ్యోమనౌక నింగిలోకి ఎగురుతుందని స్పష్టం చేసింది.

Last Updated : Jul 11, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.