Redmi Note 13 Series Launch : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ షావోమీ మరో మిడ్-రేంజ్ రెడ్‌మీ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ పేరుతో ఈ ప్రోడక్ట్‌ను గురువారం జరిగిన ఓ ఈవెంట్లో లాంఛ్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని Xiaomi ఇండియా అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం చేశారు. కాగా, ఈ సిరీస్ మోడల్ గతేడాది సెప్టెంబర్‌లోనే చైనాలో లాంఛ్ అయింది. ఇక 3 మోడళ్లలో రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ ఫోన్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఐఫోన్ 15 కెమెరా కంటే మెరుగ్గా!
Redmi Note 4Gతో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన షావోమీ తన 10 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటోంది. Redmi Note 13 Pro+ 5G కెమెరా పనితీరు ప్రస్తుతం హవా సృష్టిస్తోన్న iPhone 15 Pro Maxతో పాటు శామ్సంగ్ S23 అల్ట్రా కంటే మెరుగ్గా ఉన్నాయని రెడ్‌మీ కంపెనీ పేర్కొంది. Redmi Note 13 Pro+ 5G జనవరి 10న ఉదయం 10 గంటలకు Mi.com, Mi Home, Flipkartతో పాటు Xiaomi రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి రూ.2,000 వరకు డిస్కౌంట్స్‌ను పొందవచ్చని తెలిపింది. ఇక రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.
Redmi Note 13 5G సిరీస్ మోడళ్లు :
- Redmi Note 13 5G క్లాసిక్
- Redmi Note 13 Pro 5G
- Redmi Note 13 Pro Plus 5G
200 MP కెమెరా
Redmi Note 13 Pro+ 5G మొదటి 'ట్రూ' 200MP కెమెరాను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. కెమెరాకు సంబంధించి మెరుగైన ఫొటోలు, వీడియోల క్వాలిటీ కోసం శామ్సంగ్, MediaTek సంస్థలతో కలిసి పనిచేసినట్లు వివరించింది షావోమీ.
HyperOS స్క్రీన్
Redmi డివైజ్ ప్రియులు ఎంతగానో వేచి చూసిన Xiaomi కొత్త HyperOS స్కిన్‌ను తాజాగా విడుదల చేసిన Redmi Note 13 5G సిరీస్‌లో గమనించవచ్చు. దాదాపు అన్ని డివైజుల్లో పనిచేసేలా దీని ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు రెడ్‌మీ తెలిపింది.
ఫ్యూజన్ డిజైన్
రెడ్‌మీ నోట్ 13 ప్రో+లో ఫ్యూజన్ డిజైన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది వాటర్‌ప్రూఫ్ వేగన్ లెదర్ బ్యాక్‌తో వస్తుంది. నానోస్కేల్ వేర్-రెసిస్టెంట్ ఇంక్ టెక్నాలజీతో దీని వెనక భాగాన్ని ప్రింట్ చేశారు.
డిస్ప్లే
Redmi Note 13 Pro+ 6.67-అంగుళాలతో 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800 nits గరిష్ఠమైన ప్రకాశంతో DOLBY Vision Atmosను సపోర్ట్ చేస్తుంది.
చిప్‌సెట్
4nm ప్రాసెస్ ఆధారంగా MediaTekకు చెందిన డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను వినియోగించిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ Redmi Note 13 Pro+ అని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ NFC సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జర్ కెపాసిటీతో వస్తుంది.
త్వరలో బడ్స్
రెడ్‌మీ నోట్ 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్ డివైజ్‌తో పాటు Redmi Buds 5 పేరుతో ఇయర్‌బడ్స్, షావోమీ పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్ కప్‌లను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది కంపెనీ.
కారు మైలేజీ పెంచుకోవాలా? ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎదురే ఉండదు!
ఆర్థిక లక్ష్యాల సాధన కోసం - బెస్ట్ 'సొల్యూషన్ ఓరియెంటెడ్' మ్యూచువల్ ఫండ్స్ ఇవే!