ETV Bharat / science-and-technology

బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో రియల్​మీ కొత్త ఫోన్

Realme C35: ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్​ రియల్​మీ సీ35ను విడుదల చేసింది. ఇది స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలు మీకోసం..

author img

By

Published : Mar 7, 2022, 6:58 PM IST

realme c35
realme c35 specs

Realme C35: బడ్జెట్ రేంజ్​లో కొత్తగా ఫోన్ తీసుకోవాలనుకునేవారి కోసం ఆసక్తికర ఫీచర్లతో కొత్త మోడల్​ను తీసుకొచ్చింది రియల్​మీ. అదే సీ35. భారత్​లో సోమవారం ఈ మొబైల్​ను విడుదల చేసింది. సీ35 ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

సీ35 ఫీచర్లు..

  • ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
  • 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వస్తోంది.
  • ఆక్టాకోర్ యూనిసాక్‌ టీ616 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్ ర్యామ్ ఇస్తున్నారు.
    realme c35
    రియల్​మీ సీ35
  • ఈ ఫోన్‌లో వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. రియల్​మీ జీటీ2లో అందించే 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు వెనుకవైపు మరో రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు.
  • ముందు సోనీ ఐఎంఎక్స్​355 లెన్స్​తో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
  • 128జీబీతో రియల్​మీ సీ35 రానుంది. దానిని 256జీబీకి పెంచుకునే అవకాశం ఉంది.
  • రియల్‌మీ సీ35లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
    realme c35
    రియల్​మీ సీ35

సీ35 ధర..

రెండు వేరియంట్లలో రియల్‌మీ సీ35 అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,999. 4 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 12,999.

గ్లోయింగ్​ బ్లాక్​, గ్లోయింగ్​ గ్రీన్​ రంగుల్లో మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి ఈ ఫోన్​ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లతోపాటు రియల్‌మీ అవుట్‌లెట్లలో అమ్మకాలు మొదలవుతాయి.

ఇదీ చూడండి: అద్భుతమైన ఫీచర్స్​తో స్మార్ట్​ఫోన్స్​.. వీటిపై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.