ETV Bharat / science-and-technology

భూమివైపు దూసుకొస్తున్న సౌర తుపాను- వాటిపై ప్రభావం! - దూసుకొస్తున్న సౌర తుఫాను

ఊహించనంత వేగంతో భూమివైపు సౌర తుపాను దూసుకొస్తోంది. సూర్యుడి వాతావరణంలో ఆవిర్భవించిన ఈ తుపాను.. సోమవారం లోపు భూమిని తాకే అవకాశం ఉంది. దీని వల్ల తలెత్తే ప్రభావాలేంటంటే...!

SOLAR STORM
భూమికి సౌర తుపాను ముప్పు- వాటిపై ప్రభావం!
author img

By

Published : Jul 11, 2021, 8:55 PM IST

భూమికి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శక్తిమంతమైన సోలార్ తుపాను భూమి దిశగా పయనిస్తోంది. దీని వల్ల జీపీఎస్, సెల్​ఫోన్ సిగ్నళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

స్పేస్​వెదర్ డాట్ కామ్ అనే వెబ్​సైట్ ప్రకారం.. సూర్యుడి వాతావరణంలో ఆవిర్భవించిన ఈ తుపాను వల్ల భూమిపై ప్రభావం పడనుంది. గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ఇది భూమివైపు దూసుకొస్తోంది. సోమవారం లోపు ఈ తుపాను భూమిని తాకొచ్చని అంచనా.

అవి పేలిపోయే ప్రమాదం!

ఈ సౌర తుపాను కారణంగా సమాచార వ్యవస్థపై ప్రభావం పడుతుందని స్పేస్​వెదర్ వెబ్​సైట్ పేర్కొంది. భూఉష్ణోగ్రత పెరుగుతుందని, తద్వారా శాటిలైట్లు ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయని తెలిపింది. ఫలితంగా జీపీఎస్ నేవిగేషన్, శాటిలైట్ టీవీలు, మొబైల్ సిగ్నళ్లకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్​ఫార్మర్​లు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మరోవైపు, సోలార్ తుపాను కారణంగా ధ్రువప్రాంతాల్లో ఉండేవారికి అద్భుతమైన ఖగోళ దృశ్యాలు కనిపిస్తాయని స్పేస్​వెదర్ తెలిపింది. రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి కనువిందు చేస్తుందని పేర్కొంది.

ఇదీ చదవండి: 108 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ కార్చిచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.