ETV Bharat / science-and-technology

Power Banks: రూ. 1000లోపు ది బెస్ట్ పవర్‌ బ్యాంక్స్‌ ఇవే..!

author img

By

Published : Dec 21, 2021, 5:25 PM IST

Power Banks: ఏ ఫోన్‌కైనా బ్యాటరీ ప్రాణం. ఏ స్మార్ట్‌ఫోన్‌ కొనాలన్నా.. ముందు బ్యాటరీ బ్యాకప్‌ చూసే కొంటాం. ఫోన్‌ బ్యాకప్‌ ఎంత ఉన్నా కొన్నిసార్లు ఛార్జింగ్‌ పెట్టడం మర్చిపోవడమో లేక ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఛార్జింగ్‌ పెట్టుకోలేని పరిస్థితులు ఎదురవడమో జరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఫోన్‌ డెడ్‌ అవ్వొచ్చు. అప్పుడే మనకు పవర్‌ బ్యాంక్‌తో అవసరం పడుతుంది. కొంచెం ఖరీదెక్కువని చాలా మంది కొనరు. కానీ రూ. వెయ్యి లోపలే చాలా మంచి పవర్‌ బ్యాంక్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓసారి చూడండి..

Power Banks
పవర్‌ బ్యాంక్స్‌

Power Banks: దూర ప్రయాణాలు చేసేప్పుడు ఫోన్ డెడ్​ కాకుండా పవర్ బ్యాంక్స్​ ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. మరి వెయ్యి లోపలే మంచి పవర్ బ్యాంక్స్​ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓసారి చూసేయండి మరి..!

Mi Power Bank 3i:

Power Banks
ఎంఐ పవర్‌ బ్యాంక్‌ 3ఐ

Best Power Bank Under 1000: 10,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో షావోమీ ఎంఐ పవర్‌ బ్యాంక్‌ 3ఐ వస్తుంది. దీని ధర రూ.899. ఎంఐ.కామ్, అమెజాన్‌, రిలయన్స్‌ డిజిటల్‌ వంటి ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో దొరుకుతున్నాయి. 2వే ఫాస్ట్ ఛార్జింగ్‌, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్‌-సీ ఛార్జింగ్‌, మైక్రో-యుఎస్‌బీ పోర్ట్‌, లోపవర్‌ మోడ్ వంటి ఫీచర్స్ ఈ పవర్‌ బ్యాంక్‌లో ఉన్నాయి. డ్యూయల్ యుఎస్‌బీ అవుట్‌పుట్‌ ఇవ్వడంతో ఒకే సారి రెండు డివైజ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు.

Ambrane Power Bank:

Power Banks
10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో పవర్ బ్యాంక్​

10,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. డ్యూయల్‌ యుఎస్‌బీ పోర్ట్స్‌, టైప్‌-సీ పోర్ట్ ఉన్నాయి. 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో నలుపు, తెలుపు రంగుల్లో విక్రయిస్తున్నారు. అమెజాన్‌ వెబ్‌ స్టోర్స్‌లో రూ. 699కే ఈ పవర్‌ బ్యాంక్‌ లభ్యమవుతోంది.

Realme Power Bank 2i:

Power Banks
రియల్‌మీ పవర్‌ బ్యాంక్‌ 2i

రియల్‌మీ పవర్‌ బ్యాంక్‌ 10,000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో రూ.899కే లభిస్తోంది. రెండు యూఎస్‌బీ- A పోర్ట్స్‌, టైప్‌-సీ, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 12W 2వే క్విక్‌ ఛార్జ్‌, షార్ట్‌ సర్క్యూట్‌ వంటి వాటి నుంచి రక్షణగా 14-లేయర్‌ సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్‌, రియల్‌మీ.కామ్‌, విజయ్‌ సేల్స్‌, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయొచ్చు.

ZEB-MD20000G3:

Power Banks
జీబ్రానిక్స్‌- 20,000mAH

₹1000 లోపలే అత్యధికంగా 20,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌తో జీబ్రానిక్స్‌ ZEB-MD20000G3 మోడల్‌ వస్తుంది. ఎల్‌ఈడీ పర్సంటేజ్‌ ఇండికేటర్‌తో వస్తున్న ఈ పవర్‌ బ్యాంక్‌ అమెజాన్ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో రూ.949కే లభ్యమవుతోంది. 12W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో పాటు ఔట్‌పుట్‌ కోసం రెండు యూఎస్‌బీ-ఏ పోర్ట్స్‌, యూఎస్‌బీ టైప్‌- సీ, ఇన్‌పుట్‌ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. ఈ పవర్‌బ్యాంక్‌కు అదనపు ఆకర్షణగా ఎల్‌ఈడీ టార్చ్‌ను కూడా అమర్చారు.

Syska P1037 Power Bank:

Power Banks
సిస్కా పవర్‌ బ్యాంక్‌

సిస్కా p-1037 పవర్‌బ్యాంక్‌ 10,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో రెండు యూఎస్‌బీ, ఒక మైక్రో- యూఎస్‌బీ, యూఎస్‌బీ-సీ పోర్ట్‌లను ఇస్తున్నారు. బ్యాటరీ ఎంత శాతం ఛార్జింగ్ ఉందనేది డిస్‌ప్లేలో చూపిస్తుంది. 12W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో వస్తోంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో రూ.999 ధరకు అందుబాటులో ఉంది.

Ambrane 10,000mAh Power Bank:

Power Banks
₹899కే 15,000mAH

15,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో వచ్చే అంబ్రేన్‌ పవర్‌ బ్యాంక్‌ డ్యూయల్‌ యూఎస్‌బీ- A పోర్ట్స్‌, యూఎస్‌బీ టైప్‌-సీ, మైక్రో యుఎస్‌బీ పోర్ట్స్‌తో వస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌ వంటి వాటి నుంచి రక్షణగా 9 లేయర్‌ ప్రొటెక్షన్‌తో హై క్వాలిటీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్‌ అయ్యేందుకు పది నుంచి 12 గంటల సమయం పడుతుంది. రబ్బర్ ఫినిషింగ్‌ ఇవ్వడంతో గీతలు, స్క్రాచ్‌ల నుంచి కాపాడుకోవచ్చు. రూ. 899కే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో దొరుకుతోంది.

Philips Power Bank:

Power Banks
ఫిలిప్స్‌ పవర్‌ బ్యాంక్‌

ఫిలిప్స్‌ 11,000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ ఛార్జింగ్‌ ఇండికేటర్‌, టార్చ్‌, వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా లభిస్తుంది. దీంట్లో ఔట్‌పుట్‌ కోసం మూడు యుఎస్‌బీ-A పోర్టులు ఇచ్చారు. అంటే ఒకేసారి మూడు డివైజ్‌లకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఇన్‌పుట్‌ కోసం ఒక మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇస్తున్నారు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేందుకు ఏడు గంటల సమయం పడుతుంది. దీని ధర రూ.899గా ఉంది.

Lenovo Power Bank:

Power Banks
లెనోవో-10400mAH

లెనోవో PA 10400 ఎంఏహెచ్‌ గల పవర్‌ బ్యాంక్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.899కే లభిస్తుంది. ఇన్‌పుట్‌లో రెండు యూఎస్‌బీ పోర్ట్స్‌, ఒక మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తోంది. ఈ పవర్‌బ్యాంక్‌లో ఛార్జింగ్‌ ఇండికేటర్‌ కూడా ఉంది. ఛార్జింగ్ ఫుల్‌ అయితే మనల్ని అలర్ట్‌ చేస్తుంది.

గమనిక: ఇ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ అందించే ఆఫర్ల ఆధారంగా పవర్‌ బ్యాంక్‌ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

ఇదీ చదవండి: జంబో బ్యాటరీతో వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​!
షియోమీ నుంచి సరికొత్త మొబైల్​- ఫీచర్లు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.