ETV Bharat / science-and-technology

ఆ యూట్యూబర్​తో మస్క్​ కంపెనీకి తిప్పలు! - రిక్ రీబిల్డ్స్ యూట్యూబ్ చానల్

టెస్లా వంటి కార్లు కొనాలంటే చాలా డబ్బులు వెనకేసి ఉండాలి. వాటికి మరమ్మత్తులు చేయించాలన్నా అంతే! అయితే అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్​.. టెస్లా కారును చౌకగా రిపేరు చేస్తున్నాడు. దీంతో కారు యజమానులకు భారీగా డబ్బులు మిగులుతున్నాయి. ఇటీవలే.. కారులో సమస్య వచ్చిందంటూ కంపెనీ సర్వీస్​ సెంటర్​కు వెళ్లిన ఓ వ్యక్తి.. మరమ్మత్తు కోసం వాళ్లు చెప్పిన ధర విని షాక్​ అయ్యాడు. కానీ ఆ యూట్యూబర్​ దగ్గరకు వెళితే.. కంపెనీ చెప్పిన ధరకు 23 రెట్లు తక్కువకే పని పూర్తవడం విశేషం.

tesla
టెస్లా
author img

By

Published : Jul 27, 2021, 5:31 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. అమెరికాకు చెందిన 'టెస్లా' గుర్తింపు పొందింది. అలాంటిది పొరపాటున కారుకు చిన్న గీతపడినా.. అంతే పరిస్థితి! రిపేరింగ్​కు సైతం భారీ స్థాయిలో ఖర్చు తప్పదు. అమెరికాలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కారు రిపేర్​ కోసం కంపెనీ సెంటర్​కు వెళితే దిమ్మతిరిగే ధర చెప్పారు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో యజమాని ఉండగా.. ఓ యూట్యూబర్​​ ఆయన సమస్యను పరిష్కరించాడు. అది కూడా కంపెనీ చెప్పిన ధరకు 23రేట్లు తక్కువకే! ఈ కథ ఇప్పడు అమెరికాలో హాట్​టాపిక్​గా మారింది. అసలేం జరిగిందంటే...

'టెస్లా' చిక్కులు..

ఇటీవల ఓ వ్యక్తి కారులో సమస్య ఏర్పడింది. టెస్లా సర్వీస్​ సెంటర్​కు వెళ్లగా.. రిపేరు చేసేందుకు దాదాపు రూ.12 లక్షల వ్యయం అవుతుందని చెప్పారు.

"కారులోని బ్యాటరీ-కూలెంట్ అనుసంధాన మార్గంలో సమస్య తలెత్తగా.. టెస్లా సేవా కేంద్రాన్ని సంప్రదించాను. అయితే మొత్తం బ్యాటరీని మార్చాలని వారు సూచించారు. దీనికి 16వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ రిపేరింగ్​కి బీమా వర్తించదని తెలిసి షాక్​ అయ్యాను."

-వాహన యజమాని

ఈ స్థితిలో.. ఓ ఆన్​లైన్​ గ్రూప్​ ద్వారా 'రిక్​ రీబిల్డ్స్​' అనే యూట్యూబ్​ ఛానెల్​ గురించి తెలిసింది. వెంటనే తన కారును ఆ ఛానెల్​కు చెందిన రిచ్​ బెనాయిట్​ వద్దకు తీసుకెళ్లాడు ఆ యజమాని.

బెనాయిట్.. ఇంతకుముందే!

ఈ తరహా సమస్యను ఇతర టెస్లా కార్లలో గుర్తించినట్లు యూట్యూబర్ బెనాయిట్ తెలిపాడు. తన బృందంతో కలిసి ఇలాంటి సమస్యలకు ఇదివరకే పరిష్కారం చూపినట్లు వివరించాడు. ఇలా.. రూ. 52వేలకే పనిని పూర్తిచేసేశాడు.

"కేవలం 700 డాలర్లలోనే ఈ రిపేరింగ్​ని చేయగలిగాను. ఇది టెస్లా సర్వీస్ సెంటర్ అంచనా వేసిన దానికంటే దాదాపు 23 రెట్లు తక్కువ."

-బెనాయిట్

ఈ వీడియోను బెనాయిట్​ తన యూట్యూబ్​ ఛానెల్​లో అప్లోడ్​ చేయగా.. అది కాస్తా వైరల్​గా మారింది.

ఈ పూర్తి వ్యవహారంపై స్థానిక మీడియా 'టెస్లా'ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ టెస్లా జవాబులేమీ ఇవ్వలేదు.

రైట్ టూ రిపేర్..

ప్రస్తుత సమస్య.. 'రైట్ టూ రిపేర్' ఉద్యమ ప్రాముఖ్యతను తెలియజేస్తోందని యూట్యూబర్ బెనాయిట్ తెలిపారు. వినియోగదారులు తమ వస్తువులను ఎక్కడైనా రిపేర్ చేయించుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని.. అలా చేయకుండా నిరోధించే హక్కు కంపెనీలకు లేదని వాదించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.