ETV Bharat / science-and-technology

'ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటే కీలకం'

కరోనా బాధితుల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటు ద్వారా వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రెండు అంశాలను ఇంటివద్దే పరీక్షించుకునే వీలుందని వివరించారు.

oxygen level
ఆక్సిజన్ స్థాయి
author img

By

Published : May 26, 2021, 6:57 AM IST

కొవిడ్-19 బాధితుల్లో మరణం ముప్పును ముందే అంచనా వేయడానికి రెండు సంకేతాలు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటును తెలుసుకోవటం ద్వారా వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందన్నదానిపై అవగాహనకు రావొచ్చని చెప్పారు. ఈ రెండు అంశాలను ఇంటివద్దే పరీక్షించుకునే వీలుందని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

అప్పుడే వైద్యసాయం..

కొవిడ్​తో ఆసుపత్రులపాలైన 11 వందల మందిపై ఈ అధ్యయనం సాగించారు. కరోనా బారినపడిన వారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిపడటం, ఛాతీపై ఒత్తిడి లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడే వైద్య సాయం కోరాలని అమెరికాలోని 'సెంటర్స్​ ఫర్​ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' మార్గదర్శకాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే శ్వాస రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పుడూ కొందరిలో ఈ సంకేతాలు ఉండవని చెప్పారు. ఇలాంటివారు తమకు వైద్యసాయం అవసరమని గుర్తించి, ఆస్పత్రిలో చేరే సమయానికి.. వారిని కాపాడటానికి ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయని పరిశోధనలో పాల్గొన్న నీల్ ఛటర్జీ తెలిపారు.

వారికి ముప్పు ఎక్కువ..

తాము పరిశీలించిన రోగుల్లో అనేకమందికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తరచూ 91 శాతం కన్నా తక్కువగా పడిపోవటం( హైపాక్సీమియా), శ్వాస రేటు నిమిషానికి 23 సార్లకు పెరిగిపోయి ఎగశ్వాసతో(టకీపినియా) ఇబ్బందిపడటాన్ని గుర్తించామని చెప్పారు. ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే ఆస్పత్రిలో చేరినవారితో పోలిస్తే హైపాక్సీమియా రోగుల్లో మరణం ముప్పు 1.8-4 రెట్లు ఎక్కవని గుర్తించినట్లు నీల్ చెప్పారు. శ్వాసరేటు సాధారణంగా ఉన్నప్పుడే ఆసుపత్రిలో చేరినవారితో పోలిస్తే టకీపనియాతో చేరినవారిలో మరణం ముప్పు 1.9 నుంచి 3.2 రెట్లు ఎక్కువని తెలిపారు.

హైపాక్సిమియా, టకీపినియాలతో ఉన్నవారికి అదనపు ఆక్సిజన్, ఇన్​ఫ్లమేషన్​ను తగ్గించే గ్లూకోకార్డికాయిడ్ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అదనపు ఆక్సిజన్ ద్వారా రోగుల్లో ప్రాణవాయువు శాచురేషన్​ను 92-96 శాతం వద్ద కొనసాగించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి : దేశంలో 9.54 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.