ETV Bharat / science-and-technology

విద్యార్థులు మెచ్చిన సరికొత్త టెక్నాలజీలు ఇవే!

ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రాధాన్యం ఏటా పెరుగుతోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను త్వరితగతిన అందించాలనే ఉద్దేశంతో పరిశ్రమలన్నీ సాంకేతికతను స్వాగతిస్తున్నాయి. దీంతో ఉద్యోగావకాశాలెన్నిటికో ఆస్కారం ఏర్పడుతోంది. మంచి భవిష్యత్తు, ఆకర్షణీయమైన వేతనాలూ తోడవుతుండటంతో దీనిలో కెరియర్‌ను మలచుకోవాలనుకునేవారి సంఖ్యా పెరుగుతోంది. అయితే కెరియర్‌ సజావుగా సాగాలంటే తమకు నప్పేదేదో.. భవిష్యత్‌ వేటికుందో తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి!

opportunities for students with new technologies in every field
విద్యార్థులు మెచ్చిన సరికొత్త టెక్నాలజీలు ఇవే!
author img

By

Published : Mar 2, 2021, 2:00 PM IST

రంగంతో సంబంధం లేకుండా టెక్నాలజీ అవసరం పెరుగుతోంది. గత ఏడాది పరిస్థితినే తీసుకోండి! కొన్ని నెలలపాటు ఇంటి నుంచి కదలకుండానే పనులన్నీ చక్కబెట్టుకునే వీలు టెక్నాలజీ వల్ల కలిగింది. నిజానికి టెక్నాలజీ ప్రమేయం కొత్తదేమీ కాదు. గత దశాబ్ద కాలంగా దీనికి ఆదరణ విపరీతంగా పెరిగింది. అందుకే ఎక్కువమంది ఎంచుకునే కెరియర్లలో ఇదీ ఒకటిగా కొనసాగుతోంది. కానీ గత ఏడాది పరిస్థితి తరువాత ఎక్కువమంది తాజా విద్యార్థుల దృష్టి దీనిపై పడిందనేది నిపుణుల మాట. అయితే సాంకేతిక రంగంలో కొత్త ఆలోచనలకూ గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలో భవిష్యత్‌ అవకాశాలను అందించే ఎన్నో టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు వాటి గురించి తెలుసుకుని, నచ్చిన దానిపై పట్టు సాధిస్తే కెరియర్‌ మార్గం సుగమం అవుతుంది. అలా ఆదరణ పెరుగుతున్నవాటిని ఓసారి పరిశీలిస్తే..!

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌

వాయిస్‌ రికగ్నిషన్, నేవిగేషన్, షాపింగ్‌ సజెషన్స్‌.. చెప్పుకుంటూపోతే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఉదాహరణలెన్నో. మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ని ఏఐకి ఉపవిభాగంగా పరిగణిస్తారు. ఏఐని వేదిక అనుకుంటే మెషిన్‌ లర్నింగ్‌ను ఆ వేదిక ఆధారంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీగా చెప్పొచ్చు. ఇవి ఇన్‌పుట్‌గా ఇచ్చిన డేటాను విశ్లేషించి, మానవ ప్రమేయం లేకుండానే ప్రోగ్రామ్‌ చేసుకుని, కావాల్సిన పనిని నిర్వర్తిస్తాయి. ఇక్కడ ప్రతి పనికీ ప్రత్యేకంగా ప్రోగ్రామ్‌ చేయాల్సిన పని ఉండదు.

డిజిటలైజేషన్, ఇంటర్నెట్‌ ప్రాచుర్యం, చవక ధరలకే డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రావడం.. వంటి ఎన్నో కారణాలు వెరసి ఎంతో డేటా ఉత్పత్తి అవుతోంది. దీని నిర్వహణ, భద్రత, విశ్లేషణ మానవ తరం కాదు. ఒక చిన్న పొరబాటు తీవ్ర పరిణామాలకు, నష్టానికీ దారి తీసే వీలుంది. ఈ సమస్యలకు ఏఐ అండ్‌ ఎంఎల్‌ సమాధానంగా నిలుస్తోంది. అందుకే రోజువారీ జీవితంలో దీని ప్రమేయం పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీగానూ చెప్పొచ్చు.

ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీనిలో కెరియర్‌ నిర్మించుకోవాలనుకుంటే లోతైన గణిత, గణాంక శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి. ఆపై ఏఐ, మెషిన్‌ లర్నింగ్, న్యూరల్‌ నెట్‌వర్క్స్, డీప్‌లర్నింగ్‌ సంబంధిత కోర్సులపై దృష్టిపెట్టొచ్చు.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)

మొబైల్‌ ఫోన్‌తో ఎక్కడో ఉండి, టీవీ, ఏసీ, ఒవెన్‌లను ఆన్‌/ ఆఫ్‌ చేయడం.. దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంటర్నెట్‌ను ఎలక్ట్రానిక్‌ సాధనాలను అనుసంధానించడమే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌. వైద్య, వ్యాపార పరంగానూ సేవలను వేగవంతం చేయడానికీ, అత్యుత్తమ కస్టమర్‌ సర్వీస్‌లను అందించడంలో దీని పాత్ర పెరుగుతోంది. ఐఓటీ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌కు ఎక్కువ జీతం అందించే ఉద్యోగాల్లో ఒకటిగా పేరుంది. అయితే దీనిలో రాణించడానికి మంచి నాయకత్వ లక్షణాలూ తప్పనిసరే.

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ

సాఫ్ట్‌వేర్‌ రంగంలో డేటా చౌర్యం లేదా నాశనం ఓ పెద్ద సవాలు. వివిధ వైరస్‌లు, హ్యాకింగ్, స్పామ్‌.. వీటన్నింటి నుంచి రక్షించే మార్గం బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. ఇక్కడ చేర్చిన సమాచారం అంతా వివిధ బ్లాకుల్లో భద్రపరిచి ఉంటుంది. పైగా సమాచారం ఎవరి నియంత్రణలోనూ ఉండదు. సంబంధిత నిపుణులను బ్లాక్‌ చెయిన్‌ జనరలిస్ట్, స్మార్ట్‌ కాంట్రాక్ట్‌ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ ఎక్స్‌పర్ట్‌లు మొదలైన హోదాల్లోకి తీసుకుంటారు. కోడింగ్‌పై అవగాహన ఉన్నవారికీ, కోడింగ్‌పై పట్టు ఉన్నవారికీ వేర్వేరు బాధ్యతలుంటాయి.

సైబర్‌ సెక్యూరిటీ

ఇంటర్నెట్‌ దాదాపుగా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు నేరాలూ పెరిగాయి. వీటిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే- సైబర్‌ సెక్యూరిటీ. సంస్థల రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి, ఇంటర్నెట్‌ ఉన్నంతకాలం ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో సంబంధిత నిపుణులకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. పైగా వీరి అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐ, ఎంఎల్‌లనూ ఉపయోగిస్తున్నారు.

5 జీ

సాంకేతిక పరమైన విప్లవంగా 5జీని అభివర్ణిస్తుంటారు. వీఆర్, ఏఆర్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఆధారిత సేవలకు వీలు కల్పిస్తుంది. భద్రత, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, స్మార్ట్‌ గ్రిడ్‌ కంట్రోల్, హెచ్‌డీ కెమెరాలు మొదలైనవాటిల్లో దీనిని ఉపయోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెలికాం సంస్థలూ 5జీ అప్లికేషన్లను ప్రవేశపెట్టడంలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

రొబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ)

సంస్థల విషయానికొస్తే.. కొన్ని రోజువారీ కార్యకలాపాలు ఉంటాయి. ఉదాహరణకు- వచ్చిన ఈమెయిల్స్‌ను పరిశీలించి వాటికి సమాధానం ఇవ్వడం. నియామకాల విషయానికొస్తే కొన్ని వందల, వేల దరఖాస్తులు వస్తుంటాయి. వాటన్నింటినీ పరిశీలించడం, అర్హులైనవారికి ఇంటర్వ్యూ నిమిత్తం పిలుపునివ్వడం. వీటిని పూర్తిచేయడానికి వ్యక్తులకు కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి కొన్ని రోజులూ పట్టొచ్చు. ఆర్‌పీఏ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఆర్‌పీఏ టూల్స్‌ సాయంతో ట్రాన్సాక్షన్‌ ప్రాసెసింగ్, సమాచార నిర్వహణ, ఈమెయిళ్లకు సమాధానాలు పంపడం వంటివి వేగవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. ఇది ఎన్నో కెరియర్‌ అవకాశాలను కల్పిస్తోంది. వ్యాపారపరంగా ఎదురయ్యే సవాళ్లకు సరైన పరిష్కారం చూపగల నైపుణ్యం ఉంటే మంచి అవకాశాలు అందుకోవచ్చు. నైపుణ్యం ఉన్నవారిని డెవలపర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, బిజినెస్‌ అనలిస్ట్‌.. వంటి హోదాలకు ఎంచుకుంటారు.

వర్చువల్‌ రియాలిటీ - ఆగ్మెంటెడ్‌ రియాలిటీ

ఏదైనా విషయాన్ని చదివి తెలుసుకోవడం కంటే ప్రయోగాత్మకంగా ప్రభావవంతంగా తెలుసుకోవచ్చు. అయితే ఇది అన్ని విషయాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి ఖర్చుతోనూ కూడుకుని ఉంటుంది. వీటికి పరిష్కారమే వర్చువల్‌ అండ్‌ ఆగ్మెంటెడ్‌ రియాలిటీ. వీటి ద్వారా ప్రత్యక్షంగా ప్రయోగం చేయకుండానే అంతటి పరిజ్ఞానం పొందే వీలు కలుగుతుంది. వ్యాపార విషయానికొస్తే వీటిని గేమింగ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడికి నిజమైన పరిసరాల అనుభూతిని కలిగేలా చేయడం దీనిలో ప్రధానంగా కనిపిస్తుంది. వైద్య రంగంలోనూ రియల్‌టైమ్‌ సర్జరీల్లో దీని అవసరం పెరుగుతోంది. వివిధ శిక్షణలు, ఎంటర్‌టైన్‌మెంట్, మార్కెటింగ్‌ మొదలైనవాటిల్లో ఈ సాంకేతికత ప్రాధాన్యం పెరుగుతోంది. దీనికి లోతైన పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు. ప్రాథమిక ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతోపాటు సృజనాత్మకత ఉన్నవారికి ఇది అనుకూలం.

అందుకునే మార్గమేంటి?

సాంకేతిక రంగంలో ఆసక్తి ఉండి, దానిలో కొనసాగాలనుకుంటే.. ముందుగా నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. అన్నింటినీ నేర్చుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఆసక్తిమేరకు ఒకటి నుంచి రెండు వరకూ ప్రయత్నించవచ్చు. డిగ్రీ స్థాయిలో అందుకోవాలనుకునేవారికి చాలావరకూ స్పెషలైజ్‌డ్‌ డిగ్రీ/ బీటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ తరువాత వాటిలో నేరుగా చేరొచ్చు. లేదా చాలావరకూ ఆన్‌లైన్‌ విద్యా సంస్థలు- యుడెమి, కోర్స్‌ఎరా మొదలైనవి స్పెషలైజ్‌డ్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో బేసిక్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ కోర్సులవరకూ అందుబాటులో ఉన్నాయి. కోర్సును బట్టి కాలవ్యవధి మారుతుంది. చాలావరకూ సంస్థలు బేసిక్‌ కోర్సులను ఉచితంగానే అందిస్తున్నాయి. వాటిలో తమ వివరాలను నమోదు చేసుకుని కోర్సుల్లో చేరొచ్చు. విజయవంతంగా పూర్తిచేస్తే సర్టిఫికేషన్‌నూ అందజేస్తారు. డిగ్రీ కోర్సులకు చాలావరకూ మ్యాథ్స్‌ తప్పనిసరిగా అడుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.