చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 9ఆర్ 5జీ పేరుతో రానున్న ఈ మొబైల్ గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేలా తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. 5జీ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లు స్టోరేజ్ ప్రకారంగా రెండు వేరియంట్లలో రానున్నాయి.


వన్‌ప్లస్ 9ఆర్ 5జీ ఫీచర్లు...
- 5జీ టెక్నాలజీ ఫోన్
- 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
- డివైస్ టెంపరేచర్‌ను నిత్యం పర్యవేక్షించే 14 సెన్సార్లు
- 48 ఎంపీ ప్రధాన కెమెరా
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- కార్బన్ బ్లాక్, లేక్ బ్లూ రంగుల్లో లభ్యం
- 8జీబీ+128జీబీ ధర రూ.39,999
- 12జీబీ+256జీబీ ధర రూ. 43,999
ఈ నెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్, వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు కొనుగోలు చేసే అవకాశం సంస్థ కల్పించగా.. ఆఫ్‌లైన్ అమ్మకాలు మాత్రం15 వ తేదీ నుంచి జరగనున్నాయి.
ఇదీ చూడండి: వన్‌ప్లస్ 9 ఫోన్స్, స్మార్ట్‌వాచ్ ధరలు, ఫీచర్లు ఇవే..