OnePlus new phone : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్. వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జులై 5న మూడు సరికొత్త డివైజ్‌లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 3, నార్డ్ సీఈ 3 స్మార్ట్ఫోన్లు సహా, నార్డ్ బడ్స్ 2ఆర్ ఇయర్‌బడ్స్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్ టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లేతో సహా వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ దీనిలో ఉంటుంది.
OnePlus Nord 3 expected specifications :
- డిస్ప్లే : 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్ డిస్ప్లే + 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్
- బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
- ఫాస్ట్ ఛార్జింగ్ : 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ర్యామ్ : 8 జీబీ అండ్ 16జీబీ వేరియంట్స్
- స్టోరేజ్ : 256జీబీ
- ఓఎస్ : ఆక్సిజన్ ఓఎస్ 13.1
- ప్రైమరీ కెమెరా : 50ఎమ్పీ
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర బహుశా రూ.32,999 ఉండవచ్చు. 8జీబీ, 16జీబీ వేరియంట్లను అనుసరించి ఈ స్మార్ట్ఫోన్ల ధరలు మారుతూ ఉంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 3లోనూ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3లోనూ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్లు బహుశా ఒకే విధంగా ఉండవచ్చు. కానీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్‌లో 12జీబీ ర్యామ్ సహా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 728జీ ప్రాసెసర్ ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే ఇది ఆక్వా సర్జ్ కలర్ ఆప్షన్లో కూడా రావచ్చు.
OnePlus Nord CE 3 expected specs :
- డిస్ప్లే : 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్ డిస్ప్లే + 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 728జీ
- బ్యాటరీ : 5000ఎమ్ఏహెచ్
- ఫాస్ట్ ఛార్జింగ్ : 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజ్ : 128జీబీ
- ఓఎస్ : ఆక్సిజన్ ఓఎస్ 13.1
- ప్రైమరీ కెమెరా : 50ఎమ్పీ
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర బహుశా రూ.24,999 ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఇయర్‌బడ్స్
OnePlus Nord Buds 2R price : వన్‌ప్లస్ రెండు నార్డ్ సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు, వైర్లెస్ నార్డ్ బడ్స్‌ను కూడా లాంఛ్ చేస్తోంది. దీని ధర బహుశా రూ.2,500 వరకు ఉండవచ్చు.