స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యాపిల్, సామ్సంగ్, షావోమి, వన్‌ప్లస్ లాంటి కంపెనీలు కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నాయి. అందులో ముఖ్యంగా వన్+ కంపెనీ కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్లు కాకుండా ఇతర ఉపకరణాలపై దృష్టిసారించింది. ఇటీవల ఈ సంస్థ టీడబ్ల్యూఎస్ (ట్రూ వైర్లెస్ స్టీరియో) ఇయర్ బర్డ్స్, కొత్త మానిటర్లు, టీవీలు తదితర పరికరాలను ఆవిష్కరించింది. కాగా, మొబైల్ ఫోన్లకు ఫేమస్ అయిన ఈ సంస్థ నుంచి ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్ రాబోతుంది. అదే 100 వాట్ సామర్థ్యం కలిగిన ఛార్జర్.
వన్ ప్లస్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు :
ఈ వన్ ప్లస్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీకి ఓ యూనిక్ ఫీచర్ ఉంది. అదే డ్యూయల్ పోర్ట్ సూపర్ ఫ్లస్ ఛార్జింగ్ సదుపాయం. ఈ ఛార్జర్లో రెండు పోర్టులుంటాయి. అందులో ఒకటి యూఎస్బీ-ఏ కాగా, మరొకటి టైప్‌సీ పోర్టు. ఈ రెండింటినీ ఒకే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఛార్జర్ 65 వాట్స్ పీడీ(పవర్ డెలివరీ) సామర్థ్యం కలిగి ఉన్నట్లు సమాచారం.
డ్యూయర్ పోర్ట్ ఫీచర్:
ఈ డ్యూయల్ పోర్ట్ ఛార్జర్‌కు చాలా ప్రత్యేకత ఉంది. మార్కెట్లలో ఉన్న వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఛార్జర్‌ను స్మార్ట్పోన్లు, టీడబ్య్లూఎస్, ల్యాప్‌టాప్‌లకు కూడా వాడొచ్చు. ఈ ఛార్జర్ పన్ప్లస్ నుంచి వస్తున్న కొత్త ఫోన్ 'వన్‌ప్లస్ 11' కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సంస్థ చెబుతున్న దాని ప్రకారం ఈ ఛార్జర్‌తో 25 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది.
ఛార్జింగ్ రక్షణకు అనుగుణంగా ఉన్న మొదటి ప్రొడక్ట్‌గా ఈ ఛార్జర్‌ను పేర్కొంటోంది సంస్థ. ఈ ఛార్జర్ వాడే స్మార్ట్ ఫోన్లో 'బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్'ను పొందుపరిచారు. దీంతో పాటు కచ్చితమైన బ్యాటరీ పరిస్థితిని తెలుసుకోవడానికి 13 సెన్సార్లతో డిజైన్ చేశారు. తొలుత చైనాలో ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలోకి ఎప్పుడు రానుందో అనే విషయంపై క్లారిటీ లేదు.