ETV Bharat / science-and-technology

పబ్​జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే! - Online mobile game

దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారాయని పలు చైనా యాప్​లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. పబ్​జీపైనా వేటు వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో గేమ్​తో దేశ భద్రతకే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Not just data privacy, PUBG posses health threats as well
పబ్​జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!
author img

By

Published : Jul 30, 2020, 6:08 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

ప్రముఖ ఆన్​లైన్​​ మల్టీప్లేయర్ గేమ్​ అయిన ప్లేయర్​ అన్​నోన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​(పబ్​జీ)పై భారత ప్రభుత్వం వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు యువత ఈ ఆటకు బానిసలుగా మారారు. వ్యక్తిగత గోప్యత, దేశ భద్రతకు దీని వల్ల ముప్పు ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో పబ్​జీ కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని.. చిన్నారుల్లో మానసిక ఒత్తిడి కారణమవుతోందని ఇప్పటికే ఈ ఆటపై ఆరోపణలు ఉన్నాయి.

మూడ్​ స్వింగ్స్​కు కారణం..

ఈ గేమ్​ వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగరీత్యా పలు ఇబ్బందులకు కారణమవుతోంది. దీని కారణంగా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. పబ్​జీ వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తోంది. మల్టిపుల్​ డిజార్డర్​కు కారణమవడమే కాకుండా ఈ ఆట ఎక్కువగా ఆడటం వల్ల మనిషి భావోద్వేగాలను అదుపుచేసుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాడు. ఆటలో దూకుడు, దురాక్రమణకు పెద్ద పీట వేయడం వల్ల ఎప్పటికప్పుడు మూడ్​ స్వింగ్స్​ మారిపోయేలా ఆటగాళ్ల ప్రవర్తన ఉంటోంది.

ఓ వ్యక్తి రోజూ గంట ఏదైనా ఆటలు ఆడితే మంచిదే. అయితే రోజూ నాలుగు నుంచి ఆరు గంటలు ఆటలూ ఆడుతూ ఉంటే అది కచ్చితంగా మానసిక, శారీరక అంశాలను ప్రభావితం చేస్తుందని 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. దీని వల్ల వ్యక్తుల్లో ఆందోళన, ఒత్తిడి, అసహనం పెరిగిపోతుందని స్పష్టం చేసింది. ఎక్కువసేపు స్క్రీన్​ చూస్తూ ఉండటం వల్ల అది చూపుపైనా ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఫలితంగా తలనొప్పి, శారీరక సమస్యలు సహా చిన్నారులు గదులకే పరిమితమైతే ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంది.

ఆడనివ్వకపోతే ఆత్మహత్యలు..

చాలా మంది ఉద్యోగులు తమ సమయాన్ని పబ్​జీకి కేటాయించడం వల్ల పనిపై దృష్టిసారించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఆట వ్యసనంగా మారడం వల్ల భాగస్వామితోనూ విడిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తమ్ముడు పబ్​జీ ఆడనివ్వకపోవడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

అసలు ఎలా..??

ఈ గేమ్​ వ్యసనంగా మారేందుకు, ఆత్మహత్యల వైపు ప్రేరేపించేందుకు కారణాలున్నాయి. ఇందులో చంపుకోవడం, షూట్ చేయడం వంటి పనులు హింసను ప్రేరేపిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్​, చైనా, ఇరాక్​, భారత్​లోని కొన్ని ప్రాంతాల్లో ఈ యాప్​ను కొంతకాలం నిషేధించారు. అంతేకాదు రాజ్​కోట్ పోలీసు దాన్ని ప్లేస్టోర్​ నుంచి తొలగించాలని గూగుల్​ను కోరారు. ఇందులో ఆడియో చాట్​ సహా లూటింగ్​, స్పాటింగ్​ వంటి యాక్షన్​ అంశాలు ఎక్కువ మందిని ఆకర్షించి, ప్రభావితం చేయగలుగుతున్నాయి.

గెలిచిన వ్యక్తికి 'విన్నర్​ విన్నర్​ చికెన్​ డిన్నర్'​ అనేది విజయ భావనను ప్రేరేపిస్తుంది. దీని వల్ల గెలిచిన వ్యక్తిలో ఉత్సాహం పెరిగితే... ఓడిపోయిన వ్యక్తి ఆత్మన్యూనతకు గురవుతాడు. అందుకే ఇది విషపూరిత ఆటల సంస్కృతికి కారకంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం డేగకన్ను...

ఇప్పటికే గత నెలలో చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఈ నెల మరో 47 యాప్‌లపై కొరడా ఝుళిపించింది. మరోవైపు భారతీయ వినియోగదారుల సమాచారాన్ని చైనా సంస్థలకు చేరవేస్తున్నాయన్న ఆరోపణలతో 250కిపైగా చైనా యాప్‌ల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటిపై నిషేధం వేయాలని కసరత్తులు చేస్తోంది. ఇందులో పబ్​జీ కూడా ఉంది.

-హసీనా బానో, ఇగ్నోలో మాస్టర్స్​ ఇన్​ ఫిలాసఫీ

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.