ETV Bharat / science-and-technology

సొంతంగా రిపేర్​.. 3 రోజుల వరకు ఛార్జింగ్​.. అదిరే ఫీచర్లతో నోకియా కొత్త బడ్జెట్​ ఫోన్లు

author img

By

Published : Feb 26, 2023, 1:18 PM IST

నోకియా స్మార్ట్​ఫోన్లకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే నోకియా తన వినియోగదారుల కోసం సరికొత్త టెక్నాలజీతో కూడిన ఫోన్​లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిలో భాగంగానే ఓ సరికొత్త టెక్నాలజీతో కూడిన బడ్జెట్ ఫోన్​ను మార్కెట్​లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్​ బ్యాక్ కవర్​, డిస్​ప్లే, ఛార్జింగ్​ పోర్ట్​, బ్యాటరీ వీటిలో ఏది పాడైనా సరే వినియోగదారుడే వీటిని రిపేర్​ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మరో రెండు స్మార్ట్​ఫోన్​లను మార్కెట్​లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో ఉండే ఫీచర్లు, ధర మొదలైన విషయాలు తెసుకుందామా..!

nokia new launch smartphone
nokia new launch smartphone

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వినియోగదారుడే తన మొబైల్​​ రిపేర్​ చేసుకునే విధంగా ఓ బడ్జెట్​ ఫోన్​ను తీసుకువచ్చింది నోకియా. జీ22 సిరీస్​తో తీసుకువచ్చిన ఈ ఫోన్​ను ఇంటివద్ద మనమే రిపేర్​ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​లోని ఛార్జింగ్ పోర్ట్​, బ్యాటరీ, డిస్​ప్లే, బ్యాక్​ కవర్​ వంటి భాగాలను సులభంగా విప్పి మార్చుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఫోన్​లో మూడు రోజుల పాటు పనిచేసే బ్యాటరీ ఉన్నట్లు తెలిపింది. అనేక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్​ ధర కూడా చాలా తక్కువే. ఈ జీ22 ఫోన్​తో పాటుగా.. సీ32, సీ22 అనే మరో రెండు బడ్జెట్​ ఫోన్​లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయా చూద్దామా మరి..!

సొంతంగా రిపేర్ చేసుకునే తొలి స్మార్ట్​ఫోన్​
వినియోగదారుడే రిపేర్ చేసుకునే తొలి స్మార్ట్​ఫోన్​ జీ22 అని నోకియా వెల్లడించింది. దీనిలో 100 శాతం రిసైకిల్​ ప్లాస్టిక్ బ్యాక్​ కవర్ ఉంటుందని తెలిపింది. దీని బ్యాటరీ లైఫ్​ మూడురోజుల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ ఫోన్​లో.. డిస్​ప్లే పగిలినా, ఛార్జింగ్​ పోర్ట్ బెండ్​ అయినా, బ్యాటరీ, బ్యాక్ కవర్లు వంటివి పాడైనా సరే వాటిని సొంతంగా రిపేర్​ చేసుకోవచ్చు. దీనికి ఐఫిక్సిట్ భాగస్వామ్యంతో ఓ టూల్​ కిట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఉండే ప్రత్యేకమైన గైడ్​ సహాయంతో ఫోన్​ను​ రిపేర్​ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఐఫిక్సిట్​ రిపేర్ గైడ్ ఐదేళ్ల పాటు అందుబాటులో ఉంచుతున్నట్లు నోకియా సంస్థ వెల్లడించింది. iFixit.com ద్వారా దాదాపు రూ.430 ఖర్చు చేసి ఈ రిపేర్​ కిట్​ను కొనుగోలు చేసుకోవచ్చని హెచ్​ఎమ్​డీ గ్లోబల్​ సంస్థ తెలిపింది. శనివారం బార్సినాలో జరిగిన మొబైల్​ వరల్డ్​ కాంగ్రెస్​లో వీటిని లాంచ్​ చేసింది.

జీ22 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్, ధర​

  • 6.53 అంగుళాల స్క్రీన్​
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​
  • 50+2+2 ఎంపీల ట్రిపుల్​ బ్యాక్​ కెమెరా
  • 8 ఎంపీ ప్రంట్​ కెమెరా
  • 4/64, 4/128 జీబీల మెమరీ స్టోరేజ్​
  • 5,050mAh సామర్థ్యం గల రిపేరబుల్​ బ్యాటరీ
  • 3 రోజుల బ్యాటరీ లైఫ్​
  • 20 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​

యూకే మార్కెట్​లో మార్చి 8 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ ధర భారత్​లో సుమారు రూ. 15,000 ఉంటుంది. ఈ ఫోన్​కు మూడు సంవత్సరాల వారంటి కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్​ లగూన్​ బ్లూ, మెటోర్ గ్రే కలర్​ల్లో మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలిపింది.

నోకియా సీ32 ఫీచర్లు, ధర

  • 6.5 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే
  • ఆండ్రాయిడ్​ 13 ఆపరేటింగ్​ సిస్టమ్​
  • 2/64 , 3/128 జీబీల మెమరీ స్టోరేజ్​
  • 50+2 ఎంపీ కెమెరా
  • 5,000mAh బ్యాటరీ
  • 3 రోజుల బ్యాటరీ లైఫ్​
  • 10 వాట్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

ప్రస్తుతం ఈ సీ32 ఫోన్​ను చార్​కోల్​, ఆటం గ్రీన్​, బీచ్​ పింక్​ కలర్స్​లో అందుబాటులోకి తెస్తున్నట్లు నోకియా సంస్థ తెలిపింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.11,500 ఉంటుంది. దీనిలో అధునాతన కెమెరా సామర్థ్యం కూడా ఉన్నట్లు వెల్లడించింది.

నోకియా సీ22 స్మార్ట్​ఫోన్​ ఫీచర్లు

  • 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్​
  • 2/64, 3/64 జీబీల మెమరీ స్టోరేజ్‌
  • 13+2 ఎంపీ డ్యుయల్‌ కెమెరా
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000mAh బ్యాటరీ
  • 3 రోజుల బ్యాటరీ లైఫ్​
  • 10W ఛార్జింగ్‌ సపోర్ట్‌

ఈ ఫోన్ ప్రస్తుతం రెండు రంగుల్లో అందుబాటులోకి ఉంది. మిడ్​నైట్​ బ్లాక్​, మిడ్​నైట్ సౌండ్​ రంగుల్లో ఉంది. భారతీయ మార్కెట్​లో దీని ధర సుమారు రూ.11,000గా ఉండొచ్చు. తక్కువ బడ్జెట్​తో అందుబాటులోకి వస్తున్న ఈ మూడు స్మార్ట్​ఫోన్​లు 4జీ నెట్​వర్క్​తో పనిచేస్తాయని నోకియా సంస్థ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.