ETV Bharat / science-and-technology

ముగ్గురు శాస్త్రవేత్తలకు 'భౌతిక' నోబెల్.. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు పురస్కారం - భౌతికశాస్త్రం నోబెల్

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్​ పరిశోధనలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

NOBEL PHYSICS
NOBEL PHYSICS
author img

By

Published : Oct 4, 2022, 3:25 PM IST

Updated : Oct 4, 2022, 4:12 PM IST

'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్​లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతల్లో.. అలైన్‌ ఆస్పెక్ట్‌ది ఫ్రాన్స్‌కాగా, జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌ అమెరికాలో, ఆంటోన్‌ జైలింగర్‌ ఆస్ట్రేలియాలో భౌతిక శాస్త్ర పరిశోధకులుగా పనిచేస్తున్నారు.

NOBEL PHYSICS
భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలు

సోమవారం వైద్య రంగంలో నోబెల్ విజేత పేరును ప్రకటించారు. బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్​కు ఎంపికయ్యారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్​ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

NOBEL PHYSICS
భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటిస్తున్న కమిటీ సభ్యులు

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

Last Updated : Oct 4, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.