ETV Bharat / science-and-technology

ఒక్క క్లిక్​తో విండోస్ యాప్స్‌ అన్నీ పీసీలోకి.. ఇలా ట్రై చేయండి! - కొత్త పీసీ విండోస్‌ యాప్స్‌

కొత్త పీసీ కొనటం సంతోషంగానే ఉంటుంది. కానీ అవసరమైన అప్లికేషన్లను ఇన్‌స్టాల్‌ చేయటమే కాస్త కష్టమైన పనే. ఒకో యాప్‌ను వెతికి, డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడే ఒక్క క్లిక్‌తోనే విండోస్‌ యాప్స్‌ అన్నీ ఇన్‌స్టాలైతే బాగుండునని అనిపిస్తుంది.

new pc apps to install
కొత్త పీసీ విండోస్‌ యాప్స్‌
author img

By

Published : Nov 24, 2022, 9:57 AM IST

విండోస్‌ యాప్స్‌ను గంపగుత్తగా ఇన్‌స్టాల్‌ చేయటానికి మంచి సాధనం నైనైట్‌. ముందుగా ninite.com లోకి వెళ్లాలి. యాప్‌ జాబితాను ఒకసారి క్షుణ్నంగా పరిశీలించాలి. ఇందులో చాలా సాఫ్ట్‌వేర్లుంటాయి. కొన్ని ఉండకపోవచ్చు. ఉదాహరణకు- వివాల్డీ బ్రౌజర్‌, ఫొటోషాప్‌ వంటి వాటిని దీంతో ఇన్‌స్టాల్‌ చేసుకోలేం. యాప్స్‌ జాబితాలో అవసరమైన వాటిని టిక్‌ చేసుకొని.. గెట్‌ యువర్‌ నైనైట్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. దీంతో ఎంచుకున్న యాప్స్‌తో కూడిన కంబైన్డ్‌ ఇన్‌స్టాలర్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీన్ని రన్‌ చేస్తే చాలు. యాప్సన్నీ ఇన్‌స్టాల్‌ అవుతాయి.

ప్యాచ్‌ మై పీసీ కూడా మంచి మార్గమే. అయితే నైనైట్‌ మాదిరిగా కాకుండా ఇది నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా పనిచేస్తుంది. https://patchmypc.com/home-updater లోకి వెళ్లి, 'ప్యాచ్‌ మై పీసీ హోం అడాప్టర్‌'ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేయాలి. అవసరమైన యాప్స్‌ను సెలెక్ట్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ బటన్‌ను నొక్కాలి. ఇది ఒకేసారి యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికీ ఉపయోగ పడుతుంది. అన్‌ఇన్‌స్టాల్‌ బటన్‌ మీద క్లిక్‌ చేసి, కంట్రోల్‌ మీద నొక్కాలి. అవసరం లేని యాప్స్‌ను మార్క్‌ చేసుకోవాలి. అన్‌ఇన్‌స్టాల్‌ బటన్‌ మీద నొక్కితే అన్నీ ఒకేసారి పోతాయి.

రుక్‌జుక్‌ కూడా మంచి ప్రత్యామ్నాయమే. ప్యాచ్‌ మై పీసీ మాదిరిగానే దీని ఈఎక్స్‌ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. https://ruckzuck.tools/ లోకి వెళ్లి డౌన్‌లోడ్స్‌ కింద కనిపించే ruckzuck.exe ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని ఓపెన్‌ చేసి ఇన్‌స్టాల్‌ న్యూ సాఫ్ట్‌వేర్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు విభాగాల వారీగా యాప్స్‌ జాబితా కనిపిస్తుంది. అవసరమైనవాటిని ఎంచుకొని స్టార్ట్‌ ఇన్‌స్టలేషన్‌ మీద నొక్కాలి. అంతే యాప్స్‌ డౌన్‌లోడ్‌ అయ్యి, వాటంతటవే పీసీలో ఇన్‌స్టాల్‌ అవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.