ETV Bharat / science-and-technology

కరోనా జాడను పసిగట్టే మాస్కులు - సన్సార్​ మాస్కులు

కరోనాను గుర్తించే మాస్కులు వచ్చేశాయి. వైరస్​ను వడకట్టి వాటి ఆచూకీని పట్టేస్తున్నాయి. ఈ మాస్కులను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీటితో కేవలం 90 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది.

sensor based mask
కొవిడ్​ను కనిపెట్టే మాస్క్​
author img

By

Published : Jun 30, 2021, 9:44 AM IST

కరోనా నుంచి రక్షణ పొందడానికి మాస్కులు ధరిస్తున్నారు. అయితే ఆ వైరస్‌ను వడకట్టడమే కాకుండా.. దాని ఆచూకీని కూడా పట్టుకొనే ఒక వినూత్న మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని ధరించిన వ్యక్తిలో వైరస్‌ ఉనికిని ఇది గుర్తిస్తుంది. ఒక్క మీట నొక్కగానే దీని పని ప్రారంభమవుతుంది. 90 నిమిషాల్లో ఫలితం వస్తుంది. దీని కచ్చితత్వం ప్రామాణిక పీసీఆర్‌ పరీక్షకు ఏ మాత్రం తీసిపోదు. ఈ వెసులుబాటు వల్ల సదరు వ్యక్తి సకాలంలో అప్రమత్తం కావడానికి వీలవుతుంది.

ఒక డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌ మొత్తాన్నీ ఒక చిన్నపాటి సింథటిక్‌ బయాలజీ ఆధారిత సెన్సర్‌ స్థాయికి కుదించినట్లు పరిశోధనకు నాయకత్వం వహించిన పీటర్‌ గుయెన్‌ చెప్పారు. సెన్సర్‌ను మాస్కు పోగుల్లో ఇమిడిపోయేలా చేసినట్లు వివరించారు. ఈ బయోసెన్సర్లను అవసరానికి తగ్గట్లు ప్రోగ్రామ్‌ చేసుకోవచ్చు. వీటిని దుస్తుల్లోనూ అమర్చుకోవచ్చు. తద్వారా ఇతర రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, విష పదార్థాలు, రసాయనాల ఆనవాళ్లను పట్టుకోవచ్చు.

ధరించడానికి వీలైన ఫ్రీజ్‌-డ్రైడ్‌ సెల్‌-ఫ్రీ (డబ్ల్యూఎఫ్‌డీసీఎఫ్‌) సాంకేతికత సాయంతో దీన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం.. డీఎన్‌ఏను విశ్లేషించి, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లను ఉత్పత్తి చేయడానికి కణంలో ఉండే ఒక వ్యవస్థను ఉపయోగించారు. ల్యాబ్‌కు వెలుపల వేగంగా రోగి నమూనాలను స్క్రీన్‌ చేయడానికి ఈ సాధనం వీలు కల్పిస్తుంది.

ఇదీ చూడండి: బీటా వేరియంట్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.