ETV Bharat / science-and-technology

జేమ్స్ వెబ్ అద్భుతం.. బిగ్​బ్యాంగ్ నాటి చిత్రాన్ని తీసిన టెలిస్కోప్ - దక్షిణ అమెరికా ఫ్రెంచ్ గయానా

NASA James Webb: జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన తొలి అంతరిక్ష చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఈ చిత్రంలో చాలా నక్షత్రాలు ఉండగా ముందువైపు భారీ గెలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది బిగ్​బ్యాంగ్ జరిగిన పదుల కోట్ల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

nasa
నాసా
author img

By

Published : Jul 12, 2022, 9:38 AM IST

NASA James Webb: నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన తొలి అంతరిక్ష చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడుదల చేశారు. విశ్వానికి సంబంధించి ఇప్పటివరకు మానవాళి చూడని అతి సుదూరమైన ఇన్​ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ తెలిపారు. జేమ్స్‌ టెలిస్కోప్‌ బంధించిన ఈ చిత్రంలో చాలా నక్షత్రాలు ఉండగా ముందువైపు భారీ గెలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

nasa
జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన చిత్రం

విశాలమైన విశ్వంలో.. జేమ్స్‌ టెలిస్కోప్‌ తీసిన ఈ చిత్రం ఒక చిన్నపాటి మచ్చ వంటిదేనని బిల్‌ నెల్సన్‌ అభిప్రాయపడ్డారు. ఈ టెలిస్కోప్‌ తీసిన నాలుగు చిత్రాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌గా జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ రికార్డు సృష్టించింది. దీనిని గతేడాది డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు.

nasa
.

అయితే, వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రం కంటే ఇంకా సుదూరమైన చిత్రాలనూ శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. కోబ్, డబ్ల్యూఎంఏపీ నాన్-ఇన్​ఫ్రారెడ్ మిషన్​లో భాగంగా.. మహా విస్పోటం (బిగ్ బ్యాంగ్) నాటి చిత్రాలను కనిపెట్టారు. బిగ్ బ్యాంగ్ సంభవించి సుమారు 1,380 కోట్ల సంవత్సరాలు అవుతోంది. కోబ్, డబ్ల్యూఎంఏపీ గుర్తించిన చిత్రాల్లో.. బిగ్ బ్యాంగ్ జరిగిన 3.8 లక్షల సంవత్సరాల తర్వాతి దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ చిత్రాల్లో మైక్రోవేవ్ రేడియేషన్ తప్ప.. నక్షత్రాలు, గెలాక్సీలు కనిపించవు. బిగ్ బ్యాంగ్ జరిగి పదుల కోట్ల సంవత్సరాలు అయినప్పటి చిత్రాన్ని ప్రస్తుతం వెబ్ టెలిస్కోపు గుర్తించింది.

ఇవీ చదవండి:

చందమామపై డ్రాగన్ కన్ను... హస్తగతం కోసం యత్నం.. సాధ్యమేనా?

వాట్సాప్‌లో ఇక డబుల్ ధమాకా.. ఒకే అకౌంట్.. రెండు స్మార్ట్‌ఫోన్లలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.