ETV Bharat / science-and-technology

'ఈ మాల్​వేర్​తో నగదు ఖాళీ'.. ఆండ్రాయిడ్​ యూజర్స్​కు మైక్రోసాఫ్ట్​ వార్నింగ్ - మైక్రోసాఫ్ట్​ న్యూస్​

టోల్​ ఫ్రాడ్​ పట్ల ఆండ్రాయిడ్​ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. బిల్లింగ్​, కాల్ ఫ్రాడ్​ కన్నా​ టోల్​ ఫ్రాడ్​ ప్రమాదకరమైందని.. వైఫై కనెక్షన్​ ఆఫ్​ చేసి బ్యాంకు ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తుందని హెచ్చరిస్తుంది.

microsoft 365 malware research
microsoft 365 malware research
author img

By

Published : Jul 4, 2022, 6:11 PM IST

ఆండ్రాయిడ్​ వినియోగదారులు టోల్​ ఫ్రాడ్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఈ మాల్​వేర్​ వైఫై కనెక్షన్​ను ఆఫ్​ చేసి మొబైల్​లోని నగదును ఖాళీ చేస్తుందని హెచ్చరించింది. బిల్లింగ్​, కాల్ ఫ్రాడ్​ కన్నా​ టోల్​ ఫ్రాడ్​ ప్రమాదకరమని పేర్కొంది. మైక్రోసాఫ్ట్​ 365 డిఫెండర్​ రీసెర్చ్​ టీం నివేదిక ప్రకారం.. ఎస్​ఎమ్​ఎస్​ ఫ్రాడ్​, కాల్​ ఫ్రాడ్​లు సాధారణంగా​ మెసేజ్​, కాల్స్​ చేసి వదిలేస్తాయి. కానీ ఈ టోల్ ఫ్రాడ్​ నిరంతరం దాడులు చేస్తూ మాల్​వేర్​ను మెరుగుపరుస్తూనే ఉంటుంది.

ఈ మాల్​వేర్ తన​ కార్యకలాపాల కోసం సెల్యూలార్​ కనెక్షన్​ను డిఫాల్ట్​గా వినియోగించుకుంటుంది. వైఫై కనెక్షన్​ను వాడుతున్నా మొబైల్​ నెట్​వర్క్​కు బలవంతంగా కనెక్ట్​ చేసేలా చేస్తుంది. మాల్​వేర్​ లక్ష్యంగా ఎంచుకున్న నెట్​వర్క్​తో అనుసంధానం అయ్యాక సులభంగా సమాచారాన్ని దొంగిలిస్తుంది. వినియోగదారుడి అనుమతి లేకుండానే ఓటీపీలను సైతం తీసుకుంటుంది. ఫ్రాడ్​ జరగకుండా రక్షించే సబ్​స్క్రిప్షన్లు​ పొందినా.. వాటి నుంచి మెసేజ్​లు రాకుండా ఈ మాల్​వేర్​ అడ్డుపడుతుంది. డైనమిక్ కోడ్​ లోడింగ్​ను ఉపయోగించడం వల్ల మొబైల్​ భద్రతా సమస్యను పరిష్కరించకుండా కష్టతరం చేస్తుంది.

"కొన్ని నిర్దిష్ట నెట్​వర్క్​ ఆపరేటర్​ల వినియోగదారులపై మాల్​వేర్​ ప్రవర్తన ఎలా ఉంటుందని మేము పరిశోధన చేశాం. నెట్​వర్క్​లోకి మాల్​వేర్​ వచ్చినట్లైతే తన ఫ్రాడ్​ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ మాల్​వేర్​ ముప్పును తగ్గించడానికి ఆండ్రాయిడ్​ ఏపీఐ నిబంధనలు, గూగుల్​ ప్లే స్టోర్​ పబ్లిషింగ్​ పాలసీని ఉపయోగిస్తాము."

- మైక్రోసాఫ్ట్​ పరిశోధన బృందం

గుర్తింపు లేని సైట్ల నుంచి ఆండ్రాయిడ్​ అప్లికేషన్​లను ఇన్​స్టాల్​ చేయవద్దని, డివైస్​ను తప్పనిసరిగా అప్​డేట్​ చేయాలని మైక్రోసాఫ్ట్​ సలహా ఇచ్చింది. అవసరమైన యాప్స్​కే నోటిఫికేషన్​, ఎస్​ఎమ్​ఎస్​ ఇతర అనుమతులు ఇవ్వాలని సూచించింది. దీని వల్ల డివైస్​లు మాల్​వేర్​ నుంచి రక్షణ పొందుతాయని తెలిపింది.

ఇదీ చదవండి: రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొచ్చా? అలాగే వాడొచ్చా? మీ డౌట్స్​కు సమాధానాలు ఇవిగో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.