ETV Bharat / science-and-technology

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఇన్​ స్మార్ట్​ఫోన్లు- ధర ఎంతంటే?

author img

By

Published : Nov 3, 2020, 1:04 PM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

చాలా కాలం తర్వాత దేశీయ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది మైక్రోమ్యాక్స్. బడ్జెట్ సెగ్మెంట్​లో ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్లను విడుదల చేసింది. ఇన్​ సీరిస్​లో వచ్చిన ఈ మోడళ్ల ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.

Micromax in Series mobiles prices
మైక్రోమ్యాక్స్ ఇన్ సీరిస్ మొబైల్ ఫీచర్లు

దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ మైక్రోమ్యాక్స్.. స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్​ సీరిస్​లో మంగళవారం స్మార్ట్​ఫోన్లను ఆవిష్కరించింది. ఇన్​ నోట్​ 1, ఇన్ 1బీ పేర్లతో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ స్మార్ట్​ఫోన్లు స్టాక్ ఆండ్రాయిడ్​తో తీసుకొచ్చినట్లు తెలిపింది మైక్రోమ్యాక్స్. వీటిల్లో బ్లోట్​వేర్, యాడ్​లు కూడా ఉండవని స్పష్టం చేసింది. రెండేళ్ల వరకు సాఫ్ట్​వేర్​ అప్​డేట్లు ఉంటాయని హామీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్​పై ఈ రెండు స్మార్ట్​ఫోన్లు పని చేయనున్నాయని ఇప్పటి వరకు ఉన్న సమాచారం.

ఇన్​ నోట్​ 1 ఫీచర్లు..

Micromax in note 1
ఇన్ నోట్​ 1
  • 6.67 అంగుళాల అల్ట్రాబ్రైట్ పుల్​హెచ్​డీ+ డిస్​ప్లే
  • మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్
  • వెనుకవైపు ఏఐతో పని చేసే నాలుగు కెమెరాలు (48 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 16 ఎంపీ వైడ్ యాంగిల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా (నేరుగా జిఫ్ ఇమేజ్ సేవ్ సదుపాయం)
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999

ఈ స్మార్ట్​ఫోన్ ఈ నెల 24న ఫ్లిప్​కార్ట్, మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్​సైట్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

ఇన్​ 1బీ ఫీచర్లు

Micromax in 1b
ఇన్ 1బీ
  • 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే
  • మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్
  • వెనుకవైపు ఏఐతో పని చేసే రెండు కెమెరాలు (13 ఎంపీ+2ఎంపీ)
  • 8ఎంపీ మినీ డ్రాప్ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999

ఈ స్మార్ట్​ఫోన్​ ఈ నెల 26 నుంచి మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్​సైట్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.