ETV Bharat / science-and-technology

70 కోట్ల లింక్డ్​​ఇన్​ యూజర్ల డేటా లీక్​! - హ్యాకర్ల చేతిలో లింక్డ్​ఇన్ యూజర్ల విలువైన డేటా

మైక్రోసాఫ్ట్​కు చెందిన లింక్డ్​ఇన్​లో మరోసారి డేటా లీక్​ కలకలం రేపుతోంది. లింక్డ్​ఇన్ యూజర్లలో 92 శాతం మంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని హ్యాకర్లు డార్క్​వెబ్​లో అమ్మకానికి పెట్టినట్లు వెల్లడైంది.

LinkedIn user data for sale online
అమ్మకానికి లింక్డ్​ఇన్ యూజర్ల డేటా
author img

By

Published : Jun 29, 2021, 7:31 PM IST

Updated : Jun 30, 2021, 10:00 AM IST

ప్రముఖ ప్రొఫెషనల్ నెట్​వర్కింగ్ ప్లాట్​ఫామ్​ లింక్డ్​ఇన్​లో మరోసారి డేటా లీకైనట్లు సమాచారం. 70 కోట్ల మంది లింక్డ్​ఇన్ యూజర్ల డేటాను హ్యాకర్లు లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం లింక్డ్​ఇన్ యూజర్లలో 92 శాతానికి సమానం. లింక్డ్​ఇన్​కు ప్రస్తుతం 76 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

లీకైన యూజర్ల డేటాలో.. ఫోన్​ నంబర్లు, పూర్తి అడ్రస్​, జియోగ్రఫికల్​ లొకేషన్, వేతనాలు వంటి వివరాలు ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఇంతకు ముందు ఏప్రిల్​లోనూ 50 కోట్ల లింక్డ్ఇన్​ యూజర్ల డేటా లీకైంది. అప్పుడు యూజర్ల మెయిల్​ ఐడీలు, ఫోన్​ నంబర్లు, వర్క్​ ప్లేస్, పూర్తి పేరు, వారి సామాజిక మాధ్యమాల ఐడీల వంటి వివరాలను హ్యాకర్లు లీక్ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని లింక్డ్​ఇన్​ కూడా ధ్రువీకరించింది.

తాజాగా లీకైన డేటాలో.. 70 కోట్ల యూజర్ల డేటాను హ్యాకర్లు డార్క్​వెబ్​లో అమ్మకానికి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. శాంపిల్​ కోసం 10 లక్షల మంది డేటాను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఈ శాంపిల్​ ద్వారానే ఎలాంటి సమాచారం హ్యాకర్ల చేతికి దొరికిందో తెలిసింది.

ఇదీ చదవండి:ఈ టిప్స్​తో మీ డిజిటల్​ పేమెంట్స్ సేఫ్​!

Last Updated : Jun 30, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.