ETV Bharat / science-and-technology

కోడిని కోయకుండానే 'చికెన్‌'.. సూపర్​ మార్కెట్లలో అమ్మకానికి రెడీ!

author img

By

Published : Jun 26, 2023, 9:55 AM IST

Cultivated Meat US : మాములుగా చికెన్‌ తినాలంటే కోడిని కోయాల్సిందే. సమీప భవిష్యత్తులో కోడిని కోయకుండా కూడా చికెన్‌ తినేయ్యొచ్చు. కోడిని కోయకుండా చికెనా, అదేలా అని ఆశ్చర్యపోతున్నారా?.. కానీ ఇది నిజం. మొట్టమొదటిసారిగా ల్యాబ్​లో తయారు చేసిన చికెన్‌ను అమెరికాలోని రెస్టారెంట్లలో విక్రయించడం ప్రారంభించారు. త్వరలో ఈ చికెన్‌ సూపర్ మార్కెట్‌లలోనూ దర్శనం ఇవ్వనుంది.

cultivated meat us
cultivated meat us

Cultivated Meat US : అహింసా మీట్‌!.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా?.. అవును మీరు వింటున్నది నిజమే. కోడిని చంపకుండా.. జంతు హింస అని బాధపడకుండా.. ఇక మీరు హాయిగా చికెన్‌ను లొట్టలేసుకుంటూ తినేయ్యొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది.

Lab Grown Meat United States : మొదట రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలు పెట్టి.. ఆ తర్వాత సూపర్ మార్కెట్లలోనూ ఈ చికెన్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయోగ‌శాల‌లోని స్టీల్ ట్యాంకుల‌లో కోళ్ల క‌ణ‌ జాలాన్ని అభివృద్ధి చేయ‌డం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ల్యాబ్‌లో కోడి మూలకణాల నుంచి ఈ చికెన్ ను తయారు చేస్తారు. కోడి నుంచి వచ్చే కణాలకు పోషకాలు అందించి వెచ్చగా ఉండే ప్రత్యేక రసాయనంలో ఉంచుతారు. నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ కణాలు మాంసంగా మారుతాయి.

cultivated meat us
ల్యాబ్​లో కృత్రిమ మాంసం తయారీ

Cultivated Meat Restaurants : కాలిఫోర్నియాకు చెందిన అప్‌సైడ్ ఫుడ్స్‌, గుడ్ మీట్ కంపెనీలకు.. చికెన్‌ను కృత్రిమంగా తయారు చేసేందుకు.. వాటిని విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. గుడ్ మీట్ తయారీ భాగస్వామి అయిన జోయిన్ బయోలాజిక్స్ కూడా మాంసాన్ని తయారు చేసేందుకు ఆమోదం పొందింది. ఈ రెండు కంపెనీలు సాగు చేసిన చికెన్ ఉత్పత్తులు మాన‌వ వినియోగానికి సుర‌క్షిత‌మైన‌విగా నిర్ధరించారు. ఈ రెండు కంపెనీలు త‌మ ఉత్పత్తుల‌ను మార్కెట్‌లోకి తీసుకురావ‌డానికి USDA తుది ఆమోద‌ ముద్ర వేసింది.

cultivated meat us
ల్యాబ్​లో కృత్రిమ మాంసం తయారీ

బతికి ఉన్న కోడి క‌ణ‌జాలం నుంచి న‌మూనా క‌ణాల‌ను త‌యారుచేసి ప్రయోగ‌శాల‌లో మాంసాన్ని పండిస్తారని USDA తెలిపింది. క‌ణాల‌ను సేక‌రించే ప్రక్రియ‌లో కోడికి ఎలాంటి హాని ఉండ‌ద‌ని పేర్కొంది. ల్యాబ్‌లో తయారైన చికెన్ వల్ల జంతువుల పెంపకం, వాటికి దాణా, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. మాంసం కోసం జంతువులను వధించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఆహార భద్రత సమస్యలకు ఇదొక ప్రత్యామ్నాయ మార్గమన్నారు.

cultivated meat us
ల్యాబ్​లో తయారుచేసిన కృత్రిమ మాంసం

పోషకాల మాటేమిటి..
Cultured Meat Nutrition Facts : పోషకాల విషయంలో సాగు మాంసం జంతు మాంసంతో సమానంగానే తులతూగుతుంది. కావాలంటే పోషకాల మోతాదులను పెంచుకోవచ్చు. ఆయా వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు కూడా. ఆరోగ్యానికి హాని చేసే సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదులను పెంచుకోవచ్చు. ఉదాహరణకు- సాల్మన్‌ చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలతో కూడిన మాంసాన్ని తయారుచేశారనుకోండి. గుండె ఆరోగ్యానికి మేలు చేసేలా చూసుకోవచ్చు. ప్రస్తుతం సాగు మాంసం పదార్థాల ప్యాకెట్ల మీద పోషకాలను అంతగా వివరించటం లేదు. మున్ముందు విరివిగా అందుబాటులోకి వస్తే వీటి గురించి బాగా తెలుస్తుంది.

cultivated meat us
కృత్రిమ మాంసంతో తయారుచేసిన ఆహార పదార్థం

పర్యావరణానికి మేలేనా?
కల్చర్డ్‌ మాంసం విస్తృతంగా ఉత్పత్తి అయ్యేంతవరకూ దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది కచ్చితంగా చెప్పలేం. పశువులు, కోళ్ల పెంపకంతో పోలిస్తే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసంతో ఎక్కువ హరిత వాయువులు విడుదలవుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. అయితే ఇది విద్యుత్‌ తయారీకి వాడే ఇంధనాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వచ్ఛ ఇంధనాలతో తయారైన విద్యుత్‌ వాడకంతో అంత ఎక్కువగా గ్రీన్‌ హౌజ్‌ వాయువులు వెలువడకపోవచ్చు. సంప్రదాయ మాంసం ఉత్పత్తులకు సుస్థిర ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉండటం వల్ల మున్ముందు ఇది మంచి ప్రభావమే చూపొచ్చని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.