ETV Bharat / science-and-technology

హైహై 'AI' నాయకా.. మీ పనులన్నీ చేసిపెట్టే వెబ్​సైట్ల గురించి తెలుసా?

మన రోజువారీ జీవితంలోకి కృత్రిమ మేధ అడుగుపెట్టింది. విజ్ఞాన సముపార్జన దగ్గర నుంచి ఎంతో ఈజీగా ఫొటోల ఎడిటింగ్‌ వరకూ ఎన్నెన్నో పనులను చేసేస్తోంది. అయితే ఇంటర్నెట్​ సహాయంతో బోలెడన్ని కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు, వెబ్‌సైట్లు రకరకాల పనులను చిటికెలో చేసి పెడుతున్నాయి. అలాంటి కొన్ని వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందాం రండి.

artificial intelligence applications
artificial intelligence applications
author img

By

Published : Feb 8, 2023, 10:30 AM IST

చూస్తుండగానే కృత్రిమ మేధ రోజువారీ జీవితంలోకీ అడుగుపెట్టింది. విజ్ఞాన సముపార్జన దగ్గర్నుంచి సులువుగా ఫొటోల ఎడిటింగ్‌ వరకూ ఎన్నెన్నో పనులను సుసాధ్యం చేసేస్తోంది. వీడియోలు, సంగీతాన్ని సృష్టించటమంటే ఒకప్పుడు చాలా కష్టమైన పని. ప్రయాస పడాల్సి వచ్చేది. ఇప్పుడు అంతర్జాలంతో బోలెడన్ని కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు, వెబ్‌సైట్లు ఇలాంటి పనులను చిటికెలో చేసి పెడుతున్నాయి. అలాంటి కొన్ని వినూత్న వెబ్‌సైట్ల గురించి తెలుసుకుందామా..

ఫొటోలతో యానిమేషన్‌
వెయ్యి మాటల్లో వ్యక్తం చేయలేని భావాలను ఒక్క ఫొటో విడమరచి చెబుతుంది. అందుకే సెల్ఫీలు, బంధుమిత్రులతో కలిసి తీసుకునే ఫొటోలన్నింటినీ జాగ్రత్తగా దాచుకుంటాం. కొన్నిసార్లు వీటిని వీడియోగా మలచుకుంటే బాగుంటుందనీ అనిపించొచ్చు. కృత్రిమ మేధ పుణ్యమాని ఇదిప్పుడు మునివేళ్ల మీది పనిలా మారిపోయింది. దీనికి డి-ఐడీ.కామ్‌ వెబ్‌సైటే నిదర్శనం. ఇది అధునాతన జెనరేటివ్‌ ఏఐ టూల్స్‌తో ఫొటోలను యానిమేషన్‌ రూపంలోకి మార్చేస్తుంది. ఈ వెబ్‌సైట్‌లోని క్రియేటివ్‌ రియాలిటీ స్టుడియో ద్వారా మాట్లాడే అవతార్లనూ సృష్టించుకోవచ్చు. స్టేబుల్‌ డిఫ్యూజన్‌, జీపీటీ-3 పరిజ్ఞానాల సాయంతో మన భావాలను ఇష్టమైన వీడియోలుగానూ మలచుకోవచ్చు. వీడియో కంటెంట్‌ను సృష్టించాలనే కోరిక ఉన్నా టెక్నికల్‌ జ్ఞానం లేనివారికిది చవకలో మోక్షం చూపిస్తుంది.
https://www.d-id.com/

.

రాత, మాట, సంగీతం
కృత్రిమ మేధ రాయటం, మాట్లాడటమే కాదు. సంగీతాన్నీ సృష్టించగలదు. కావాలంటే సౌండ్‌ఫుల్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో ప్రయత్నించి చూడండి. ఇది ఏఐ సాయంతో రాయల్టీ ఫ్రీ ట్రాక్స్‌ను సృష్టిస్తుంది. కొద్ది స్టెప్స్‌తోనే సంగీతాన్ని సృష్టించాలని భావించేవారికిది తేలికైన వేదికగా ఉపయోగపడుతుంది. ఇష్టమైన జానర్‌ను ఎంచుకొని, ఇన్‌పుట్స్‌ను జోడించి కావాల్సినట్టుగా సంగీతాన్ని సృష్టించుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ అత్యధిక నాణ్యమైన మ్యూజిక్‌ శాంపిల్స్‌నూ అందుబాటులో ఉంచింది. నిర్మాతలు, సంగీత స్రష్టలు, సంస్థల అవసరాలను దృష్టిలో పెట్టుకొనే సౌండ్‌ఫుల్‌.కామ్‌ను తీర్చిదిద్దారు. ఇందులో ఉచిత సేవలతో పాటు ప్రీమియం, ఎంటర్‌ప్రైజ్‌ ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. సృష్టించిన సంగీతాన్ని అమ్మటం ద్వారా ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు.
https://soundful.com/

.

వాట్సప్‌తోనే ఛాట్‌జీపీటీ
ఓపెన్‌ఏఐ సంస్థ రూపొందించిన ఛాట్‌జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. రెండు నెలల్లోనే ప్రపంచమంతా విస్తరించింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న టూల్‌గా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దీన్ని 10కోట్లకు పైగా మంది వినియోగిస్తుండటం విశేషం. దీంతో వ్యాసాలు, కవితలు, ఈమెయిళ్లు, కథనాల వంటివెన్నో రాసుకోవచ్చు. మరి దీన్ని వాట్సప్‌తోనే వాడుకుంటే? మైటీజీపీటీ.కామ్‌ చేసేది ఇదే. వాట్సప్‌ ద్వారా నేరుగా స్మార్ట్‌ఫోన్‌కే ఛాట్‌జీపీటీ సేవలను అందిస్తుంది. కాకపోతే దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితేనేం? ఇతరులతో ఛాట్‌ చేస్తున్నంత తేలికగా దీన్ని వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ పరికరాలకే అందుబాటులో ఉన్నా త్వరలోనే ఐఓఎస్‌కూ విస్తరించనున్నట్టు వైబ్‌సైట్‌ పేర్కొంటోంది. https://mightygpt.com/

.

ఛాట్‌బాట్‌ తయారీకి
కస్టమర్లతో మాటామంతీని నెరపటంలో ఛాట్‌బాట్‌లు కంపెనీలకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. టెక్స్ట్‌ లేదా టెక్స్ట్‌ టు స్పీచ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చాలా సేవలను అందిస్తున్నాయి. నేరుగా కస్టమర్లతో వ్యవహారాలు సాగించటానికి దోహదం చేస్తున్నాయి. అయితే ఛాట్‌బాట్‌ను రూపొందించటం అంత తేలికైన పని కాదు. సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇలాంటి పరిస్థితుల్లోనే తేలికగా ఛాట్‌బాట్‌ను సృష్టించుకునే వీలుంటే బాగుంటుందనీ అనిపిస్తుంటుంది. మరీ అంతలా చింతించాల్సిన పనిలేదు. ల్యాండ్‌బాట్‌.ఐఓ వైబ్‌సైట్‌ సాయం తీసుకుంటే చాలు. ఇది కోడ్‌తో పనిలేని అత్యంత శక్తిమంతమైన ఛాట్‌ బిల్డర్‌. దీంతో ఎవరైనా, ఎలాంటి ఛాట్‌బాట్‌నైనా సొంతంగా రూపొందించుకోవచ్చు. ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. వెబ్‌సైట్‌ ఛాట్‌బాట్స్‌, వాట్సప్‌ ఆటోమేషన్‌, ఏపీఐ ఇంటర్ఫేస్‌, ఎస్‌డీకే ఇంటర్ఫేస్‌.. ఇలా ఇది చాలా ఫ్లాట్‌ఫామ్స్‌ను అందిస్తోంది. వీటిని యాప్‌లలో, ఛానెళ్లలో వాడుకోవచ్చు. చిన్న వ్యాపార సంస్థలకిది బాగా ఉపయోగపడుతుంది. ఇంటరాక్టివ్‌ పేజీలను సత్వరం తయారుచేసి పెడుతుంది.
https://landbot.io/

.

మీమ్​ల తయారీ
మీమ్​లు కొత్త భాషగా మారిపోయాయి. ఇవి లేని సామాజిక మాధ్యమాలను ఊహించుకోలేం. రోజువారీ సంభాషణల్లో విడదీయలేని భాగమైపోయాయి. ఇప్పుడు ప్రతి సందర్భానికీ తగిన మెమేలు ఉన్నాయి. తమ ఆలోచనలను, ఉద్దేశాలను మెమేలుగా సృష్టించుకుంటున్నారు. అయితే అన్ని అవసరాలకు తగిన మెమేలను సృష్టించుకోవటం అందరికీ సాధ్యం కాదు. మనసులో ఏదో ఆలోచన ఉంటుంది. కాని దానికి సరిపడిన మీమ్​ను తయారుచేయటానికి ఏం చేయాలో పాలుపోదు. ఈ ఇబ్బందిని తప్పించటానికి సూపర్‌మీమ్​.ఏఐ వెబ్‌సైట్‌ బాగా తోడ్పడుతుంది. టెక్స్ట్‌ రూపంలో ఆయా సందర్భాలను, అంశాలను వర్ణించి.. జెనరేట్‌ బటన్‌ను నొక్కితే చాలు. దీనిలోని ఏఐ టూల్‌ తగిన ఒరిజినల్‌ మీమ్​ను క్షణాల్లో తయారుచేసి పెడుతుంది. 110 భాషల్లో మీమ్​లను సృష్టిస్తుండటం గమనార్హం. పైగా ఇది మీమ్ సెర్చ్‌ ఇంజిన్‌గానూ పనిచేస్తుంది. దీంతో నచ్చిన మీమ్​ను వెదికి, పట్టుకోవచ్చు. ఇలా మీమ్​ ప్రియులకు తక్షణ పరిష్కారాన్ని చూపిస్తుంది.
https://www.supermeme.ai/

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.