ETV Bharat / science-and-technology

భూమి బరువు తగ్గుతోందా? మనకు ఇబ్బందా?

భూమి ఏడాదికి 50వేల టన్నుల బరువు తగ్గుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని వల్ల భూమికి, మనిషికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.

earth weight loss
భూమి బరువు
author img

By

Published : Jul 10, 2021, 9:35 AM IST

మనిషి, జంతువులు బరువు పెరగడం, తగ్గడం సహజమే. మరి భూమికి కూడా ఇది వర్తిస్తుందా? ఇదే నిజమైతే భూమి బరువు తగ్గుతోందా? పెరుగుతోందా? వీటి వల్ల మనిషికి నష్టం ఏమైనా ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి..

బరువు తగ్గుతోందా?

కొత్తగా వచ్చి చేరుతున్న దుమ్ము, ధూళి పదార్థాల కారణంగా భూమి ఏటా 40వేల టన్నుల బరువు పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే సమయంలో భూమి వాతావరణం నుంచి ఏటా 95వేల టన్నుల హైడ్రోజన్​ వాయువు పోతోందని వివరించారు.

మరోవైపు రేడియోధార్మిక క్షీణత(ఏడాదికి 160 టన్నులు), హీలియం తగ్గుదల(ఏడాదికి 1,600 టన్నులు) ఉన్నప్పటికీ.. భూమి బరువుపై వాటి ప్రభావం తక్కువే.

అంటే భూమి ఏడాదికి దాదాపు 50వేల టన్నుల బరువు తగ్గుతోంది. వినడానికి ఇది చాలా పెద్ద మొత్తంగానే ఉంటుంది. కానీ భూమి బరువు 5.97 బిలియన్​ ట్రిలియన్​ టన్నులు. అందువల్ల ఇదే వేగంతో భూమి బరువు తగ్గినా పూర్తిగా కనుమరుగవడానికి 1,20,000 ట్రిలియన్​ సంవత్సరాలు పడుతుంది. భూమి వయస్సుకు ఇది ఎన్నో లక్షలు అధికం. అందువల్ల ఇలా బరువు తగ్గుతున్నా.. ఇప్పట్లో మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇదీ చూడండి:- ఉల్కలతో మానవాళికి ఉపద్రవం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.