IPhone Security Update : యాపిల్ సంస్థ తమ ఐఫోన్, ఐపాడ్ యూజర్ల కోసం అత్యవసరంగా ఓ సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసింది. యాపిల్ డివైజెస్లోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని స్పష్టం చేసింది. అందుకే ఐఫోన్, ఐపాడ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరింది.
ఐఫోన్‌లో భద్రతా లోపాలు!
IPhone Security Issues : యాపిల్ ప్రొడక్టులైన ఐఫోన్, ఐపాడ్ల్లోని కొన్ని లోపాలను ఉపయోగించుకుని.. వాటిలోకి స్పైవేర్స్ ప్రవేశపెట్టేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ విషయం గుర్తించిన యాపిల్ వెంటనే అప్రమత్తమై, తమ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందించింది.
యూజర్ ప్రమేయం లేకుండానే!
IPhone Security Threat 2023 : ఐఫోన్, ఐపాడ్ల్లోని సాఫ్ట్‌వేర్ భద్రతా లోపాలను సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్‌డాగ్ గుర్తించింది. అలాగే వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సివిల్ సొసైటీ ఉద్యోగి ఐఫోన్‌లోకి ‘పెగాసస్ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను (స్పై సాఫ్ట్‌వేర్) చొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నించినట్లు కనిపెట్టింది. వెంటనే ఈ విషయాన్ని యాపిల్ కంపెనీకి తెలియజేసింది. ఆందోళనాకరమైన విషయం ఏమిటంటే.. అసలు యూజర్ ఏమీ చేయకుండానే స్పైవేర్ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యేలా హ్యాకర్లు ప్లాన్ చేశారు. ఒక వేళ ఈ స్పైవేర్ లేదా మాల్వేర్ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి యాక్టివేట్ అయితే.. యూజర్‌కు తెలియకుండానే కెమెరా ఆన్ కావడం, వాయిస్ రికార్డ్ జరగడం లాంటి కార్యకలాపాలు వాటంతట అవే జరుగుతాయి. అంటే మీ వ్యక్తిగత సమాచారం అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
జీరో డే బగ్స్
Zero Day Bug Apple : ఐఫోన్‌లోని భద్రతాపరమైన లోపాలను.. సిటిజన్ ల్యాబ్స్ ‘జీరో-డే-బగ్స్’గా వ్యవహరించింది. అంటే వీటిని సరిదిద్దడానికి యాపిల్ వద్ద కనీసం ఒక్క రోజు సమయం కూడా లేదని పేర్కొంది. అయితే యాపిల్ కంపెనీ మాత్రం వెనువెంటనే అప్రమత్తమై.. భద్రతాపరమైన లోపాలను సరిదిద్ది, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను యూజర్స్‌కు అందించింది. ఒకవేళ మీరు కూడా ఐఫోన్, ఐపాడ్ యూజర్లయితే.. వెంటనే మీ ఫోన్‌ను, ఐపాడ్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్‌కు తప్పని ముప్పు!
Pegasus Spyware Issue In India : భారతదేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులపై నిఘా కోసం ప్రభుత్వమే పెగాసస్ (Pegasus spyware)ను కొనుగోలు చేసిందని అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం ప్రజలకు తెలిసినదే.