IPhone Discount Sale : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త వినిపించింది యాపిల్ సంస్థ. సరికొత్త ఐఫోన్ 15ను లాంఛ్ చేయనున్న నేపథ్యంలో.. ఐఫోన్ 14, ఐఫోన్ 13లపై బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.
ఐఫోన్ 14 డిస్కౌంట్ డీల్స్!
IPhone Discounts India :
- ఐఫోన్ 14 అసలు ధర- రూ.79,900/-
- ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర- రూ.66,999/- (రూ.12,901 వరకు స్పెషల్ డిస్కౌంట్)
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.4,000/- డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనితో ఐఫోన్ 14 కేవలం రూ.62,999/-లకే లభించనుంది.
- మొత్తంగా ఐఫోన్ 14పై రూ.16,901 వరకు ఆఫర్ లభిస్తుంది.
ఐఫోన్ 13 డిస్కౌంట్ డీల్స్!
Offers On IPhone :
- ఐఫోన్ 13 అసలు ధర- రూ.69,900/-
- ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ధర- రూ.56,999/- (రూ.12,901 వరకు స్పెషల్ డిస్కౌంట్)
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్స్‌కు రూ.2,000/- వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
- దీనితో రూ.54,999/-లకే ఐఫోన్ 13ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 13, ఐఫోన్ 14 ఫీచర్స్
IPhone Features : రెండేళ్ల క్రితం వచ్చిన 5జీ మోడల్ ఐఫోన్ 13లోని ఫీచర్స్‌నే ఐఫోన్ 14లోనూ గమనించవచ్చు. కెమెరా, బ్యాటరీ లైఫ్, డిస్ప్లే, చిప్సెట్ ఇలా దాదాపు రెండింటిలో సమానమైన ఫీచర్స్‌ను ఆస్వాదించవచ్చు. వాస్తవానికి ఐఫోన్ 11 మోడల్లోనూ ఇదే డిజైన్ ఉంటుంది. తక్కువ ధరలో ఐఫోన్ సొంతం చేసుకోవాలని ఆశించేవారు ఐఫోన్ 13, ఐఫోన్ 14లను ఈ డిస్కౌంట్ డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసుకోవచ్చు.
మరికొద్ది గంటల్లో ఐఫోన్ 15 లాంఛ్!
IPhone 15 Launch Date : సెప్టెంబర్ 12 (మంగళవారం) భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో ఐఫోన్ 15ను లాంఛ్ చేయనున్నారు. దీనితో పాటు యాపిల్ వాచెస్, ఎయిర్‌పాడ్స్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రూపొందించిన సరికొత్త iOS 17, iPadOS 17, WatchOS 10లతో పాటు త్వరలో రానున్న సాఫ్ట్వేర్ అప్డేట్ల గురించి ఈ కార్యక్రమంలో తెలియజేయనుంది యాపిల్.
ఐఫోన్ 15 ఫీచర్స్ ఇవేనా?
IPhone 15 Price : టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఐఫోన్ 15లో మిగతా మోడల్స్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, చిప్సెట్, డిజైన్ సహా అన్నింటిలోనూ సరికొత్త మార్పులు ఈ నయా మోడల్లో చూడవచ్చు. అయితే వీటి ప్రారంభ ధరలు రూ.80,000 లేదా అంత కంటే ఎక్కువ ఉండవచ్చు.
- Apple Event 2023 : ఐఫోన్ 15 లాంఛ్‌కు అంతా రెడీ!.. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ కూడా.. ధర ఎంతంటే?
- Android Phones Security Risk : ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అలర్ట్.. ఫేక్ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌తో.. జర జాగ్రత్త!
- Whatsapp Cross Platform Messaging : క్రేజీ అప్డేట్.. వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు ఈజీగా మెసేజ్!.. ఫొటోలు, వీడియోలు కూడా!!