Iphone Battery Saving Tips : ఈ మధ్య కాలంలో చాలా మంది ఆపిల్ ఐఫోన్లు ఉపయోగిస్తున్నారు. భద్రతా రీత్యా, మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఇతర కారణాలు ఏవైనా కానీ.. వీటికి డిమాండ్ ఎక్కువే. అయితే.. ఈ ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ సరిగా ఉండదు అనే అపవాదు ఉంది. ఎక్కువ సేపు ఛార్జింగ్ ఆగదని చాలా మంది అంటారు. అందువల్ల 100 శాతం వరకు ఛార్జింగ్ పెడతారు. కానీ 80 శాతం కంటే మించి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసా.. ఎందుకో ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15 మోడల్‌ని విడుదల చేసింది. ఇందులో గతంలో కంటే మంచి ఫీచర్లు తీసుకొచ్చింది. టైప్ సీ ఛార్జింగ్ పోర్టు, మంచి బ్యాటరీ బ్యాకప్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసింది. గత మోడళ్లలో ఛార్జింగ్ పరంగా పలు ఫిర్యాదులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త మోడళ్లలో బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచడానికి తయారీదారులు పలు చర్యలు తీసుకున్నారు. అందులో బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జ్ చేసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.
సాధారణంగా అన్ని స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి గరిష్ఠంగా 80 శాతం వరకే ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అంతకు మించి పెడితే.. వాటిల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కాలక్రమేణా క్షీణిస్తాయి. ఛార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేయడం ద్వారా, మీరు మీ బ్యాటరీపై కలిగే వేడి, ఒత్తిడిని తగ్గించవచ్చు. ఫలితంగా బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది.
బ్యాటరీ పనితీరు మందగించినప్పుడు చాలా మంది దాన్ని మార్చాలని అనుకుంటారు. కానీ దాని బదులు అది ఎక్కువ కాలం పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అందులో ముందుగా తీసుకోవాల్సినది 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయడం. సాధారణంగా ఫోన్ బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 10 గంటలు వస్తుంది. అదే 8 గంటలు ఛార్జ్ చేయడం వల్ల 8 గంటలే వస్తుంది.
చాలా మంది వినియోగదారులు బ్యాటరీ సెట్టింగ్స్‌ని డీఫాల్ట్ మోడ్‌లోనే పెట్టుకుంటారు. ఇది మంచిదే. మరోవైపు బ్యాటరీ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధిక శాతం మంది ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లిథియం, అయాన్ బ్యాటరీల పనితీరు వేగంగా క్షీణిస్తుందని అనుకుంటారు. అందులో కొంత వరకు నిజమున్నా.. దీంతో పాటు అధిక ఉష్ణోగ్రత, ఛార్జింగ్ పూర్తిగా ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు వాడటం కూడా కారణం.
అందుకే ఫోన్‌ను పరిమితంగా ఛార్జ్ చేయడం మంచిది. ఛార్జింగ్ వంద శాతం ఉన్నా, పూర్తిగా లేకపోయినా బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. 80 శాతానికి పైగా ఛార్జ్ చేసినప్పుడు వేడిగా అయి దెబ్బతినే అవకాశముంది. మరో విషయం ఏంటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. అందుకే ఐఫోన్లో ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. దీంతో త్వరగా పాడవుకుండా ఉంటుంది. ఐఫోన్లో ఛార్జింగ్ 80 శాతానికి చేరుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
బ్రైట్‌నెస్‌ని అధికంగా కాకుండా తక్కువగా పెట్టుకోవాలి. బ్యాటరీ పవర్ సేవర్ మోడ్‌ని ఆన్‌లో ఉంచుకోవాలి. అనవసరమైన అప్లికేషన్ల నోటిఫికేషన్లు ఆఫ్‌లో పెట్టుకోవడం, లొకేషన్ యాక్సెస్ పరిమితంగా ఇవ్వడం మంచిది. ఫోన్ ఉపయోగించని సమయంలో లాక్ చేయడం లాంటివి చేయడం ద్వారా బ్యాటరీ జీవిత కాలాన్ని పొడిగించవచ్చు. అదే సమయంలో ముఖ్యమైన ఫీచర్లు మిస్సవ్వకుండా చూడండి. ఐఫోన్ వినియోగదారులు అయితే వీటితో పాటు బ్యాటరీ సెట్టింగ్స్‌ని ఎప్పుడూ డీఫాల్ట్లోనే పెట్టాలి. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టొద్దు. కార్లో ఛార్జింగ్ పెడితే.. ఎండకు దూరంగా ఉండేలా చేసుకోండి. స్క్రీన్ ఆటోమేటిక్ లాక్‌ని ఆన్‌లో ఉంచుకోవాలి.
మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు పాటించండి!
Phone Battery Health Check : ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలా?.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి!