ETV Bharat / science-and-technology

ఐఓఎస్​లో అదిరే అప్డేట్​.. ప్రైవసీ రిపోర్టులు సహా మరెన్నో ఫీచర్లతో... - యాపిల్ న్యూస్

iOS 15.2 features: యాపిల్ ఐఓఎస్ 15.2 వెర్షన్ విడుదలైంది. కొత్తగా అనేక అప్​డేట్లను తీసుకొచ్చింది. ప్రైవసీ రిపోర్ట్స్​, మ్యూజిక్ ప్లాన్, షేర్​ ప్లే, లెగసీ కాంటాక్ట్స్ ఫీచర్లను తీసుకురావడం సహా.. పలు బగ్స్​ను తొలగించింది.

iOS 15.2 Features
iOS 15.2 Features
author img

By

Published : Dec 15, 2021, 2:31 PM IST

iOS 15.2 features: యాపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్. ఐఫోన్ కోసం కొత్తగా ఐఓఎస్ 15.2 ఆపరేటింగ్ సిస్టమ్​ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యాపిల్ మ్యూజిక్, ఐమెసేజ్, యాప్ ప్రైవసీ రిపోర్ట్స్ సహా అనేక అప్​డేట్లను తీసుకొచ్చింది.

Apple App Privacy Reports

ఫోన్​లో ఉన్న యాప్​లు ఎంత తరచుగా యూజర్ల లొకేషన్, ఫొటోలు, మైక్రోఫోన్, కాంటాక్టులు, నెట్​వర్క్ యాక్టివిటీని ట్రాక్ చేస్తున్నాయో తెలిపేలా యాప్ ప్రైవసీ రిపోర్ట్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ 15.2 ఐఓఎస్​లో ఉండనుంది. ఏడు రోజుల సమాచారం ఈ రిపోర్టులో ఉంటుంది.

మ్యూజిక్ ప్లాన్

'యాపిల్ మ్యూజిక్​ వాయిస్' ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది యాపిల్. రూ.49 చెల్లించి దీనికి సబ్​స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ సబ్​స్క్రిప్షన్​తో యాపిల్ మ్యూజిక్​లోని పాటలు, ప్లేలిస్ట్​లు, సాంగ్ స్టేషన్లను యాక్సెక్ చేసుకోవచ్చు. సబ్​స్క్రిప్షన్ ప్రక్రియను కూడా చాలా సులభతరం చేసింది యాపిల్. వాయిస్ అసిస్టెంట్ 'సిరి'ని అడిగి కూడా.. ట్రయల్ ప్రారంభించవచ్చు. తమ హిస్టరీ, లైక్​లను బట్టి నచ్చిన పాటలను సజెస్ట్ చేసేలా సిరిని కోరవచ్చు.

Apple Legacy Contacts Feature

కొత్తగా డిజిటల్ లెగసీ అనే ఫీచర్​ ప్రవేశపెట్టింది యాపిల్. యూజర్లు తమ మరణం తర్వాత ఫోన్​లోని డేటాను యాక్సెస్ చేసేందుకు అనుమతించేదే ఈ ఫీచర్. తమకు నమ్మకమైన వారి ఫోన్​ నెంబర్లను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తద్వారా మరణించిన తర్వాత ఐక్లౌడ్​ డేటాను లెగసీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులు యాక్సెక్ చేసే వీలు కలుగుతుంది.

Communication safety feature iOS 15.2

ఐఓఎస్ 15.2లో భాగంగా ఐమెసేజ్​లో కీలక మార్పులు చేసింది. యాప్​లో కమ్యూనికేషన్ సేఫ్టీ ఫీచర్​ను తీసుకొచ్చింది. పిల్లలు అశ్లీల చిత్రాలు పంపించినా, స్వీకరించినా తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశం వచ్చేలా ఈ ఫీచర్​ను రూపొందించింది.

మ్యాక్రో ఫొటో..

ఐఫోన్ 13, 13 ప్రో మ్యాక్స్​ కోసం ప్రత్యేక ఫీచర్​ను.. ఈ ఓఎస్ ద్వారా అందించింది. ఈ రెండు ఫోన్లలో ఉన్న 'మ్యాక్రో ఫోటో' మోడ్​ ద్వారా.. అత్యంత సూక్ష్మమైన చిత్రాలు, వీడియోలను తీసుకోవచ్చు.

Photo Memory iOS 15.2

ఫోటో మెమోరీ ఆప్షన్​ను సైతం రీడిజైన్ చేసింది. కొత్త ఇంటర్​ఫేస్, యానిమేషన్​తో యాప్​ను తీర్చిదిద్దింది. ఫొటో కొలేజ్​లోనూ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది.

Share Play iOS 15.2

అన్ని మాక్ డివైజ్​లతో సపోర్ట్ చేసేలా షేర్​ప్లే యాప్​ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వీడియో కాల్​లో మాట్లాడుతున్న యూజర్లతో యాపిల్ మ్యూజిక్​లోని పాటలను పంచుకునే వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ చేసుకొని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసే అవకాశం కూడా ఉంటుంది.

మెరుగైన మ్యాప్స్

నేవిగేషన్ యాప్ అయిన యాపిల్ మ్యాప్స్​లోని 'కార్​ ప్లే' ఫీచర్​లో సిటీ మ్యాప్​ను మెరుగుపర్చారు. టర్నింగ్ లేన్లు, సెంట్రల్ రిజర్వేషన్లు, సైకిల్ లేన్లు, పెడస్ట్రియన్ క్రాసింగ్​ల ప్రదేశాలను స్పష్టంగా చూసేలా అప్​డేట్ చేశారు.

ట్రాక్​ప్యాడ్, స్క్రీన్​సేవర్ సమస్యలతో పాటు మ్యాక్​లో ఉన్న కొన్ని బగ్స్​ను సైతం ఈ అప్​డేట్ ద్వారా తొలగించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.