ఇన్‌స్టాగ్రామ్‌ను యువతకు సురక్షిత ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ యాజమాన్యం (Instagram new features 2021) నూతన ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. హాని కలిగించే కంటెంట్‌కు దూరంగా ఉండే విధంగా ఎంచుకునే వెసులుబాటును యూజర్‌కు కల్పించనుంది. ప్లాట్‌ఫామ్ నుంచి కాసేపు విరామం తీసుకునేలా యువతను ప్రోత్సహించే ఫీచర్‌నూ (Instagram features 2021) ప్రవేశపెట్టనుంది. ఇన్‌స్టా ద్వారా యువతకు ఫేస్బుక్ హాని కలిగిస్తోందని ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించిన వెంటనే ఈ ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
సురక్షితం కాని కంటెంట్‌ను యువత (Instagram new features for youth) తరచుగా చూస్తున్నట్లయితే.. అలాంటివారిని వేరే కంటెంట్ చూసే విధంగా ప్రోత్సహించనున్నారు. హానికరమైన సమాచారాన్ని యువత చూస్తున్నట్లయితే.. ప్లాట్‌ఫామ్ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకోమని పాప్అప్ వస్తుంది. దీంతో అతడు తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నట్లు తెలుసుకోగలడని వెల్లడించింది ఆ సంస్థ.
యువతను ఫేస్బుక్ తప్పుదోవ పట్టిస్తుందని ఫ్రాన్సిస్ హాగెన్ అనే ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా విషపూరితమైన కంటెంట్‌తో యువతకు చేటుచేసే ప్రమాదం ఉందని సంబంధిత అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లారు. ఇన్‌స్టాలో యువతకు హానికలిగే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్‌కు తెలిసినా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈమె ఆరోపణల వెంటనే ఫేస్బుక్ చర్యలకు ఉపక్రమించింది. పలు విమర్శల నేపథ్యంలో 13 ఏళ్లలోపు పిల్లల కోసం తీసుకురానున్న 'ఇన్స్టాగ్రామ్ కిడ్స్' లాంచింగ్‌ను కూడా ఆ సంస్థ నిలుపుదల చేసింది.
ఇదీ చదవండి:మీ వాట్సాప్ రద్దయిందా?.. ఇలా చేయండి!