ETV Bharat / science-and-technology

ఇన్​స్టా కొత్త ఫీచర్​- ఇక రీల్స్​లో 'రీమిక్స్​' - ఇన్​స్టా రీల్స్​లో రీమిక్స్ ఫీచర్​

షార్ట్​ వీడియో ఫీచర్​ రీల్స్​కు మరో కొత్త సదుపాయాన్ని జోడించింది ఇన్​స్టాగ్రామ్. రీల్స్​లో ఇతరుల వీడియోలకు డ్యూయెట్​ చేయడం సహా ఫన్నీగా స్పందించేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్​ తీసుకొచ్చింది.

reels more effective
రీల్స్​ మరింత ఆకర్షణీయం
author img

By

Published : Apr 2, 2021, 1:56 PM IST

టిక్​టాక్​కు పోటీగా తీసుకొచ్చిన 'రీల్స్​'లో మరో కొత్త ఫీచర్​ను జోడించింది ఇన్​స్టాగ్రామ్. టిక్​టాక్​లో బాగా ఆదరణ పొందిన డ్యూయెట్​ ఫీచర్​ను.. 'రీమిక్స్​' పేరుతో రీల్స్​ యూజర్స్​కు పరిచయం చేసింది.

ఏమిటీ 'రీమిక్స్'..

ఇప్పటికే రీల్స్​లో ఉన్న వీడియో పక్కన మరో యూజర్​ వీడియోను జోడించేందుకు వీలు కల్పించేదే ఈ రీమిక్స్. ఉదాహరణకు డ్యాన్స్ ఛాలెంజ్​లు, ఫన్నీగా స్పందించేందుకు వీలుగా ఈ ఫీచర్​ ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలి..

  • మొదట రీల్స్​లో.. రీమిక్స్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోవాలి
  • వీడియో కుడివైపు పై భాగంలోని మూడు చుక్కల మెనూను క్లిక్​ చేస్తే.. అందులో రీమిక్స్​ ఫీచర్​ కనిపిస్తుంది.
  • రీమిక్స్​పై క్లిక్​ చేస్తే.. స్క్రీన్​ రెండు భాగాలుగా విడిపోయి.. ఓ వైపు మీరు ఎంచుకున్న వీడియో, మరోవైపు మీ వీడియో రికార్డర్​ ఓపెన్ అవుతుంది. రికార్డ్​ బటన్​ క్లిక్​ చేసి మీ వీడియోను రికార్డ్​ చేయొచ్చు.
  • ఇందులో రీమిక్స్ చేసే వీడియోలోని ఆడియోను తగ్గించుకునేందుకు కూడా వీలుంది. దీంతోపాటు మీరు వీడియోతో పాటు ఆడియోను కూడా రికార్డ్​ చేసుకోవచ్చు. రీమిక్స్​లో కూడా ఫిల్టర్లు పని చేస్తాయి.
    • Re-re-re-remix 🤩

      Now you can use the Remix feature in Reels to create your own reel next to one that already exists 🎭

      Whether you’re capturing your reaction, responding to friends or bringing your own magic to trends, Remix is another way to collab on Instagram ✨ pic.twitter.com/eU8x74Q3yf

      — Instagram (@instagram) March 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:ఆ కంప్యూటర్లలో ఇక మౌస్​ మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.