Infinix Note 11 Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ను భారత మార్కెట్లోకి సోమవారం ప్రవేశ పెట్టింది. మధ్యశ్రేణి కస్టమర్ల కోసం నోట్ 11, నోట్ 11ఎస్ పేరుతో మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ల విక్రయాలు సోమవారం(డిసెంబర్ 13) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు. తక్కువ ధరకు ఆకర్షణీయ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Infinix Note 11 Feature
ఇన్ఫినిక్స్ నోట్ 11 ఫీచర్లు..
- 6.7 అంగుళాల హెచ్డీ అమోల్డ్ డిస్ప్లే
- ర్యామ్ 8 జీబీ, స్టోరేజీ 128 జీబీ
- మీడియా టెక్ హెలియో జీ96 చిప్ సెట్‌తో పనిచేస్తుంది.
- మెయిన్ కెమెరా 50 ఎంపీ, 2ఎంపీ
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- ఫేషియల్ అన్‌లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
- డీటీఎస్ డ్యూయల్ స్పీకర్
- ఆండ్రాయిడ్ 11
- మూడు రంగుల్లో (గ్లాసియర్ గ్రీన్, గ్రాఫైట్ బ్లాక్, సెలిస్టియల్ స్నో)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా.
- ధర సుమారు రూ. 11,999
Infinix Note 11S Feature
ఇన్ఫీనిక్స్ నోట్ 11 ఎస్ ఫీచర్లు ఇలా..
- 6.95 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- ర్యామ్ 4 జీబీ, స్టోరేజీ 128 జీబీ
- మీడియా టెక్ హెలియో జీ96 చిప్ సెట్‌తో పనిచేస్తుంది.
- మెయిన్ కెమెరా 50 ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- ఫేషియల్ అన్‌లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
- డీటీఎస్ డ్యూయల్ స్పీకర్
- ఆండ్రాయిడ్ 11
- మూడు రంగుల్లో అందుబాటులోకి (మిత్రిల్ గ్రే, హాజీ గ్రీన్, సింఫనీ క్యాన్)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా.
- ధర రూ. 14,999 (8జీబీ ర్యామ్, 128 జీబీ)
- ధర రూ. 12,999 (4 జీబీ ర్యామ్, 64 జీబీ)
ఇదీ చూడండి: Artificial Intelligence: కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి