ETV Bharat / science-and-technology

'శాస్త్ర-సాంకేతిక సమాచారం పంచుకునేందుకు సిద్ధం' - india-believes-in-sharing-technical-know-how-with-other-countries-harsh-vardhan

ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం శాస్త్ర, సాంకేతిక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి భారత్​ ఎల్లప్పుడూ ముందుంటుందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్​ తెలిపారు. ఐఐఎస్​ఎఫ్-2020 లో పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

india-believes-in-sharing-technical-know-how-with-other-countries-harsh-vardhan
'ఆ సమాచారం పంచుకోవడాన్ని భారత్​ విశ్వసిస్తోంది'
author img

By

Published : Dec 24, 2020, 6:10 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడానికి భారత్​ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్​ అన్నారు. తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్​ బలంగా విశ్వసిస్తోందన్నారు. రాష్ట్రాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్​ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్​ ఫెస్టివల్​(ఐఐఎస్​ఎఫ్​)-2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రముఖులు, మంత్రులు, నిపుణులతో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. ఇందులో పాల్గొన్న రాష్ట్రాల మంత్రులు.. కరోనా అనంతరం జీవనోపాధి అంశాలపై చర్చించారు. సైన్స్​ అండ్​ టెక్నాలజీ విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడాన్ని భారత్​ సదా విశ్వసిస్తుంది.

- డా.హర్ష వర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రజల ప్రతి సమస్యను సైన్స్ ద్వారా పరిష్కరించవచ్చని ఆరోగ్య మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: కొత్త రకం కరోనాపై ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.