ETV Bharat / science-and-technology

వాట్సాప్​కు కేంద్రం 'వార్నింగ్​ లెటర్'​!

author img

By

Published : Jan 19, 2021, 4:40 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

కొత్త నిబంధనల విషయంపై వాట్సాప్​కు కేంద్రం లేఖ రాసింది. యూజర్ల గోప్యతకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదని అందులో అభిప్రాయపడింది. వాట్సాప్ ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలని సూచించింది.

WhatsApp to Withdraw new rules
వాట్సాప్​ కొత్త రూల్స్​పై కేంద్రం స్పందన

వాట్సాప్ కొత్త నిబంధనలపై భారత ప్రభుత్వం స్పందించింది. వ్యక్తిగత గోప్యత ప్రమాణాల విషయంలో ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యం కాదని వాట్సాప్​కు సూచించింది. నిబంధనల్లో మార్పులను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్​కు తెలిపింది. మార్పుల విషయాన్ని పునరాలోచించాలని పేర్కొంది.

ఈ మేరకు వాట్సాప్ సీఈఓకు ఎలక్ట్రానిక్స్, ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 'వాట్సాప్​కు అత్యధిక యూజర్​ బేస్ ఉన్న దేశం భారత్. వాట్సాప్​కు అతిపెద్ద మార్కెట్లలో భారత్​ కూడా ఒకటి' అనే విషయాన్ని లేఖలో గుర్తు చేసింది.

వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సేవా నిబంధనలు, గోప్యతా ప్రమాణాల్లో మార్పులతో.. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వాట్సాప్​కు లేఖ రాయడం గమనార్హం.

ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాం..

వాట్సాప్ నిబంధనల్లో మార్పులను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. '15వ ఇండియా డిజిటల్​ సదస్సు'లో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమివ్వాలనే విషయాన్ని నొక్కి చెప్పారు.

వాట్సాప్​ కొత్త నిబంధనల ప్రకారం.. తమ డేటాను దాని మాతృసంస్థ ఫేస్​బుక్​తో పంచుకుంటుందనే కారణంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వాట్సాప్..​ ఎలాంటి డేటాను వినియోగాదారుల నుంచి తీసుకోబోమని యూజర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. నిబంధనల్లో మార్పులు బిజినెస్​ ఖాతాలకు సంబంధించినవేనంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేసింది.

ఇవీ చూడండి:

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.