ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గత ఏడాది భారత్ అత్యధిక సైబర్ దాడులు ఎదుర్కొన్న రెండో దేశంగా నిలిచినట్లు టెక్ దిగ్గజం ఐబీఎం నివేదికలో తేలింది. మొత్తం సైబర్‌దాడుల్లో 7 శాతం భారత్‌పైనే జరిగినట్లు పేర్కొంది. ఈ జాబితాలో జపాన్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపింది.
కొవిడ్-19పై పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఆస్పత్రులు, ఫార్మా కంపెనీలు, మెడికల్ విభాగాలపైనే అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు ఐబీఎం సెక్యూరిటీ ఎక్స్-ఫోర్స్ గుర్తించింది. వివిధ రంగాలపై కరెన్సీ మైనింగ్, సర్వర్ యాక్సెస్ వంటి దాడులూ జరిగినట్లు వెల్లడించింది.
భారత్‌లో ఆర్థిక సేవలు, బీమా రంగాలపై ఎక్కువగా (60 శాతం) సైబర్ దాడులు జరిగినట్లు నివేదిక వివరించింది. మొత్తం సైబర్ దాడుల్లో 40 శాతం వాటా రాన్సమ్వేర్దేనని వెల్లడించింది. సైబర్ దాడుల ముప్పు 2021లోనూ అధికంగానే ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:ఆచితూచి అడుగులు.. పోల్చి చూశాకే కొనుగోలు