How to Turn off Business Ads in Google Maps in Mobiles : తెలియని అడ్రస్‌కు వెళ్లాలంటే.. ఎవర్నో అడగాల్సిన పనిలేదు. "జై గూగుల్ మాత" అంటూ గూగుల్ మ్యాప్స్(Google Maps) చూసుకుంటూ వెళ్లిపోతున్నారు అందరూ. అయితే.. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్తుంటే మధ్యలో వచ్చే బిజినెస్, ఇతర యాడ్స్(Business Ads) ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు.. ద్విచక్రవాహనదారులైతే బండి పక్కన ఆపి, వాటిని స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లమ్. అయితే.. ఇక్కడ మేము చెప్పే సెట్టింగ్స్ ఓసారి మీ ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుంటే చాలు. చూద్దామన్నా మీకు యాడ్స్ కనిపించవు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి? ఎలా వాటిని సెట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Turn Off Business Ads in Google Maps in Telugu :
Google మ్యాప్స్‌లో వ్యాపార ప్రకటనలను ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
- ముందుగా మీ Android ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి Googleపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీరు Google Mapsతో ఉపయోగించే Google అకౌంట్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి Personalize using shared data అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన పేజీలో Maps అని ఉన్న టోగుల్ను ఆఫ్ చేయండి.
- ఆ తర్వాత మీరు Google మ్యాప్స్‌ని ఓపెన్ చేసి యాడ్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు.
బిజినెస్ ప్రమోట్ చేయడానికి నావిగేషన్ సమయంలో Google Maps అనేవి ప్రకటనలను చూపిస్తుంటాయి. ఇలా సెట్ చేసుకోవడం ద్వారా మీకు సమీపంలోని వ్యాపారాలను, స్థలాలను చూపే యాడ్స్, సెర్చింగ్‌లో స్థలాలను ఆటోమెటిక్‌గా సూచించడం లాంటివి ఆఫ్ చేయబడవు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
Google ద్వారా యాడ్ పర్సనలైజేషన్ నిలిపివేయండిలా..
How to Disable Ad Personalization by Google : మీ సమాచారం ప్రాధాన్యతల ఆధారంగా Google ప్రకటనలను పర్సనలైజ్ చేస్తుంది. అయితే.. ఈ ప్రకటనలు మీకు ఇబ్బంది కలిగించేవిగా అనిపిస్తే.. మీరు యాడ్ పర్సనలైజేషన్ పూర్తిగా నిలిపివేయవచ్చు. దానిని మీ ఫోన్‌లో ఎలా సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీ బ్రౌజర్‌లో myaccount.google.com/yourdata/mapsని సందర్శించాలి.
- ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి Ad Personalization అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో Ad personalization is ONఅని ఉన్న టోగుల్‌ని ఆఫ్ చేయాలి.
- చివరగా టర్న్ ఆఫ్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇకపై అలాంటి యాడ్స్ కనిపించవు.
- మీ ప్రకటనలను పర్సనలైజ్ చేయడానికి Google మొత్తం డేటాను ఎలా ఉపయోగిస్తుందో చూడడానికి మీరు అదే పేజీలో కిందికి స్క్రోల్ చేయవచ్చు.
టోల్ గేట్స్ లేని 'ఫ్రీ రూట్స్' కావాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఇలా చేయండి!
మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయని ఆ యాప్స్‌పై డౌటా? ఇలా చేయండి!