Phone Heating Problem : మనం వాడే ఫోన్లు ఒక్కొక్కసారి వేడెక్కుతూ ఉంటాయి. ఫోన్‌ను పట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది. ఏదో ఒకసారి వేడెక్కితే, అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ రోజూ వేడెక్కుతూనే ఉంటే మీ ఫోన్‌లో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా బ్యాటరీతో పాటు ఇతర సమస్యల వల్ల ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే అప్రమత్తం కావాలి.
Phone overheating problem : ఫోన్ రోజూ వేడెక్కుతున్నా.. పట్టించుకోకపోతే, కొంత కాలానికి ఫోన్ పని వేగం తగ్గిపోయింది. తర్వాత ఫోన్ పనిచేయడమే మానేస్తుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడి చర్యలు తీసుకోవడం వల్ల ఫోన్‌ను కాపాడుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే వేడెక్కకుండా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఫోన్ వేగంగా పనిచేసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దామా?
ఫోన్ వేడెక్కడానికి కారణాలు ఇవే!
Phone overheating reasons : ఫోన్ వేడెక్కడానికి అనేక కారణాలు ఉంటాయి. ఫోన్‌ను ఎండలో ఉంచడం లేదా వేడి ప్రదేశాల్లో ఎక్కవసేపు ఉంచడం, ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, బ్యాటరీ లేదా ఛార్జర్‌లో సమస్య, ఫోన్ సాఫ్ట్‌వేర్‌లలో బగ్‌లు, మాల్‌వేల్ కలిగిన యాప్స్ కలిగి ఉండటం, పనిచేయని అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణంగా ఫోన్లు వేడెక్కుతూ ఉంటాయి.
ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
Phone Heating Issue : ఫోన్ వేడెక్కడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం, లేదా ఛార్జింగ్ ఎక్కకుండా ఆగిపోవడం, ఫోన్ సిగ్నల్ బలహీనపడటం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. దీని వల్ల ఫోన్‌లోని బ్యాటరీ, సిమ్ కార్డ్, ఇతర కీలక భాగాలు పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతాయి. అలాగే ఫోన్ వేడెక్కడం వల్ల కెమెరా ఫ్లాష్ లైట్ కూడా పనిచేయదు
వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి?
How to protect phone from overheating : సూర్యకాంతి నేరుగా ఫోన్ మీద పడకుండా చూసుకోవాలి. చల్లని ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచుకోవాలి. కారులో ఎండ పడే ప్రదేశంలో ఫోన్‌ను పెట్టుకోకూడదు. చొక్కా జేబులో లేదా బ్యాక్‌ప్యాక్‌లో ఉంచుకోవాలి. టవల్ లేదా దుప్పటి, డ్యాష్‌బోర్డ్ వంటి వాటిల్లో ఫోన్‌ను ఉంచుకోవడం వల్ల సూర్యకాంతి నేరుగా పడకుండా ఫోన్ సురక్షితంగా ఉంటుంది.
కిచెన్‌లో పెట్టవద్దు
Mobile overheating in hot weather : వేడి అధికంగా ఉండే ప్రదేశాల్లో ఫోన్‌ను పెట్టుకూడదు. ముఖ్యంగా వంటగది వంటి ప్రాంతాల్లో ఫోన్‌ను ఉంచకూడదు. అలాంటి ప్రదేశాల్లో తరచూ ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కుతోంది. దీని వల్ల ఫోన్ చెడిపోతుంది.
ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడొద్దు
Phone overheating when charging : చాలామందికి ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. అలాంటి పనులకు దూరంగా ఉండాలి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించడం వల్ల వేడెక్కుతుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు హైగ్రాఫిక్స్ ఉండే పబ్జీ వంటి వీడియో గేమ్‌లు, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ యాప్‌లు ఉపయోగించకూడదు.
ఫోన్ వేడెక్కకుండా ఉండడానికి.. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్, యాప్‌లను అప్‌డేట్ చేయండి. వాస్తవానికి మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉండే బగ్‌లు ఫోన్‌ను వేడెక్కేలా చేస్తాయి. అందుకే ఎల్లప్పుడూ సాఫ్ట్‌వేర్లను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే థర్డ్ పార్టీ ఛార్జర్లకు, చౌకగా లభించే డిజైన్ చేయబడిన ఛార్జర్లకు దూరంగా ఉండాలి.