ETV Bharat / science-and-technology

How To Protect WiFi Router From Hackers : మీ WiFi హ్యాక్​ అయిందని డౌట్​గా ఉందా?.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నో ప్రాబ్లమ్​! - వైఫై హ్యాకింగ్ రక్షణ

How To Protect WiFi Router From Hackers : ఈ మధ్యకాలంలో సైబర్​ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైఫై రూటర్ల ద్వారా కూడా డేటాను చోరీ చేస్తున్నారు. ఇంతకీ సైబర్​ నేరగాళ్లు వైఫైను ఎలా హ్యాక్​ చేస్తారు? వైఫై హ్యాక్​ గురైందని ఎలా తెలుసుకోవచ్చు? అలా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలేంటో తెలుసుకుందాం.

how-to-protect-wifi-router-from-hackers-and-how-to-stop-wifi-router-hacking
వైఫై హ్యాకింగ్
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 4:19 PM IST

How To Protect WiFi Router From Hackers : పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని మన వ్యక్తిగత డేటాను చోరీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మనం వాడుతున్న వైర్​లెస్​ వైఫైను కూడా హ్యాక్​ చేసి.. డేటా మొత్తాన్ని లాగేసి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరుణంలో సైబర్​ నేరగాళ్లు మన వైఫైను ఎలా హ్యక్ చేస్తారు? వైఫై హ్యాక్​ గురైతే మనకు ఎలాంటి సంకేతాలు అందుతాయి? వైఫై హ్యాక్​ గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వైఫైను ఎలా హ్యాక్​ చేస్తారు..
How Hackers Hack WiFi : మీ వైర్​లెస్​ వైఫైకు డిఫాల్ట్ పాస్​వర్డ్​ ఉన్నట్లయితే దాని ద్వారా వైఫైను సులువుగా హ్యాక్​ చేస్తారు హ్యాకర్లు. ఎందుకంటే డిపాల్ట్​ పాస్​వర్డ్​లపై వారికి ఒక అవగాహన ఉంటుంది. ఒకవేళ డిపాల్ట్​ పాస్​వర్డ్​ మార్చినా.. బ్రూట్ ఫోర్స్​ను వాడి మీ వైఫైను హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా చాలా యూజర్​నేమ్​, పాస్​వర్డ్​లు వాడి వైఫైను హ్యాక్​ చేస్తారు​. డొమైన్ నేమ్​ సిస్ట​మ్​ను వాడి సైతం వైఫైని హ్యాక్ చేస్తారు.

మీ వైఫై హ్యాక్​కు గురైందని తెలిసే 4 సంకేతాలు..

  1. మీకు తెలియని ఐపీ అడ్రస్​లు మీ రూటర్​కు కనెక్ట్​ అవుతాయి. ఇలాంటి సమయంలో మీరు వెంటనే అప్రమత్తం కావాలి.
  2. మీ బ్రౌజర్ మీరు సెర్చ్​ చేసింది కాకుండా వేరే ఫలితాలు ఇస్తుంది. ఆ సమయంలోనూ మీ వైఫై హ్యాక్​ గురైందని భావించాలి. ​
  3. మీ వైఫై పాస్​వర్డ్​ తప్పని చూపించినా, ఒకవేళ మారినా.. రూటర్​ హ్యాక్​​ గురైందని తెలుసుకోవాలి.
  4. ఉన్నట్టుండి ఇంటర్నెట్​ వేగం తగ్గితే మాత్రం అనుమానించాల్సిన విషయమే. ఇలాంటి సందర్భంలోనూ మీ వైఫై హ్యాక్​ గురైందని గ్రహించాలి.

How To Stop WiFi Router Hacking : వైఫై హ్యాకింగ్​ బారి నుంచి ఎలా తప్పించుకోవాలి?
తరచుగా వైఫై పాస్​వర్డ్​లు మార్చడం..
మీ రూటర్​ భద్రతంతా వైఫై పాస్​వర్డ్​ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచుగా మీ వైఫై పాస్​వర్డ్ మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను పెట్టుకోవాలి. దీంతో హ్యాకర్​కు మీ వైఫైను హ్యాక్​ చేయడం కష్టంగా మారుతుంది.

పబ్లిక్​ ప్లేస్​లో ఉన్నప్పుడు వీపీఎన్ వాడటం..
ఇప్పుడున్న కొత్త తరహా రూటర్లను మనతో పాటే తీసుకుపోవచ్చు. అయితే పబ్లిక్ ​ప్లేస్​లో వైఫై వాడుతున్నప్పుడు మాత్రం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్​ను (VPN) వాడాలి. వీపీఎన్​ మీ ఐపీ అడ్రెస్​​ కనబడకుండా చేస్తుంది.

వైఫై రిమోట్​ అడ్మినిస్ట్రేషన్​ డీయాక్టివేట్​ చేయడం..
కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూటర్​ ఎక్కడున్నా.. దాని నుంచి వైఫై కనెక్ట్​ చేసుకోవచ్చు. దీనికి దూరంతో సంబంధం లేదు. అందుకు ఈ రిమోట్ వైఫై అడ్మినిస్ట్రేషన్​ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని హ్యాకర్లు​ సులువుగా హ్యాక్​ చేసే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే తప్ప రిమోట్ వైఫై అడ్మినిస్ట్రేషన్​ను యాక్టీవేట్ చేయోద్దు. ​

వైఫైని వాడనప్పుడు రూటర్​ను టర్న్​ ఆఫ్ చేయడం..
మీరు వైఫై వాడుతున్న సమయంలోనే హాకర్లు దానిని హ్యాక్​ చేస్తారు. కాబట్టి వైఫైని వాడని సమయంలో దాన్ని ఆఫ్​ చేయడం మంచిది.

ఎన్​క్రిప్షన్​ మోడ్​ను యాక్టీవేట్​ చేసుకోవడం..
ఎన్​క్రిప్షన్​ మోడ్​ను యాక్టీవేట్​ చేసుకోవడం ద్వారా మీ వైఫై హ్యాక్​కు గురి కాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇప్పుడు తయారవుతున్న వైఫై రూటర్లలో వీపీఏ, వీపీఏ2 వంటి డిపాల్ట్​ ఫీచర్లు ఉన్నాయి. రూటర్​ సెట్టింగ్స్​లోకి ఎన్​క్రిప్షన్​ మోడ్​ను యాక్టీవేట్​ చేసుకోవడం ద్వారా వైఫై హ్యాకింగ్​ను అరికట్టవచ్చు.

Emergency Alert for Mobile Users: పెద్ద సౌండ్​తో ఫోన్​కు మెసేజ్.. ఉలిక్కిపడ్డ ప్రజలు.. రీజన్​ ఇదే..?

WhatsApp Pay India News : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​.. ఇకపై నేరుగా యాప్​​లోనే పేమెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.