How To Lock Apps On Android Phone : స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనెక్ట్ కావడానికి.. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి మనం ఫోన్లను వినియోగిస్తున్నాం. వ్యక్తిగత గోప్యత దృష్ట్యా మన ఫోన్‌ను ఎవరికీ ఇవ్వకూడదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతరులకు మన ఫోన్‌ను ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు మన డేటా, పర్సనల్ ఫొటోలు, చాట్స్ లాంటివి వాళ్లు చూస్తారనే భయం ఉంటుంది. ఇలాంటి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే.. మన ఫోన్ గ్యాలరీకి, యాప్స్‌కి లాక్ వేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్‌లకు లాక్ ఎలా వేయాలి?
- ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి AppLock అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.
- ఇది మన ఫోన్‌కు సంబంధించిన కొన్ని అనుమతులు అడుగుతుంది. అవన్నీ ఇవ్వండి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత "+" బటన్‌పై నొక్కండి. అక్కడ మీ ఫోన్లోని అప్లికేషన్ల జాబితా కనిపిస్తుంది.
- మీరు లాక్ వేయాలనుకున్న యాప్స్ అన్నింటిపై సెలక్ట్ చేయండి.
- ఇలా యాప్స్ అన్నీ ఎంచుకున్న తర్వాత మళ్లీ "+" బటన్‌ను నొక్కితే అవన్నీ లాక్ అయిపోతాయి. దీనితో ఇతరులు ఎవ్వరూ ఆ యాప్స్‌ను యాక్సెస్ చేయలేరు.
How to Lock Whatsapp Web on PC : మీ ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ చాట్స్ ఎవరూ చూడకూడదా?
డేటా భద్రం!
ఒకసారి యాప్స్‌కు లాక్ వేసిన తరువాత.. ఇతరులు ఎవ్వరూ వాటిని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే మీరు AppLock కి ఫింగర్‌ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. దీని కోసం యాప్‌లోని Settings విభాగానికి వెళ్లి, "Password Settings"పై నొక్కితే అక్కడ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్, కీస్, నంబర్స్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు.
App Lock ఉచితమేనా ?
ఈ యాప్ ఉచితంగానే వాడుకోవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే.. ఇది యాడ్ ఫ్రీ యాప్. అందువల్ల ఎలాంటి ప్రకటనలు రావు. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గూగుల్ ప్లేస్టోర్‌లో ఇలాంటి యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిలోంచి ఒక మంచి రిలయబుల్ యాప్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఫొటోలు, వీడియోలు ఎలా దాచాలి ?
చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ఫోటోలు, వీడియోలను హైడ్ చేసుకోవడానికి తగిన ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా.. మీ ఫోన్లలోని గ్యాలరీ సెట్టింగ్స్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు Samsung వినియోగదారులు.. తమ గ్యాలరీ యాప్‌లో ఫోటోలు లేదా వీడియోలను ఎంచుకున్న తర్వాత సెట్టింగ్స్ మెనూలో "మూవ్ టు సెక్యూర్ ఫోల్డర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అవి అందులోకి వెళ్లిపోతాయి. ఇలాంటి సౌకర్యం లేని వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి ఏదైనా మంచి థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
వాట్సాప్ చాట్లను హైడ్ చేయడం ఎలా?
Whatsapp Chat Hiding : వాట్సాప్లో ఫింగర్‌ప్రింట్ లాక్ ఉంటుంది. దీనిని ఉపయోగించి మనం కోరుకున్న చాట్‌ను ఇతరులు ఎవరూ చూడకుండా దాచవచ్చు. అది ఎలా అంటే.. ముందుగా మీరు కోరుకున్న చాట్‌ని లాంగ్‌ప్రెస్ చేస్తే పైన బాణం గుర్తు కలిగిన ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే సంబంధిత చాట్ ఆర్కైవ్‌లోకి వెళుతుంది. దీంతో పాటు ఒక్కో చాట్‌కు లాక్ వేసుకునే సౌకర్యం కూడా వాట్సాప్లో ఉంది. దీనికోసం ముందుగా వాట్సాప్ Settings ఓపెన్ చేసి Privacy ఆప్షన్ని ఎంచుకుని కిందకి బ్రౌజ్ చేస్తే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
WhatsApp Secret Code Feature : వాట్సాప్ సీక్రెట్ కోడ్‌తో.. మీ ఛాట్స్ మరింత భద్రం!