ETV Bharat / science-and-technology

ఫోన్​లో యాప్​లు సీక్రెట్​గా ఉంచాలా? ఆండ్రాయిడ్​లో ఇలా చేస్తే సరి! - ఫోన్​లోని యాప్​లను దాచడం ఎలా

ఫోన్​లోని యాప్​లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఫీచర్​ మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని సాయంతో యాప్‌లను డిలీట్‌ చేయకుండానే ఇతరుల కంటపడకుండా చూసుకోవచ్చు. అదే ఎలాగో చూసేద్దామా!

how to hide apps in mobile
ఫోన్​లో యాప్​లను దాచిపెట్టడం ఎలా
author img

By

Published : Dec 3, 2022, 10:49 AM IST

ఫోన్‌లో ఎన్నెన్నో యాప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవైతే, మరికొన్ని వృత్తిపరమైన యాప్‌లు. లాక్‌స్క్రీన్‌ ఉండటం వల్ల వీటిని ఇతరులు చూడటానికి వీలుండదు. కానీ కొన్నిసార్లు ఫోన్‌ను అన్‌లాక్‌ చేయకుండా మరచిపోతుంటాం. అప్పుడు వేరేవాళ్లు యాప్‌లను వాడుకోవచ్చు. వాటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్‌ కావొచ్చు.

మనం ఆయా యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేసినా వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో యాప్‌లను హైడ్‌ చేసే ఫీచర్‌ బాగా ఉపయోగ పడుతుంది. దీని సాయంతో యాప్‌లను డిలీట్‌ చేయ కుండానే ఇతరుల కంట పడకుండా చూసుకోవచ్చు. అయితే ఇందుకోసం పాస్‌కోడ్‌ అవసరం. దీన్ని ఎంటర్‌ చేస్తేనే యాప్స్‌ను తిరిగి చూసుకోవటానికి వీలుంటుంది.

ఎనేబుల్‌ ఇలా..

  • ముందుగా ఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి.
  • కిందికి స్క్రోల్‌ చేసి, ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి.
  • ప్రైవసీ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • ప్రైవసీ ప్రొటెక్షన్‌ ట్యాబ్‌లో హైడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • ప్రైవసీ పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.
  • హైడ్‌ చేయాలనుకుంటున్న యాప్స్‌ను ఎంచుకోవాలి.
  • యాప్స్‌ను హైడ్‌ చేయటానికి పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేయటం తప్పనిసరి.
  • ఈ పద్ధతిలో రహస్య యాప్‌లు ఇతరులకు కనిపించకుండా దాచుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.