ETV Bharat / science-and-technology

గూగుల్​ సెర్చ్​లో ఫలితం కచ్చితంగా రావాలంటే? - google search engine

గూగుల్ సెర్చ్​ ఎలా చేస్తున్నారు? తెలిసిన ఏవో కొన్ని కీవర్డ్స్​తో సెర్చ్​ చేసి, రిజల్ట్స్​ పేజీలో (better google search techniques) వచ్చిన చాలా వెబ్​సైట్లలో మీకు ఏది కావాలో వెతుక్కుంటున్నారా?. అలా కాకుండా నేరుగా మీకు కావాల్సిన వెబ్​పేజీ గూగుల్​ రిజల్ట్స్ లో వచ్చేలా కొన్ని సెర్చింగ్ టిప్స్ తెలుసుకుందాం..

google search results page
గూగుల్ సెర్చ్​లో మెలకువలు
author img

By

Published : Oct 6, 2021, 4:38 PM IST

ఏ విషయం తెలుసుకోవాలన్నా ప్రస్తుతం గూగుల్​ను ఆశ్రయిస్తాం కదా!. కీవర్డ్​తో గూగుల్​ సెర్చ్ (better google search techniques)​ చేసినప్పుడు రిజల్ట్స్​లో (google search results) చాలా సైట్లు వస్తాయి. అందులో సెర్చ్​ ఇంజిన్ ఆప్టిమైజేషన్​లో (google search engine) టాప్​లో ఉన్న సైట్లతో పాటు అడ్వర్టైజ్​మెంట్స్​, రికమెండెడ్ రిజల్ట్స్​ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన సమాచారం ఉన్న వెబ్​సైట్​ నేరుగా రాకపోవచ్చు. ఏదో కొన్ని కీవర్డ్స్​తో సెర్చ్​ చేసి మంచి రిజల్ట్స్​ను ఆశించలేం. అందుకు కొన్ని టిప్స్​ పాటించాలి. అవీ..

స్పెసిఫిక్ సెర్చ్​..

  • సెర్చ్​ చేసే కీవర్డ్​ను కొటేషన్ మార్క్​(")లో ఉంచితే కావల్సిన రిజల్ట్స్ పేజీలు (google search results maker) వెంటనే వస్తాయి. ఆ కీవర్డ్స్​తో ఉన్న అనవసరమైన వెబ్​సైట్​లను ఈ కొటేషన్ మార్క్ తగ్గిస్తుంది.
  • సాధారణంగా ఎక్కువ సెర్చ్​లు ఉన్న వెబ్​పేజీలే ముందు వస్తాయి. మన కీవర్డ్స్​లో ఏదైనా ఒక పదానికి ఎక్కువ సెర్చ్​లు ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్స్​ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ పదానికి సెర్చ్​లో మినహాయింపునివ్వవచ్చు. ఆ పదం ముందు మైనస్​ ("-") గుర్తును వాడినట్లయితే ఆ సింగిల్​ వర్డ్స్​కు (better google search techniques) మ్యాచ్​ అయ్యే సైట్లను రిజల్ట్స్​లో రాకుండా చేస్తుంది. కీవర్డ్స్​లో ఏయే పదాలకు రిజల్ట్స్ రావాలనుకుంటామో ఆ పదాల ముందు ("+") సింబల్​ను యాడ్ చేయాలి. ఏదేమైనా మరిన్ని కీవర్డ్స్​ను వాడినట్లయితేనే మంచి రిజల్ట్స్​ను ఆశించగలం.

వ్యక్తిగత సైట్​లు..

  • ఏదైనా ప్రత్యేకమైన సైట్​ మాత్రమే కావాలనుకున్నప్పుడు "site:Url+keywords"ఫార్మాట్​లో సెర్చ్​(google search box) చేయాలి. అలా చేస్తే.. ఆ డొమైన్​తో ఉన్న వెబ్​సైట్​లను (google search results page) మాత్రమే గూగుల్ మనముందు ఉంచుతుంది.
  • మీకు వికీపీడియా సైట్​ కావాలనుకుంటే "site:wikipedia.org"ఈ ఫార్మాట్​లో సెర్చ్​ చేస్తే కేవలం వికీపీడియాకు చెందిన వెబ్​సైట్​లు మాత్రమే రిజల్ట్స్ పేజీలో వస్తాయి.

అడ్వాన్స్​ సెర్చ్ టూల్స్​..

  • గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​ పేజీలోని కుడిభాగంలో చిన్న కాగ్​ ఐకాన్​ ఉంటుంది. దాన్ని క్లిక్​ చేస్తే అడ్వాన్స్​ సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. దానిని ఎంచుకున్నట్లయితే.. మీ కీవర్డ్స్​కు సంబంధించిన లోతైన సమాచారం అందుబాటులోకి తెస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్​.
  • అడ్వాన్స్ సెర్చ్​తో కూడా ("-") సింబల్​ను ఉపయోగించి సెర్చ్​లో కొన్ని వర్డ్స్​కు మినహాయింపునివ్వవచ్చు. ("+")తో కొన్ని పదాలను కలపవచ్చు. అలాగే.. సెర్చ్​లో కొన్ని భాషలను మాత్రమే కలపవచ్చు, తీసివేయవచ్చు.
  • ఇటీవలే అప్​డేట్​ చేసిన వెబ్​పేజీలను అడ్వాన్స్ సెర్చ్​ ఉపయోగించి సెర్చ్​ చేయవచ్చు.

మరిన్ని సెర్చ్​ ట్రిక్స్​..

  • ఏదైనా వెబ్​సైట్​ను వెతకడానికి మనకు తెలిసిన ఒక్కొక్క కీవర్డ్​తో సెర్చ్​ చేస్తే చాలా సమయం తీసుకుంటుంది. అలా కాకుండా అన్ని కీవర్డ్స్​ను ఒకేసారి టైప్​ చేసి సెర్చ్​ చేయాలంటే ఒక్కొక్క కీవర్డ్​కు మధ్య "OR"ను ఉంచి సెర్చ్ చేయవచ్చు. ఆ కీవర్డ్స్​లో ఏ ఒక్క కీవర్డ్​కు మ్యాచ్​ అయినా.. మీకు కావల్సిన వెబ్​పేజీ రిజల్ట్స్​లో వస్తుంది.
  • అనవసర వెబ్​సైట్​లు రాకుండా ఉండటానికి మనకు కావల్సిన సమాచారానికి సంబంధించిన డేటా తేదీలు కీవర్డ్​లో ఉన్నట్లయితే మరింత నిర్ధిష్టమైన వెబ్​పేజీలు అందుబాటులోకి వస్తాయి.
  • సామాజిక మాధ్యమాల్లో హ్యాష్​ ట్యాగ్​లను చూడాలంటే "#" సింబల్​తో సెర్చ్​ చేయవచ్చు.
  • ఏదైనా ధర కనుగొనాలంటే "$"సింబల్​తో సెర్చ్​ చేయవచ్చు.
  • మీకు కావాల్సిన సమాచారానికి సంబంధించిన కీవర్డ్స్​ చివర "Related"అనే పదాన్ని ఉంచి సెర్చ్​ చేసినట్లయితే ఇతర సమాచారం కూడా రిజల్ట్స్ పేజీలో వస్తుంది.

ఇదీ చదవండి:సెర్చ్ ఇంజిన్లందు గూగుల్​ వేరయా! కానీ ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.