How To Get Alerts When Your Personal Info Shows Up In Google : టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత వ్యక్తిగత ప్రైవసీ అనేది పూర్తిగా ఎండమావిలా మారిపోయింది. మనం ఎన్ని ప్రైవసీ సెట్టింగులు చేసుకున్నా.. మన వ్యక్తిగత సమాచారం అన్లైన్లో ప్రత్యక్షమవుతోంది. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే.. గూగుల్ ఓ సరికొత్త 'గూగుల్ సెర్చ్ ఫీచర్'ను అందుబాటులోకి తెచ్చింది.
డిజిటల్ లైఫ్ సేఫ్టీ!
గూగుల్ ఈ ఆగస్టు నెలలో 'Results About You' అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీ ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. అది ఎలా అంటే.. ఒక వేళ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మీ వ్యక్తిగత వివరాలు కనిపిస్తే.. వెంటనే మీకు గూగుల్ అలర్ట్ పంపిస్తుంది. అంతేకాదు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తొలగించడానికి కూడా వీలు కల్పిస్తుంది.
గూగుల్ అలర్ట్స్‌ను టర్న్ ఆన్ చేసుకోండిలా?
How To Turn On Results About You In Google Search :
- ముందుగా మీరు https://myactivity.google.com/results-about-you వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- మీ గూగుల్ అకౌంట్ (జీ-మెయిల్)తో లాగిన్ అవ్వాలి.
- Get Started ట్యాబ్‌పై క్లిక్ చేసి.. స్క్రీన్‌పై కనిపించే prompts ఫాలో అవ్వాలి.
- గూగుల్ మీరు ఫ్లాగ్ చేయాలని అనుకుంటున్న సమాచారాన్ని జోడించమని అడుగుతుంది. కనుక మీరు వివిధ పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్‌ను జోడించవచ్చు.
- వెంటనే మీకు Confirm చేయమని ఒక సూచన కనిపిస్తుంది. మీరు అన్ని విషయాలు సరిచూసుకొని.. దానిని కన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది.
- మీరు కోరుకున్న సమాచారం కనుక గూగుల్‌లో కనిపిస్తే.. వెంటనే మీకు ఈ-మెయిల్ ద్వారా లేదా పుష్ నోటిఫికేషన్ ద్వారా సమాచారం అందిస్తుంది.
- వాస్తవానికి మీరు ఈ అలర్ట్‌ను ఎనేబుల్ చేసుకున్న వెంటనే, గూగుల్.. సెర్చ్ రిజల్ట్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది. ఒక వేళ మీ వ్యక్తిగత వివరాలు అందులో ఉంటే.. వెంటనే మిమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా లేదా పుష్ నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది. అయితే మొదటి సారి స్కాన్ చేసేటప్పుడు.. కాస్త సమయం పడుతుంది. కనుక కాస్త ఓపిక పట్టాల్సిందే.
- ఒక వేళ మీరు మరేదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా ఉన్న సమాచారాన్నే మార్చాలన్నా కూడా.. మరలా https://myactivity.google.com/results-about-you వెబ్సైట్లోనే మార్చుకోవచ్చు.
గూగుల్ సెర్చ్ నుంచి మన వ్యక్తిగత వివరాలను తొలగించడం ఎలా?
How To Remove Personal Contact Info In Google Search Results : గూగుల్‌లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడానికి 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1వ పద్ధతి :
- ముందుగా మీరు https://myactivity.google.com/results-about-you వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- Results to reviewని సెలెక్ట్ చేసుకోవాలి.
- వెంటనే మీ వక్తిగత వివరాల జాబితా కనిపిస్తుంది.
- మీరు ఏయే వివరాలను తొలగించాలని అనుకుంటున్నారో.. వాటన్నింటినీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
- మీరు ఈ విధంగా రిక్వెస్ట్ చేసిన వెంటనే.. గూగుల్ వాటిని సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించకుండా చేస్తుంది. ఫలితంగా ఇతరులు ఎవ్వరూ మీ వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో చూడలేరు.
- ఒకవేళ మీరు.. రిమూవ్ చేసిన సమాచారాన్ని తిరిగి అన్లైన్లో కనిపించేలా చేయాలని అనుకుంటే.. వెంటనే దానిని Undo చేసుకోవచ్చు కూడా.
2వ పద్ధతి : గూగుల్ హెల్ప్ సెంటర్ ద్వారా కూడా మీ వ్యక్తిగత వివరాలను.. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి తొలగించవచ్చు. అది ఎలాగంటే..
- ముందుగా మీరు https://support.google.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- personal content removal form లింక్‌ను ఓపెన్ చేయాలి.
- మీరు ఏ సమాచారాన్ని తొలగించాలని అనుకుంటున్నారో.. ఆ వివరాలను నమోదు చేయాలి.
- గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తున్న మీ సమాచారాన్ని సంబంధించిన స్క్రీన్ షాట్స్, URLs, గూగుల్ పేజ్‌లు, స్పెసిఫిక్ సెర్చ్ టెర్మ్లను కూడా అప్లోడ్ చేయవచ్చు.
- ఈ విధంగా అన్ని వివరాలు నమోదు చేసి, అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
- గూగుల్ అన్నింటినీ స్కాన్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారం.. సెర్చ్ రిజల్ట్స్‌లో కనపించకుండా చేస్తుంది.
- మీరు మరింత సమాచారం కావాలనుకుంటే.. https://safety.google/privacy/privacy-controls/ వెబ్సైట్లో చూడండి. పూర్తి వివరాలు మీకు లభిస్తాయి.
నోట్ : గూగుల్.. తన సెర్చ్ రిజల్ట్స్‌లోని మీ వ్యక్తిగత వివరాలను మాత్రమే తొలగించగలదు. అంతేకానీ నాన్-గూగుల్ సైట్లలోని సమాచారాన్ని రిమూవ్ చేయలేదనే విషయాన్ని మీరు గుర్తించుకోవలి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన గూగుల్ ఫీచర్‌ను సరిగ్గా ఉపయోగించుకుని, ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకుంటే.. కచ్చితంగా మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌పై మరింత నియంత్రణను ఏర్పరుచుకోవచ్చు.
Flipkart Offers on IPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4,849కే ఐఫోన్ 12.. సూపర్ లూట్ డీల్ గురు!