ETV Bharat / science-and-technology

How To Check My Device Is Hacked Or Not : మీ ఫోన్​ హ్యాక్​​ అయ్యిందని అనుమానంగా ఉందా?.. ఒక్క నిమిషంలో కనిపెట్టేయండి! - how to sign out of google account remotely

How To Check My Device Is Hacked Or Not : మీ ఫోన్​ను ఎవరైనా హ్యాక్​​ చేశారని అనుమానంగా ఉందా? మరేం ఫర్వాలేదు.. ఓ సింపుల్​ టెక్నిక్​తో మన అకౌంట్​ను ఎవరు యాక్సెస్​ చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. అది కూడా కేవలం 60 సెకన్లలోనే. మరి అదెలాగో ఇప్పుడు చూద్దామా?

How To Check My Device Is Hacked Or Not
How To Identify My Phone Is Hacked In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 3:49 PM IST

How To Check My Device Is Hacked Or Not : మీ మొబైల్​, ల్యాప్​టాప్​, పీసీ లేదా ఇతర గ్యాడ్జెట్స్​​ను ఎవరైనా హ్యాక్​ గానీ, యాక్సెస్ గానీ​ చేశారని అనుమానంగా ఉందా? అలా జరిగిందో లేదో ఎలా తెలుస్తుందని ఆలోచిస్తున్నారా? మరేం ఫర్వాలేదు.. కొన్ని సింపుల్​ ట్రిక్స్​తో మీ ప్రమేయం లేకుండా బయటి వ్యక్తులు ఎవరైనా సరే మీ అకౌంట్​ను యాక్సెస్​ చేస్తున్నారా? లేదా? అని సులువుగా తెలుసుకోవచ్చు. అది కూడా కేవలం 1 నిమిషంలోనే.

ఒక్క నిమిషంలోనే కనిపెట్టవచ్చు!
Google Security Check : కేవలం 60 సెకన్ల సేఫ్టీ చెక్​తో మీ డివైజ్​ను వేరెవరైనా యాక్సెస్​ చేశారా? లేదా? అని తెలుకోగలుగుతారు. దీని వల్ల మీ గూగుల్ అకౌంట్ సురక్షితంగా ఉందో లేదో కూడా తెలుసుకుంటారు. ( Google Security Check Activity ).

  • ముందుగా మీ గూగుల్​ అకౌంట్​తో డివైజ్​లో లాగిన్​ అవ్వండి.
  • తర్వాత google.com/devices లోకి వెళ్లిండి. ఒక వేళ మీరు అప్పటికే లాగ్​అవుట్​ అయితే మళ్లీ సైన్ ఇన్​ చేయండి.
  • ఇక్కడ మీరు గత 28 రోజుల్లో మీ అకౌంట్​ ఉపయోగించి లాగిన్ అయిన.. పలు డివైజ్​ల లిస్ట్​ను చూస్తారు. ఇందులో పీసీలు, స్మార్ట్​ఫోన్​లు, ట్యాబ్లెట్స్​ సహా ఇతర డివైజ్​ల జాబితా ఉంటుంది.
  • అలా కనిపించిన లిస్ట్​లోని ఏదైనా ఒక డివైజ్​పై క్లిక్​ చేయండి. అప్పుడు మీకు మీ అకౌంట్​ నుంచి మీకు తెలియకుండా ఇతరులు ఏం బ్రౌజ్​ చేశారనేది తెలిసిపోతుంది. అలా మీ ఖాతాకు లింక్​ ఉన్న ప్రతి డివైజ్​ను చెక్ చేసుకోవచ్చు.

సైన్ అవుట్​ చేయండి!
How To Sign Out Google Account Remotely : మీ గూగుల్ డివైజ్​ లిస్ట్​లో.. ఒకేరకమైన డివైజ్​ను చాలాసార్లు ఉపయోగించినట్లు కనిపించినా.. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లాగిన్​ అయ్యే ప్రతిసారి అది రికార్డ్​ అవుతుంది. ఈ సమయంలో మీరు చాలా కాలంగా వాడని పలు డివైజ్​లను అంటే పాత ఫోన్​లు లేదా పీసీల వివరాలను కూడా మీరు చూడవచ్చు. మీరు వాటిని ఉపయోగించకపోతే.. వెంటనే వాటి నుంచి లాగ్ అవుట్​ అయిపోవడం మంచిది. ఇందు కోసం మీరు..

  • ఏ డివైజ్​ను తొలగించాలనుకుంటున్నారో.. ఆ డివైజ్​పై క్లిక్​ చేసి సైన్ అవుట్​ చేయండి. దీనితో ఇక నుంచి సదరు డివైజ్​లో మీ గూగుల్​ అకౌంట్​ను మరెవరూ యాక్సెస్​ చేయడానికి వీలుపడదు.
  • మీరు ఒక్కోసారి మీ స్నేహితులకు చెందిన ట్యాబ్లెట్​ లేదా ఆఫీస్​ కంప్యూటర్​లను వాడి ఉంటారు. అప్పుడు మీరు మీ అకౌంట్​తో లాగిన్​ అవుతారు. అలాంటి సందర్భాల్లో కూడా వాటి నుంచి పూర్తిగా లాగ్​అవుట్​ అయ్యేలా చూసుకోండి. దీనితో మీ ఖాతాను ఇతరులు యాక్సెస్​ చేయలేరు.

గుర్తు తెలియని కంప్యూటర్​, ఫోన్​, ట్యాబ్లెట్​లో లాగిన్​ అయినట్లు కనిపిస్తే ఏం చేయాలి?
How To Check My Phone Is Hacked Or Not : మీ గూగుల్ అకౌంట్​తో లాగిన్​ అయిన డివైజ్​ లిస్ట్​లో.. అసలు మీకు తెలియని డివైజ్​లు కూడా ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు కూడా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వెకేషన్​ కోసం దూరప్రదేశాలకు వెళ్లనప్పుడు మీరు ఇతరుల డివైజ్​లను వినియోగించే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు VPN ద్వారా మీరు లాగిన్​ అయ్యుండవచ్చు. అటువంటి పరికరాలు మన ఖాతాకు లింక్​ అయిపోతాయి. ఇలాంటి వాటి నుంచి సింపుల్​గా లాగ్​అవుట్​ కావచ్చు. దీని కోసం మీరు తొలగించాలనుకుంటున్న డివైజ్​పై ట్యాప్​ చేసి సైన్​ అవుట్​ చేసేయండి.

ఆ డివైజ్​లను లాగ్​అవుట్​ చేయండి!
ఒకవేళ మీకు గుర్తులేకపోయినా లేదా సదరు డివైజ్​ నుంచి మీరు మీ ఖాతాను యాక్సెస్​ చేయలేదని మీకు కచ్చితంగా తెలిసినా.. వెంటనే సదరు డివైజ్​ నుంచి లాగ్​అవుట్ కావాలి. ఇందుకోసం Don't recognize something? or Sign out ఆప్షన్​ను ఎంచుకోండి. దీనితో​ ఆటోమెటిక్​గా సదరు గ్యాడ్జెట్​ నుంచి మీరు సైన్​ అవుట్​ అయిపోతారు.

మీ ఖాతాను మీరే రక్షించుకోండి!
Google Memory Lane : ఇలా మీ ఖాతాను ఎవరైనా హ్యాక్​ చేసినా.. చేయకపోయినా తరచుగా మీ గూగుల్​ అకౌంట్​ పాస్​వర్డ్​ను మారుస్తుండటం ఉత్తమం. లేదా ఇతరులెవరూ క్రాక్​ చేయలేని విధంగా స్ట్రాంగ్​ పాస్​వర్డ్​ను క్రియేట్​ చేసుకోవాలి. చివరగా ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్​, ఐఫోన్​లలో అందుబాటులో ఉన్న మరో ఫీచర్​ Google's Timeline (timeline.google.com). దీని సాయంతో కూడా మన డివైజ్​ హ్యాక్​ అయిందా లేదా అని పసిగట్టవచ్చు. ఇది మీరు ప్రయాణించిన మొత్తం హిస్టరీని ట్రాక్​ చేస్తుంది. ( How To Check If My Pc Is Hacked ). దీని ద్వారా మీరు ఎప్పుడూ వెళ్లని, ప్రదేశాల్లో మనం ఉన్నట్లు కనిపిస్తే, మరెవరో మన గూగుల్ అకౌంట్​ను వాడుతున్నట్లు గమనించాలి. వెంటనే సదరు డివైజ్​ నుంచి లాగ్​అవుట్​ కావాలి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.