Fake ID Sim Card: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మానవుడు సాధారణ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు వచ్చాడు. ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి.. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లోనే రెండు సిమ్‌లను ఉపయోగించడం మొదలు పెట్టాడు. అదేమిటంటే పర్సనల్ ఒకటి.. ఆఫిషియల్ మరొకటి అని అంటున్నాడు. ఇలా రెండు సిమ్‌కార్డ్‌లు ఉండడం చాలా స్మార్ట్ఫోన్లలో సహజమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు సిమ్ తీసుకోవాలి అంటే.. ప్రస్తుతం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. గతంలో అయితే ఈ సౌకర్యం ఉండేది కాదు. కేవలం ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోయేది. దీంతో మీ ప్రమేయం లేకుండానే జీరాక్స్‌తో సిమ్ కార్డు తీసుకునే ఆవకాశం ఉండేది. ఇలా మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ వెబ్ సైట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది.
ఈ పోర్టల్ ద్వారా సదరు వ్యక్తి తన ఆధార్ కార్డుపై ఎన్ని మొబైల్ నంబర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయో.. తెలుసుకోవడమే గాక వినియోగంలో లేని వాటిని కూడా గుర్తించవచ్చు. వాటిని గాని ఆ వ్యక్తి ఉపయోగించకపోతే వెంటనే వాటిని టెలి కమ్యూనికేషన్ విభాగానికి రిపోర్ట్ చేసే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా రిపోర్ట్ చేసిన ఫిర్యాదును టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం ఆదేశాల ప్రకారం ఓ వ్యక్తి ఆధార్ కార్డ్ పైన గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులు తీసుకోవడానికి వీలుంటుంది.
How To Find Fake Sim Cards:
మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ (https://tafcop.dgtelecom.gov.in/) ను ఓపెన్ చేయాలి. అందులో మీకు కింద ఇచ్చిన విధంగా కనిపిస్తుంది.
- ఎంటర్ మొబైల్ నంబర్ అనే దానిపై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. తరువాత అక్కడ ఉన్న రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
- వచ్చిన ఓటీపీని దానిలో ఎంటర్ చేయాలి.
- ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు సైట్ లోకి లాగ్ ఇన్ అవుతారు. తరువాత మీ ఆధార్ కార్డ్‌పై లింక్ అయ్యి ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో సైట్లో చూపిస్తుంది.
- దానికి కింద పేర్కొన్న విధంగా మీరు తెలియకుండా ఉపయోగించే మొబైల్ నెంబర్ పక్కన ఉన్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి దిస్ ఈజ్ నాట్ మై నంబర్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఎంచుకున్న మొబైల్ నంబర్‌ను రిపోర్ట్ చేస్తే.. మీ దరఖాస్తును పరిశీలించి టెలికమ్యునికేషన్ విభాగం నిర్ణయం తీసుకుంటుంది.
ఇవీ చూడండి:
shortage of silicon wafers: సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా చిప్ తయారీకి ఆటంకాలు