ETV Bharat / technology

స్మార్ట్​ అవుట్​ఫిట్​తో సరికొత్త ​మొబైల్- పాడైతే ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు! - HMD FUSION SMARTPHONE

ఇండియన్ మార్కెట్లోకి 'HMD ఫ్యూజన్' ఫోన్- దీని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కైపోతారంతే..!

HMD Fusion Smartphone Launched
HMD Fusion Smartphone Launched (HMD Global)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 26, 2024, 4:46 PM IST

Updated : Nov 26, 2024, 4:56 PM IST

HMD Fusion Smartphone Launched: HMD గ్లోబల్ కంపెనీ తన 'ఫ్యూజన్‌' స్మార్ట్​ఫోన్​ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​లో అత్యంత ప్రత్యేకత ఏంటంటే దాని స్మార్ట్​ ఔట్​ఫిట్. ఈ డిటాచబుల్ యాక్సెసరీస్ ఫోన్​ లుక్​ను మార్చడం మాత్రమే కాకుండా పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాక దీని కెమెరా అద్భుతమైన విజువల్స్‌ను ఇస్తుంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

స్పెసిఫికేషన్స్: ఈ కొత్త HMD ఫ్యూజన్ మొబైల్ స్నాప్​డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్​తో వస్తుంది. ఇందులో 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజీ సదుపాయం ఉంటుంది. దీనితో సీమ్​లెస్ మల్టీటాస్కింగ్​తో పాటు వినియోగదారులు మంచి పనితీరును పొందొచ్చు. అంతేకాక ఈ స్మార్ట్​ఫోన్ వర్చువల్ మెమరీ ఎక్స్​టెన్షన్​కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది దాని సామర్థ్యాలను మరింత పెంచుతుంది.

కెమెరా సెటప్: ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్​ 108MP డ్యూయల్ మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వీటితో పాటు ఇది నైట్ మోడ్ 3.0, ఫ్లాష్ షాట్ 2.0, జెస్టర్-బేస్డ్ సెల్ఫీ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని ఇస్తుంది.

  • డిస్​ప్లే: 6.56-అంగుళాల HD+
  • రిఫ్రెష్ రేట్‌: 90Hz
  • బ్యాటరీ: 5000mAh
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్‌

డ్యూరబిలిటీ అండ్ స్టెబిలిటీ: ఈ మొబైల్ డ్యూరబిలిటీ అండ్ స్టెబిలిటీ గురించి రెండు ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీకి చెందిన Gen2 రిపేరబిలిటీ డిజైన్ డిస్​ప్లే​, బ్యాటరీ లేదా ఛార్జింగ్ పోర్ట్ వంటి భాగాలను సులభంగా రీప్లేస్ చేసే విధంగా రూపొందించారు. దీని భాగాలను కేవలం స్క్రూడ్రైవర్​తోనే రీప్లేస్ చేయొచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14తో నడుస్తుంది. ఇది మెరుగైన యూజర్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది. HMD ఫ్యూజన్.. డిజిటల్ టర్బైన్, ఆప్టాయిడ్‌తో కూడా ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇది దాని గేమింగ్ సామర్థ్యాలను మరింత పెంచుతుంది.

ధర: కంపెనీ ఈ మొబైల్​ను ప్రారంభ ఆఫర్ కింద రూ. 15,999 ధరకే అందిస్తుంది. కానీ తర్వాత దీని ధర రూ. 17,999కి చేరుకుంటుంది. పొటెన్షియల్ కస్టమర్లు ఈ ఫోన్‌తో పాటు మూడు స్మార్ట్ అవుట్‌ఫిట్‌లను కూడా పొందుతారు. ఇందులో క్యాజువల్, ఫ్లాషీ అండ్ గేమింగ్ ఆప్షన్స్​ ఉన్నాయి. సాధారణంగా వీటి ధర రూ. 5,999. అయితే వీటి కోసం ఎలాంటి అదనపు ఖర్చు చెల్లించకుండానే ఈ మొబైల్​తో పాటు పొందొచ్చు.

సేల్స్ ఎప్పటి నుంచి?: ఈ స్మార్ట్​ఫోన్ సేల్స్ నవంబర్ 29 మధ్యాహ్నం 12:01 గంటల నుంచి ప్రారంభమవుతాయి. దీన్ని అమెజాన్, HMD గ్లోబల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.

గూగుల్ క్యాలెండర్​లో కొత్త ఫీచర్- ఇకపై టాస్క్ మేనేజ్​మెంట్ మరింత ఈజీ..!

యాపిల్ యూజర్లకు అలర్ట్- వెంటనే ఆ పని చేయకుంటే మీ సొమ్ము గోవిందా..!

Last Updated : Nov 26, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.