IRCTC Wonders of Wayanad Tour: కేరళ.. పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రెస్. అందుకే చాలా మంది కేరళ విజిట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్లో.. మంచుతో కప్పబడిన పచ్చని కొండలు, పారే జలపాతాలను సందర్శించాలని ఆరాటపడుతుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకో అవకాశం ఇస్తోంది.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC). వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేసేందుకు ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్సీటీసీ "వండర్స్ ఆఫ్ వయనాడ్(Wonders Of Wayanad)" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్ సాగుతుంది. వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ప్రతి మంగళవారం ఈ ప్రయాణం ఉంటుంది.
- మొదటి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ - మంగుళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం 12789) బయలుదేరుతుంది. ఆ రోజు మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 06.17 నిమిషాలకు కన్నూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అనంతరం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. అక్కడి నుంచి వయనాడ్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను విజట్ చేయవచ్చు. ఆ రాత్రి కాల్పెట్టలో హోటల్లో చెకిన్ అయ్యి బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కుర్వాదీప్లోని పలు ప్రాంతాలను విజిట్ చేస్తారు. తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రికీ కాల్పెట్టలోనే బస చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును విజిట్ చేస్తారు. ఆ రోజు రాత్రి కాల్పెట్టలోనే బస చేయాలి.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడ్కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వ్స్టేషన్లో డ్రాప్ చేస్తారు. ఆ రాత్రి 11.35కి మంగుళూరు సెంట్రల్ - కాచిగూడ(ట్రైన్ నెం 12790) ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ పూర్తవుతుంది.
ధర వివరాలు చూస్తే:
- కంఫర్ట్(3AC): సింగిల్ షేరింగ్ రూ.36,590, డబుల్ షేరింగ్ రూ.20,700, ట్రిపుల్ షేరింగ్ రూ.16,280గా ఉన్నాయి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.10,510, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,060గా నిర్ణయించారు.
- స్టాండర్డ్(Non AC SL): సింగిల్ షేరింగ్ రూ.33,790, ట్విన్ షేరింగ్ రూ.17,900, ట్రిపుల్ షేరింగ్ రూ.13,490గా నిర్ణయంచారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.7,720, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,260గా నిర్ణయించారు.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు(కంఫర్ట్ అండ్ స్టాండర్డ్)
- లోకల్ ప్లేస్‌లు చూడటానికి ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం
- హోటల్లో స్టేతో పాటు 3 బ్రేక్‌ఫాస్ట్‌లు
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 3, 10, 17వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఒకే ట్రిప్‌లో అజంతా, ఎల్లోరా, మినీ తాజ్‌మహల్ - IRCTC సూపర్ ప్యాకేజీ!
'అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు - ఇటు బీచ్‌లో సరదాలు' - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ!
IRCTC సూపర్ ప్యాకేజీ - బ్యాంకాక్‌లో ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!