Youtube Data Usage : దాదాపుగా అందరి ఫోన్లో ప్రస్తుతం అన్లిమిటెడ్ ప్లాన్ ఉంటుంది. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు 1 జీబీని రెండు, మూడు రోజులు వాడే మనం.. నేడు ఒక్కరోజుకి కూడా 1 జీబీ డేటా సరిపోవడం లేదు. సోషల్ మీడియా యాప్స్ తర్వాత మనం ఎక్కువగా వాడేది యూట్యూబ్. మరి ఆ యూట్యూబ్ ఎంత డేటాను వినియోగిస్తుంది. ఆ వినియోగాన్ని ఎలా కొలవాలి అనే అంశాలతో పాటు దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై ఉన్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే పెద్దగా ఏం అనిపించదు. కానీ సొంత డేటా వాడితే మాత్రం సరిపోదు. ఈ సమయంలో ఇంటర్నెట్ నుంచి పెద్ద మొత్తంలో సమాచారం మన ఫోన్‌కి చేరుతుంది. ఇది ప్రతి సెకన్‌కు మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ వీడియో స్ట్రీమింగ్ అయినా అదే స్థాయిలో డేటా ఉపయోగించుకుంటుంది.
యూట్యూబ్ ఎంత డేటా ఉపయోగించుకుంటుంది ?
Youtube Data Usage Per Hour : యూట్యూబ్ డేటా వినియోగం అనేది మీరు చూసే వీడియో క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ వీడియో అయినా.. 144p నుంచి 2160p (4K) వరకు ఉంటుంది. ఇందులోని బిట్రేట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. ఉదాహరణకు 480p (స్టాండర్డ్ క్వాలిటీ)కి యూట్యూబ్ బిట్రేట్ 2,000Kbps ఉంటుంది. ఈ లెక్క చొప్పున యావరేజ్ వినియోగం 1.25Mbps. అంటే ఏదైనా వీడియోను 480p లో వీక్షిస్తే.. నిమిషానికి 9.375MB డేటా ఖర్చవుతుంది. అదే క్వాలిటీలో గంట సేపు చూస్తే 562.5MB డేటా ఖర్చవుతుంది.
- 144p: -- (No bitrate provided by YouTube.)
- 240p: గంటకు 225MB
- 360p: గంటకు 315MB
- 480p: గంటకు 562.5MB
- 720p at 30FPS: గంటకు 1237.5MB
- 720p at 60FPS: గంటకు 1856.25MB (1.86GB)
- 1080p at 30FPS: గంటకు 2.03GB
- 1080p at 60FPS: గంటకు 3.04GB
- 1440p (2K) at 30FPS: గంటకు 4.28GB
- 1440p (2K) at 60FPS: గంటకు 6.08GB
- 2160p (4K) at 30FPS: గంటకు 10.58GB
- 2160p (4K) at 60FPS: గంటకు 15.98GB
ఎంత డేటా వినియోగం అవుతుందో తెలుసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు సెట్టింగ్స్ > నెట్వర్క్ & ఇంటర్నెట్ > మొబైల్ నెట్వర్క్కి వెళ్లి యాప్ డేటా యూసేజ్‌ని సెలెక్ట్ చేసి యూట్యూబ్‌పై క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి. ఇది కొన్ని వెర్షన్లలో వేరేలా ఉంటుంది. సెట్టింగ్స్ >యాప్స్ > యూట్యూబ్ >మొబైల్ డేటా & వైఫైని సెలెక్ట్ చేయాలి. ఇక ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్> సెల్యులార్ > యూట్యూబ్‌పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
అధిక డేటా వాడకాన్ని ఎలా తగ్గించాలి ?
- మొదటగా హై రిజల్యూషన్ లో వీడియోలు చూడటం ఆపాలి. ముఖ్యంగా మొబైల్ డేటా వాడుతున్నప్పుడు.
- రెండోదిగా వీడియో ప్రారంభంలోనే క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటే డేటా ఆదా అవుతుంది. అందులో ఆటో క్వాలిటీని ఎంచుకుంటే ప్రతి వీడియోకు అదే వర్తిస్తుంది. లేదా హైయర్ పిక్చర్ క్వాలిటీ లేదా డేటా సేవర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
- మూడోదిగా డీఫాల్ట్ వీడియో క్వాలిటీని ఎంచుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి.
వీడియోకు ముందు, మధ్యలో వచ్చే యాడ్స్ వల్లా డేటా ఖర్చవుతుంది. యాడ్స్ నుంచి బయటపడాలంటే యూట్యూడ్ ప్రీమియం తీసుకోవచ్చు. దాని విలువ నెలకు 12 డాలర్లు. ఫలితంగా అన్ని వీడియోలను ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకుని తీరిక ఉన్నప్పుడు చూసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో వీడియోలు చూసినా యాడ్స్ రావు.