ETV Bharat / science-and-technology

Home Wifi safety : హోమ్ వైఫైకి హ్యాకర్స్ బెడద.. ఈ టిప్స్ పాటించి సేఫ్​గా ఉండండి! - వైఫై సెక్యూరిటీ

Home Wifi safety tips : ఇంట్లో మీరు వైఫై వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి! హ్యాకర్స్​ నుంచి ఎప్పుడైనా ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అందుకే హోమ్​ వైఫైని సురక్షితంగా ఉంచుకునే.. కొన్ని టిప్స్​ మీ కోసం..

keep your home WiFi safe with these simple and useful tips
Home Wifi safety
author img

By

Published : Jun 13, 2023, 9:40 AM IST

Home WIFI safety tips : మీరు మీ ఇంట్లో వైఫై వాడుతున్నారా? చక్కగా మీ ల్యాప్​టాప్స్​, మొబైల్స్, ట్యాబ్స్​ను.. అమెజాన్​ అలెక్సా లాంటి టెక్​ గ్యాడ్జెట్స్​ను వైఫైతో అనుసంధానం చేసి వాడుకుంటున్నారా? ​ఓకే గుడ్​. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వైర్​లెస్​ డివైజ్​ కనెక్టివిటీ వచ్చిన తరువాత నెట్​వర్క్ సెక్యూరిటీ అన్నది చాలా కష్టమైపోతోంది. ముఖ్యంగా హ్యాకర్స్​ బెడద చాలా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో వాడుతున్న వైఫైని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చూద్దాం.

how to secure WiFi from hackers : గుడ్​ న్యూస్​ ఏమిటంటే, మీ వైఫైని సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు కచ్చితంగా టెక్ గీక్​ కానీ, సెక్యూరిటీ ఎక్స్​పర్ట్​గానీ కానవసరం లేదు. కింద పేర్కొన్న టిప్స్​ను అనుసరిస్తే చాలు.. మీ వైఫైని మీరే స్వయంగా సురక్షితం చేసుకోవచ్చు. అలాగే మీ ప్రియమైన వారి డేటాను హ్యాకర్స్​ చోరీ చేయకుండా కాపాడుకోవచ్చు.

  • మీ హోమ్​ నెట్​వర్క్​కు ఎప్పుడూ మీ డిఫాల్ట్​ నేమ్​ & పాస్​వర్డ్స్​ పెట్టకండి. కఠినమైన పాస్​వర్డ్ పెట్టడం వల్ల మీ వైఫైని అంత సులభంగా ఎవరూ క్రాక్​ చేయలేరు.
  • అపరిచితులకు మీ వైఫైని షేర్​ చేయకండి. ఉదాహరణకు మీ ఇంటిలో రిపేర్​ వర్క్​ చేయడానికి వచ్చిన వ్యక్తికి మీ వైఫైని షేర్​ చేయాల్సిన అవసరం లేదు.
  • గెస్ట్​ వైఫై నెట్​వర్క్​ను క్రియేట్​ చేసుకోండి. ఒక వేళ అపరిచితులకు మీరు వైఫైని షేర్​ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల మీ ప్రైమరీ వైర్​లెస్​ నెట్​వర్క్​కు ఎలాంటి ఇబ్బందీ కలగదు. అలాగే మీ సిస్టమ్​లోని ఫైల్స్​, ఫోల్డర్స్​, ప్రింటర్స్​, స్టోరేజ్​ డివైజ్​లను ఇతరులు యాక్సెస్​ చేయడానికి వీలుపడదు.
  • వైఫై ఎన్​క్రిప్షన్స్​ ఎనేబుల్​ చేసుకోండి. దీని వల్ల మీ డేటాను ఇతరులు చూడడానికి, యాక్సెస్​ చేయడానికి వీలుపడదు. అలాగే లాగిన్​ కాకుండా.. ఇతరులు ఎవ్వరూ మీ వైఫై వాడుకోలేరు.
  • ఫైర్​వాల్​ను ఎనేబుల్​ చేసుకోండి. దీని వల్ల మీ నెట్​వర్క్​కు అవసరంలేని ట్రాఫిక్​ తగ్గిపోతుంది.
  • మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వైఫైని స్విచ్​ ఆఫ్ చేయండి. దీని వల్ల మీరు లేనప్పుడు కూడా మీ వైఫై నెట్​వర్క్ సురక్షితంగా ఉంటుంది.
  • మీ రూటర్​ ఫర్మ్​వేర్​ను క్రమం తప్పకుండా అప్​డేట్​ చేస్తూ ఉండండి. ఇందుకోసం రూటర్​ను తయారుచేసిన కంపెనీ వెబ్​సైట్​ నుంచి అప్​డేట్ ఫైల్స్​ని డౌన్​లోడ్​ చేసుకుని, ఇన్​స్టాల్​ చేయండి.
  • రిమోట్​ యాక్సెస్​ను నిలిపివేయండి. వాస్తవానికి రిమోట్​ యాక్సెస్​ ద్వారా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ వైఫైని సమర్థవంతంగా వాడుకోవచ్చు. కానీ దీని వల్ల హ్యాకర్స్​ నుంచి ముప్పు కూడా బాగానే ఉంటుంది. అందువల్ల అవసరం లేనప్పుడు రిమోట్​ యాక్సెస్​ను నిలిపివేయడమే మంచిది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.