ETV Bharat / science-and-technology

ఇన్​యాక్టివ్ జీ-మెయిల్స్​ తొలగించనున్న గూగుల్​​ - ఈ టెక్నిక్స్​ పాటిస్తే మీ అకౌంట్ సేఫ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:14 PM IST

Google Will Delete Inactive Accounts : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇన్​ యాక్టివ్ జీ-మెయిల్​ అకౌంట్లను తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఎందువల్ల గూగూల్ ఇనాక్టివ్ జీ-మెయిల్ ఖాతాలను డిలీట్ చేస్తుంది? ఏం చేస్తే జీ-మెయిల్ అకౌంట్​ డిలీట్ అవ్వకుండా ఉంటుంది? తదితర వివరాలు మీ కోసం.

gmail account delete process
Google Will Delete Inactive Accounts

Google Will Delete Inactive Accounts : మీరు మీ జీ-మెయిల్ అకౌంట్​ను చాలా కాలంగా ఉపయోగించట్లేదా? అయితే త్వరపడండి. గూగుల్ మరికొద్ది రోజుల్లో ఇన్​యాక్టివ్ జీ-మెయిల్ అకౌంట్లను తొలగించనుంది. ఇదే జరిగితే మీ జీ-మెయిల్​, గూగుల్ డ్రైవ్​, డాక్స్​ సహా పలు గూగుల్ ప్రొడక్టుల్లోని మీ డేటా మొత్తం డిలీట్​ అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

WHY IS GOOGLE DELETING INACTIVE ACCOUNTS : జీ-మెయిల్ అకౌంట్ల భద్రతను మెరుగుపర్చేందుకు.. దాదాపు రెండేళ్లుగా ఇన్​యాక్టివ్​గా ఉన్న ఖాతాలను తొలగించనున్నామని గూగుల్ సంస్థ మే నెలలో ప్రకటించింది. సాధారణంగా ఇన్​యాక్టివ్​ ఖాతాల్లో టు-ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఉండదు. అందువల్ల ఇవి హ్యాకింగ్​కు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు సైబర్ నేరగాళ్లు.. సాధారణ యూజర్ల ఖాతాలను చట్ట వ్యతిరేక, అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశముంది. అంతే కాదు యూజర్ల ఐడెంటిటీని కూడా దొంగిలించే ప్రమాదం ఉంటుంది. అందుకే సదరు ఖాతాలను డిసెంబర్​ నుంచి తొలగించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

జీ-మెయిల్ అకౌంట్​ డిలీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  • కనీసం రెండు సంవత్సరాలకు ఒక సారైనా మీ జీ-మెయిల్ అకౌంట్​లోకి సైన్​ఇన్​ కావాలి.
  • మీ జీ-మెయిల్ ఖాతా ఉపయోగించి ఇతరులకు మెయిల్​లు పంపుతూ ఉండాలి.
  • మీ జీ-మెయిల్ అకౌంట్​తో లాగిన్​ అయ్యి​ గూగుల్ సెర్చింజన్​ను ఉపయోగించాలి.
  • యూట్యూబ్ వీడియోలు చూడాలి.
  • గూగుల్ ఫొటోస్​ అప్లికేషన్​ను ఉపయోగిస్తుండాలి.
  • మీ గూగుల్ అకౌంట్​తో.. థర్డ్ పార్టీ యాప్​ల్లో లాగిన్ అయినా.. సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకున్నా.. సదరు అకౌంట్లు కూడా డిలీట్ కావు.

మినహాయింపులు ఏమైనా ఉన్నాయా?
రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్​యాక్టివ్​గా ఉన్న వ్యక్తిగత ఖాతాలను మాత్రమే గూగుల్ డిలీట్ చేస్తుంది. పాఠశాలలు, వివిధ కంపెనీలకు చెందిన జీ-మెయిల్ అకౌంట్లను మాత్రం తొలగించమని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ ప్రొడక్టులు, యాప్స్​, సబ్​స్క్రిప్షన్లు తీసుకున్న అకౌంట్లను; గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్​ ఉన్న అకౌంట్లకు కూడా మినహాయింపు ఉంది. యూట్యూబ్​ ఖాతాలకు లింకైన అకౌంట్లను కూడా డిలీట్​ చేయమని గూగుల్ స్పష్టం చేసింది.

మీ జీ-మెయిల్ అకౌంట్​లోని​ డాటాను సేవ్ చేయొచ్చా?
గూగుల్ టేక్ అవుట్​ను ఉపయోగించి ఏ సమయంలోనైనా మీ జీ-మెయిల్ ఖాతాలోని డేటాను ఎక్స్​పోర్ట్, డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు అవసరమైన (ఫైల్స్​, ఫొటోస్​) డేటాను.. మీ కుటుంబ సభ్యులు, విశ్వసనీయ వ్యక్తులకు పంపించవచ్చు. గూగుల్ తరచుగా మీ జీ-మెయిల్ ఖాతా రికవరీ అకౌంట్​ను అప్​డేట్ చేయమని అడుతుంది. అలాంటి సమయంలో అప్​డేట్ చేయాలనుకుంటే చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా ఖాతాదారుడు మరణించి ఉంటే.. అతని గూగుల్​ అకౌంట్​లోని డేటాను.. సదరు వ్యక్తికి సంబంధించి కుటుంబ సభ్యులకు అందిస్తుంది.

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

పాస్​వర్డ్​లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్​పర్ట్స్ మాటేమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.