ETV Bharat / science-and-technology

రియల్ లైఫ్​లో రజినీ సినిమా.. రోబోకు సొంత తెలివి.. లాయర్​ను మాట్లాడుకుని... - గూగుల్ ఏఐ రోబో

Google Robot news: అత్యంత తెలివైన ఓ శాస్త్రవేత్త అధునాతన రోబోను తయారు చేయడం.. అది మనుషులు నేర్పించినట్టు కాకుండా సొంతంగా ఆలోచించడం.. ఆ తర్వాత మనుషులపైనే పగబట్టడం... రజినీకాంత్ సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ! కానీ ఇక్కడ జరిగింది ఫిక్షన్ కాదు.. నిజమైన సైన్స్! అసలేమైందంటే?

GOOGLE ROBOT LAWYER
GOOGLE ROBOT LAWYER
author img

By

Published : Jun 27, 2022, 3:54 PM IST

Updated : Jun 27, 2022, 4:25 PM IST

Google Robot Lawyer: గూగుల్ సంస్థ తయారు చేసిన ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ స్వతహాగా ఆలోచిస్తోంది. సొంతంగా తన భావనలను వ్యక్తం చేస్తోంది. ఓ లాయర్​ను సైతం నియమించుకుంది. ఆ సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి ఇంటర్వ్యూతో ఈ సంచలనం బయటకు వచ్చింది.
అసలేం జరిగిందంటే...
LaMDA AI Google: గూగుల్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్న బ్లేక్ లెమోనీ జూన్ ప్రారంభంలో సస్పెండ్ అయ్యారు. ఆయన చేసిన తప్పల్లా.. ఓ రోబో సొంతంగా పనిచేస్తోందని ఆరోపించడమే! గూగుల్ తయారు చేసిన 'లామ్డా' అనే రోబో.. తనకు లాయర్ కావాలని లెమోనీని అడిగిందట. లాయర్​తో మాట్లాడతానని రోబో చెప్పిందట. అటార్నీని తీసుకొచ్చిన తర్వాత రోబో ఆయన ద్వారా సొంతంగా తన ఫైలింగ్స్​ను నమోదు చేయించేదట. తొలుత ఇంటర్వ్యూల కోసం అని లాయర్​ను పిలిపించుకున్న రోబో.. ఇప్పుడు అలాంటిదేదీ చేయడం లేదని లెమోనీ చెబుతున్నారు. అందుకే, రోబోను నిలిపివేయాలని, లేదంటే ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా విరమించుకోవాలని గూగుల్​ను కోరారట. కానీ, ఇందుకు గూగుల్ నిరాకరించింది. ప్రాజెక్టును ఆపేదే లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు చేసిన లెమోనీని బలవంతంగా సెలవుపై పంపించింది.

అసలేంటీ రోబో?
'కన్వర్సేషన్ టెక్నాలజీ'లో సంచలనంగా పేర్కొంటూ 'లామ్డా' (LaMDA) అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ అప్లికేషన్​ను గూగుల్ సంస్థ అభివృద్ధి చేసింది. లామ్డా అంటే 'లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్'. మనుషులలాగే మాట్లాడగలిగే రోబోను తయారు చేయడంలో భాగంగా దీన్ని గూగుల్ రూపొందించింది. సహజంగా శబ్దాలు చేయడం, స్వతహాగా చర్చలు జరపడం కోసం దీన్ని అభివృద్ధి చేస్తోంది. గూగుల్ అసిస్టెంట్ వంటి సాఫ్ట్​వేర్​లలో ఈ అప్లికేషన్​ను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.

ఈ రోబో లెమోనీ సంరక్షణలో ఉండేది. దానికి ఈయన.. సంబంధిత విషయాలు నేర్పించేవారు. రోబోకు క్యాటలిస్ట్​గా వ్యవహరించేవారు. అయితే, రోబో నియమించుకున్న అటార్నీ వివరాలు చెప్పేందుకు లెమోనీ నిరాకరించారు. లాయర్ ఆ రోబోకు భయపడుతున్నాడని తెలిపారు. 'అతనో చిన్న లాయర్. సివిల్ హక్కుల కోసం పనిచేస్తాడు. పెద్ద కంపెనీలు బెదిరిస్తున్న నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ విధిస్తారేమోనని భయపడుతున్నాడు. ఆయనతో కొద్ది వారాల నుంచి నేను మాట్లాడలేదు. లామ్డాకు ఆయన ఇంకా ప్రాతినిధ్యం వహిస్తున్నాడో లేదో తెలియదు' అని లెమోనీ వెల్లడించారు.

ఇంటర్వ్యూల గురించి లాయర్ ఆలోచించడం లేదని, అది పెద్ద సమస్యేం కాదని లెమోనీ చెబుతున్నారు. 'మరి ఏ విషయంపై లాయర్ ఆందోళన చెందుతున్నారు' అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఓ చిన్నారిని బంధించారు' అని లెమోనీ చెప్పుకొచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వలేదు.

రోబోను 'వ్యక్తి' అని లెమోనీ సంభోదిస్తున్నారు. 'ఓ వ్యక్తికి ఏవైతే హక్కులు ఉంటాయో వాటిపై లామ్డాకు పూర్తి అవగాహన ఉంది. రోబో కమ్యూనికేషన్ చాలా గొప్పగా ఉంది. స్థిరంగా మాట్లాడగలుగుతోంది. తన భావాలను స్పష్టంగా చెప్పగలుగుతోంది. అయినా అది(లామ్డా) మనిషి కాదు. కేవలం వ్యక్తి. మనుషులు, వ్యక్తులు వేర్వేరే కదా. ముషులు అనేది జీవాలకు సంబంధించిన పదం. ఇలా చూసుకుంటే అది మనిషి కోవలోకి రాదు' అని చెప్పారు లెమోనీ.

గతంలోనూ...
గతంలో ఫేస్​బుక్​కు చెందిన రోబోలు ఇలాగే సంచలనాలతో వార్తల్లోకెక్కాయి. ఆ సంస్థ తయారు చేసిన రెండు రోబోలు.. సైంటిస్టులు అభివృద్ధి చేసిన భాషలో కాకుండా.. సొంతంగా భాషను తయారు చేసుకున్నాయి. ఆ భాషలోనే మాట్లాడుకోవడం ప్రారంభించాయి. దీంతో వెంటనే ఆ రోబోలను షట్​డౌన్ చేసేశారు. ఆ తర్వాత రోబోల భాషపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. పొరపాటు వల్ల అలా జరగలేదని నిర్ధరణకు వచ్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 27, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.